డబ్బుకి ఆశపడి పాక్‌కి గూఢచర్యం, ఇండియన్ ఎంబసీ ఉద్యోగి అరెస్ట్
Embassy Employee Arrest: పాకిస్థాన్‌కి చెందిన ISIకి గూఢచర్యం చేస్తున్న ఇండియన్ ఎంబసీ ఉద్యోగిని అధికారులు అరెస్ట్ చేశారు.
Indian Embassy Employee Arrest: మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో పని చేస్తున్న ఓ ఉద్యోగిని ఉత్తరప్రదేశ్ Anti-Terrorism Squad అరెస్ట్ చేసింది. పాకిస్థాన్‌కి చెందిన ISIకి రహస్య సమాచారాన్ని చేరవేస్తున్నట్టు గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకుంది. యూపీలోని మీరట్‌లో అరెస్ట్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. నిందితుడి పేరు సతేంద్ర సివాల్. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖలోని Multi-Tasking Staff గా పని చేస్తున్నాడు. ఎన్నో రోజులుగా భారత విదేశాంగ శాఖలోని కొంతమంది ఉద్యోగులకు ISI ఏజెంట్‌లు వల వేస్తున్నట్టు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ గుర్తించింది. ఇండియన్ ఆర్మీకి సంబంధించిన కీలక సమాచారాన్ని అందించినందుకు భారీ మొత్తంలో నగదు ఇస్తామని ఆశ చూపిస్తోంది ISI. ఈ వలలో పడిన కొందరు ఉద్యోగులు ఇలా రహస్యమైన సమాచారాన్ని చేరవేస్తున్నారు. వెంటనే గుర్తించిన ATS ఆ ఉద్యోగిని అదుపులోకి తీసుకుంది. ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం కావడం వల్ల చాలా తీవ్రంగా పరిగణించింది. హాపూర్‌లోని ఓ గ్రామంలో ఉంటున్న సతేంద్ర సివాల్...ఎప్పటికప్పుడు తన డిసిగ్నేషన్‌ని మారుస్తూ అందరినీ మానిప్యులేట్ చేశాడు. ఎంతో కీలకమైన డాక్యుమెంట్స్‌ని చేజిక్కించుకున్నాడు. రక్షణమంత్రిత్వా శాఖతో పాటు భారత విదేశాంగ శాఖకు సంబంధించిన వివరాలన్నీ ISIకి చేరవేశాడు. డబ్బుకి ఆశపడి ఈ పని చేసినట్టు ATS స్పష్టం చేసింది.
"భారత విదేశాంగమంత్రిత్వ శాఖలోని కొంత మంది ఉద్యోగులకు పాకిస్థాన్‌కి చెందిన ISI సంస్థ వల వేస్తోందని మాకు కచ్చితమైన సమాచారం అందింది. కొందరు ఉద్యోగులు వాళ్ల వలలో పడినట్టు తెలిసింది. భారత ఆర్మీకి చెందిన ఎంతో కీలకమైన సమాచారాన్ని ISIకి చేరవేస్తున్నట్టు గుర్తించాం. ఇది అంతర్గత భద్రతకు ఎంతో ముప్పు తీసుకొచ్చే విషయం. అందుకే ఏ మాత్రం తేలిగ్గా తీసుకోలేదు"
- యాంటీ టెర్రరిజం స్క్వాడ్
మీరట్‌లోని ATS ఫీల్డ్ యూనిట్‌లో సతేంద్ర సివాల్‌ని విచారిస్తున్నారు. విచారణలో చాలా ప్రశ్నలకు ఆయన సరైన సమాధానాలు చెప్పలేదని సమాచారం. గూఢచర్యం చేసినట్టు దాదాపు అంగీకరించాడని తెలుస్తోంది. 2021 నుంచి మాస్కోలోని ఇండియన్ ఎంబసీలో సెక్యూరిటీ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు సతేంద్ర సివాల్. ప్రస్తుతానికి సివాల్‌పై Official Secrets Act కింద కేసు నమోదు చేశారు. పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు.
గుజరాత్‌కి చెందిన ఓ వ్యక్తి ఇండియన్ ఆర్మీకి చెందిన కీలక వివరాలను పాకిస్థాన్‌కి అందిస్తుండడాన్ని గతేడాది అక్టోబర్‌లో పోలీసులు గుర్తించారు. గుజరాత్ పోలీస్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసింది. ఆనంద్ జిల్లాలోని తపూర్ టౌన్‌కి చెందిన వ్యక్తి ఆర్మీకి చెందిన చాలా సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్‌కి చేరవేస్తున్నట్టు గుర్తించారు. భారత్‌కి చెందిన వ్యక్తే అయినప్పటికీ..పాకిస్థాన్ పౌరసత్వం పొందాడు. Pakistani intelligence operative (PIO) అందించిన సమాచారం ప్రకారం యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అప్రమత్తమైంది. 55 ఏళ్ల లాభ్‌శంకర్ మహేశ్వరి (Labshankar Maheshwari) వాట్సాప్ ద్వారా ఆర్మీలోని కొంత మందితో చాట్ చేశాడు. Remote Access Trojan (RAT) పంపుతూ సెన్సిటివ్ ఇన్‌ఫర్మేషన్ అంతా సేకరించాడు. ఇండియన్ సిమ్ కార్డుతో మెసేజ్‌లు పంపాడు.