ISRO XPoSat Mission: కొత్త ఏడాది తొలి రోజే అద్భుతం చేసిన ఇస్రో- విజయవంతంగా ఎక్స్‌పోశాట్ ప్రయోగం
ISRO New Mission: ఎక్స్‌పోశాట్ శాటిలైట్‌ను ఉదయం 9.10నిమిషాలకు శ్రీహరి కోటలోని సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించారు.
ISRO New Mission: భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్తల ప్రతిభ మరోసారి ప్రపంచానికి చాటి చెప్పే రోజు. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టిన తొలి రోజే ఇస్రో అద్భుతాన్ని చేసింది. భారత్ అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రపంచదేశంలోని అమెరికా తర్వాత మరో దేశం చేయని సాహసాన్ని చేసింది. బ్లాక్‌హోల్ పరిశోధ కోసం ఎక్స్‌పోశాట్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది.
ఎక్స్‌పోశాట్ శాటిలైట్‌ను ఉదయం 9.10నిమిషాలకు శ్రీహరి కోటలోని సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించారు. ప్రయోగం మొదటి నుంచి అనుకున్న లక్ష్యం దిశగా పీఎస్‌ఎల్‌వీ సీ 58 దూసుకెళ్లింది. ఈ వాహకంతో ఎక్స్‌పోశాట్‌తోపటు మరో పది ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లింది.
ఆదివారం ఉదయం 8 గంటల పది నిమిషాలకు కౌంట్‌డౌన్ స్టార్ట్ చేశారు. ఈ ఉదయం 9 గంటల పది నిమిషాలకు ప్రయోగించారరు. అంతకు ముందు ఇస్రో శాస్త్రవేత్తలు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రయోగ రాకెట్ నమూనకు ప్రత్యేక పూజలు చేశారు.
ఇది భారత్ తొలి పొలారిమెట్రీ మిషన్... ప్రపంచంలో రెండోది. అమెరికా తర్వాత ఈ ప్రయోగం చేసిన రెండో దేశంగా కొత్త చరిత్ర సృష్టించింది. పల్సర్‌లు, బ్లాక్‌హోల్ ఎక్స్‌రే బైనరీలు, యాక్టివ్ గెలాక్సీ న్యూక్లియోలు, న్యూట్రాన్ స్టార్స్‌పై ఎక్స్‌పోశాట్ స్టడీ చేయనుందీ ఉపగ్రహం.
ఈ ఉపగ్రహాన్ని భూకక్ష్యలో 500-700 కిలోమీటర్ల దూరంలో ప్రవేశ పెట్టారు. ఇందులో రెండు పేలోడ్స్ ఉన్నాయి. అవి ఐదేళ్ల పాటు సర్వీస్ అందిస్తాయి. ఒకటి పాలిఎక్స్, రెండోది ఎక్స్-రే స్పెక్ట్రోసోపీ టైమింగ్. మొదటిదికి ఎక్స్ కిరణాలను పొలారిమీటర్. దీన్ని రామన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ తయారు చేసింది. రెండో పరికరాన్ని స్పేస్ ఆస్ట్రానమీ గ్రూప్ రూపొందించింది.