Indian Navy BEL Contract: ఇక డ్రోన్లు కంచె దాటొస్తే ఖతం.. 'బీఈఎల్'తో ఇండియన్ నేవీ ఒప్పందం
యాంటీ డ్రోన్ రక్షణ వ్యవస్థపై భారత్ దృష్టి సారించింది. ఇందులో భాగంగా బీఈఎల్ సంస్థతో భారత నౌకాదళం ఒప్పందం కుదుర్చుకుంది.
భారత్‌కు విద్రోహ డ్రోన్లు భద్రతాపరమైన చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. దేశ సరిహద్దుల్లో రక్షణ సిబ్బందికి సవాళ్లు విసురుతున్నాయి. వీటి ద్వారా ఆయుధాలు చేరవేసి మనదేశంలో విధ్వంసం సృష్టించాలని పాకిస్థాన్ కుట్రలు పన్నుతోంది. వీటిని ధ్వంసం చేసేందుకు భారత్ రక్షణశాఖ దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే నావల్ యాంటీ డ్రోన్ సిస్టమ్ కోసం బీఈఎల్ తో భారత నౌకాదళం కాంట్రాక్ట్ సంతకం చేసింది.
Indian Navy signs contract with BEL for supply of Naval Anti Drone System with both hard kill and soft kill capabilities
— PIB India (@PIB_India) August 31, 2021
It can instantly detect, jam micro drones and use a laser-based kill mechanism to terminate targets
Read more: https://t.co/YQO9uH7AuU pic.twitter.com/iMaBkfI47u
హైలెట్స్ ఇవే..
- ఇది తొలి స్వదేశీ యాంటీ డ్రోన్ వ్యవస్థ. తొలుత భారత నౌకాదళంలో ఇది చేరనుంది.
- డ్రోన్లను వెను వెంటనే గుర్తించి, మైక్రో డ్రోన్లను ఈ రక్షణ వ్యవస్థ జామ్ చేయగలదు.
- డ్రోన్లను గుర్తించి సాఫ్ట్‌కిల్, హార్డ్‌కిల్ విధానాల ద్వారా వాటిని నిర్వీర్యం చేస్తుంది.
- ఇదే తరహాలో భారత ఆర్మీ, వాయుసేనతో కూడా బీఈఎల్ కాంట్రాక్ట్ సంతకం చేయనుంది.
జీపీఎస్ జామింగ్
విద్రోహ డ్రోన్ తన మార్గనిర్దేశం కోసం జీపీఎస్‌ను వాడుతుంటుంది. ఆ జీపీఎస్ సంకేతాలను ఈ వ్యవస్థ ఏమారుస్తుంది. ఈ విధానం ద్వారా లోహవిహంగాన్ని తన గమ్యస్థానానికి వెళ్లకుండా చేయవచ్చు. కొన్ని అధునాతన పద్ధతుల్లో స్పూఫింగ్ విధానం ద్వారా తాను వేరే చోట ఉన్నట్లుగా ఆ డ్రోన్‌ను భ్రమింపచేస్తుంది.
Also Read: Al Qaeda on Taliban: తాలిబన్లకు అల్ ఖైదా అభినందనలు.. 'కశ్మీర్'పై కీలక వ్యాఖ్యలు
పాక్ కు చెక్..
ఏటా 100-150 సార్లు విద్రోహ డ్రోన్లు భారత్‌లోకి చొరబడుతున్నట్లు అంచనా. జమ్మూలోని వైమానిక దళ స్థావరంలో జూన్ 27న జరిగిన డ్రోన్ దాడి, జులై 14న సరిహద్దుల్లో ఒక క్వాడ్ కాప్టర్ చొరబాటు యత్నం ఈ కోవలోనివే. ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొనాలనేది.. ఇప్పుడు మనముందున్న ప్రధాన సమస్య. దీనికి పరిష్కారంగా యాంటీ డ్రోన్ సాంకేతికతపై మనదేశం దృష్టి సారించింది.