అన్వేషించండి

Giorgia Meloni: ఒకప్పుడు బేబీ సిట్టర్‌, ఇప్పుడు ఇటలీ ప్రధాని - మెలోని గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

Italy PM Georgia Meloni: ఇటలీ ప్రధాని జార్జియా మెలోని 15 ఏళ్లకే రాజకీయాల్లోకి అడుగు పెట్టి సంచలనం సృష్టించారు.

Facts About Italy PM Georgia Meloni: ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, భారత ప్రధాని నరేంద్ర మోదీ మంచి మిత్రులు. కలుసుకున్న ప్రతిసారీ ఇద్దరూ చాలా ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకుంటారు. G7 సదస్సులోనూ వాళ్లిద్దరి సెల్ఫీ సోషల్ మీడియాలో (Modi Meloni) సెన్సేషన్‌ అవుతోంది. అన్నింటి కన్నా ఆసక్తికరమైన విషయం ఏంటంటే...G7 సమ్మిట్‌కి వచ్చిన అతిథులకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నమస్తే పెట్టారు మెలోని. ఈ వీడియోలు కూడా తెగ వైరల్ అయ్యాయి. మోదీ నేర్పిన సంస్కారం అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే #Melodi హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్ అవుతోంది. అంతే కాదు. మెలోని గురించి కూడా సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు. 

ఆసక్తికర విషయాలివే..

2022 అక్టోబర్‌లో తొలిసారి ఇటలీకి ప్రధానిగా ఎన్నికయ్యారు జార్జియా మెలోని. Brothers of Italy అనే రైట్‌ వింగ్ పార్టీని ఆమె ముందుండి నడిపించారు. అంతకు ముందు ఈ పార్టీ ఉనికి అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ మెలోనీ పగ్గాలు చేపట్టాక ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించుకుంది. ఎన్నికల్లో విజయం సాధించింది. చిన్న వయసులోనే పొలిటికల్ జర్నీ మొదలు పెట్టారు జార్జియా మెలోని. మెలోని పుట్టిన తరవాత తండ్రి వదిలేసి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి తల్లి సంరక్షణలోనే ఉన్నారు. సొంత కాళ్లపై నిలబడాలన్న పట్టుదలతో బేబీ సిట్టర్‌గా, బార్‌టెండర్‌గా పని చేశారు. ఆ వచ్చిన డబ్బుతోనే చదువుకున్నారు. 15 ఏళ్లకే Italian Social Movement కి చెందిన యూత్ ఫ్రంట్‌లో చేరారు. అందులో చాలా యాక్టివ్‌గా ఉంటూ ఒక్కో మెట్టు ఎక్కారు. 2008-11 వరకూ మంత్రిగానూ పని చేశారు. 

Meloni, the leader of the Brothers of Italy party, speaks outside the Italian parliament in Rome in December 2018.

(Image Credits: Getty)

వలసలపై ఆంక్షలు..

2022లో ప్రధాని అయిన తరవాత సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. వలసలను ఆపేందుకు ప్రత్యేక పాలసీ ప్రవేశపెట్టారు. సరిహద్దు నుంచి ఎవరూ అక్రమంగా దేశంలోకి చొరబడకుండా నిఘా పెట్టేలా ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇటలీలో బర్త్ రేట్‌ పెరగాలనీ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అవసరమైతే ఆయా కుటుంబాలకు ఆర్థికంగా సాయం చేస్తామనీ ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థను ఓ గాడిన పెట్టడం, పన్నులు తగ్గించడం లాంటి చర్యలు ఆమెకి మంచి పేరు తెచ్చి పెట్టాయి. ప్రతిపక్షాల అనవసరపు ఆరోపణలు, విమర్శల్ని చాలా తేలిగ్గా కొట్టి పారేస్తారు మెలోని. అంతే కాదు. ఐరోపా సమాఖ్యలోని విధానాలనూ విమర్శించారు. మెలోనీ హయాంలో ఇతర రైట్‌ వింగ్‌ దేశాలతో ఇటలీకి మైత్రి బలపడింది. ముఖ్యంగా యూరప్, హంగేరి, పోలాండ్ దేశాలతో బంధాన్ని బలపరుచుకుంది. NATOలో ఇటలీ ప్రాధాన్యతనీ పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు మెలోని. ఎక్కడ ప్రచారానికి వెళ్లినా, ఎక్కడ ఏ సభ జరిగినా "I am Giorgia, I am a woman" అని చాలా గట్టిగా నినదిస్తారు. అదే ఆమెకి ప్రత్యేకతని తెచ్చి పెట్టింది. కుటుంబ విలువల పట్ల ఆమెకి ఎంతో గౌరవం. అందుకే..పిల్లల్ని కనండి, వాళ్లకు విలువలు నేర్పించండి, ప్రభుత్వం సాయం చేస్తుందని చెబుతారు మెలోని. 

Also Read: G7 Summit: స్మైల్ ప్లీజ్, G7 సమ్మిట్‌లో మెలోని మోదీ స్పెషల్ సెల్ఫీ - ఫొటో వైరల్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

WPL Winner Mumbai Indians: హ‌ర్మ‌న్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ముంబైని గెలిపించిన బౌల‌ర్లు.. రెండోసారి డ‌బ్ల్యూపీఎల్ టైటిల్ కైవ‌సం.. 8 ర‌న్స్ తో ఢిల్లీ చిత్తు
హ‌ర్మ‌న్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ముంబైని గెలిపించిన బౌల‌ర్లు.. రెండోసారి డ‌బ్ల్యూపీఎల్ టైటిల్ కైవ‌సం.. 8 ర‌న్స్ తో ఢిల్లీ చిత్తు
Telangana Latest News: తెలంగాణ రాజకీయాల్లోకి పవన్ ఎంట్రీ పాస్ అదేనా?
తెలంగాణ రాజకీయాల్లోకి పవన్ ఎంట్రీ పాస్ అదేనా?
Vijayasai Reddy:  కోటరీ వదలదు, కోట కూడా మిగలదు - జగన్‌పై మరోసారి విజయసాయిరెడ్డి సెటైర్లు
కోటరీ వదలదు, కోట కూడా మిగలదు - జగన్‌పై మరోసారి విజయసాయిరెడ్డి సెటైర్లు
Revanth Reddy: రెండో సారీ నేనే ముఖ్యమంత్రి - పథకాల లబ్దిదారులే మా ఓటర్లు - రేవంత్ చిట్‌చాట్
రెండో సారీ నేనే ముఖ్యమంత్రి - పథకాల లబ్దిదారులే మా ఓటర్లు - రేవంత్ చిట్‌చాట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CM Revanth Reddy on KCR Life Threat | కేసీఆర్ ప్రాణాలకు ప్రమాదం..సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు | ABPPawan Kalyan vs Tamilnadu Leaders | తమిళనాడు నుంచి వస్తున్న రియాక్షన్స్ పై పవన్ సంజాయిషీ | ABP DesamDavid Warner Poster From Robin Hood Movie | వార్నర్ పోస్టర్ రిలీజ్ చేసిన రాబిన్ హుడ్ టీం | ABP DesamPawan Kalyan on Tamilnadu Hindi Protest | తమిళనాడు హిందీ ఉద్యమాన్నే టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్ |ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
WPL Winner Mumbai Indians: హ‌ర్మ‌న్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ముంబైని గెలిపించిన బౌల‌ర్లు.. రెండోసారి డ‌బ్ల్యూపీఎల్ టైటిల్ కైవ‌సం.. 8 ర‌న్స్ తో ఢిల్లీ చిత్తు
హ‌ర్మ‌న్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ముంబైని గెలిపించిన బౌల‌ర్లు.. రెండోసారి డ‌బ్ల్యూపీఎల్ టైటిల్ కైవ‌సం.. 8 ర‌న్స్ తో ఢిల్లీ చిత్తు
Telangana Latest News: తెలంగాణ రాజకీయాల్లోకి పవన్ ఎంట్రీ పాస్ అదేనా?
తెలంగాణ రాజకీయాల్లోకి పవన్ ఎంట్రీ పాస్ అదేనా?
Vijayasai Reddy:  కోటరీ వదలదు, కోట కూడా మిగలదు - జగన్‌పై మరోసారి విజయసాయిరెడ్డి సెటైర్లు
కోటరీ వదలదు, కోట కూడా మిగలదు - జగన్‌పై మరోసారి విజయసాయిరెడ్డి సెటైర్లు
Revanth Reddy: రెండో సారీ నేనే ముఖ్యమంత్రి - పథకాల లబ్దిదారులే మా ఓటర్లు - రేవంత్ చిట్‌చాట్
రెండో సారీ నేనే ముఖ్యమంత్రి - పథకాల లబ్దిదారులే మా ఓటర్లు - రేవంత్ చిట్‌చాట్
Pawan Kalyan Latest News: అవగాహన లేకే నాపై దుష్ప్రచారం- ప్రకాశ్‌రాజ్‌పై పవన్ పంచ్‌లు !
అవగాహన లేకే నాపై దుష్ప్రచారం- ప్రకాశ్‌రాజ్‌పై పవన్ పంచ్‌లు !
Telangana Latest News: కేసీఆర్‌ రూ.57 లక్షలు జీతం తీసుకున్నారు- కుటుంబ సభ్యులతోనే ఆయనకు ప్రాణహాని: సీఎం రేవంత్‌రెడ్డి
కేసీఆర్‌ రూ.57 లక్షలు జీతం తీసుకున్నారు- కుటుంబ సభ్యులతోనే ఆయనకు ప్రాణహాని: సీఎం రేవంత్‌రెడ్డి
DMK Comments On Pawan Statement: పవన్ పుట్టక ముందు నుంచే హిందీ వ్యతిరేకులం, నటుల అభిప్రాయాలతో పని లేదు: డీఎంకే ఎటాక్
పవన్ పుట్టక ముందు నుంచే హిందీ వ్యతిరేకులం, నటుల అభిప్రాయాలతో పని లేదు: డీఎంకే ఎటాక్
Telangana CM Revanth Reddy:
"రక్తమరుగుతుంది, బట్టలూడదీసికొడతారు"- జర్నలిస్టులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు 
Embed widget