Indian Army: డ్యూటీలోనే ప్రాణాలర్పించిన కుక్క, సెల్యూట్ చేసిన ఇండియన్ ఆర్మీ
Indian Army: జమ్ము కశ్మీర్‌లో యాంటీ టెర్రరిజం ఆపరేషన్‌లో భాగంగా ఇండియన్ ఆర్మీకి చెందిన శునకం ప్రాణాలు కోల్పోయింది.
Indian Army:
యాక్సెల్‌ను కోల్పోవటం బాధాకరం : ఇండియన్ ఆర్మీ
"పోలీసే కాదు..అతని బెల్ట్ కూడా డ్యూటీ చేస్తుంది". విక్రమార్కుడు సినిమాలోని ఈ డైలాగ్ గుర్తుందా..? థియేటర్‌లో విజిల్స్ వేయించిందీ డైలాగ్. ఇదే మాటను ఇప్పుడు ఆర్మీకి అన్వయించుకోవచ్చు. జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదుల్ని ఏరివేసే పనిలో ఉన్న ఉగ్రవాదులు బారముల్లాలో ఓ టెర్రరిస్ట్‌ను మట్టుబెట్టారు. ఈ క్రమంలోనే ఒకర్ని పోగొట్టుకున్నారు. అయితే కోల్పోయింది సైనికుడిని కాదు. ఉగ్రవాది జాడను కనిపెట్టిన శునకాన్ని. అంటే...ఈ శునకం కూడా తన విధులు నిర్వర్తించే క్రమంలో ప్రాణాలు పోగొట్టుకుంది. రెండు సంవత్సరాల వయసున్న కుక్క, వాసన చూసుకుంటూ ఉగ్రవాది జాడను కనిపెట్టింది. వెంటనే ఆ టెర్రరిస్ట్ గన్‌తో దానిపై కాల్పులు జరిపాడు. వరుసగా మూడు బుల్లెట్లు తాకటం వల్ల అక్కడికక్కడే మృతి చెందింది. "యాంటీ టెర్రర్ ఆపరేషన్‌లో భాగంగా ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టాం. కానీ అంతకు ముందు యాక్సెల్ (కుక్క పేరు)ని కోల్పోయాం" అని సీనియర్ అధికారులు వెల్లడించారు. ఉగ్రవాది పేరు అక్తర్ హుస్సేన్ భట్ అని, ఈ ఆపరేషన్‌లో ఇద్దరు సైనికులతో సహా ఓ పోలీస్ తీవ్రంగా గాయపడ్డారు. 5 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ ఎన్‌కౌంటర్‌లో యాక్సెల్ ప్రాణాలు కోల్పోయింది అని తెలిపారు. టెర్రసిస్ట్ తమపై కాల్పులు జరిపాడని, అతడిని హతమార్చాక ఓ AK రైఫిల్, మూడు మ్యాగజైన్స్, ఒక బ్యాగ్ స్వాధీనం చేసుకున్నట్టు బారముల్లా ఎస్పీ తెలిపారు.
Wreath laying ceremony of Indian #Army's sniffer dog Axel of 26 Army Dog Unit who got KIA during Operation Wanigambala at #Baramulla yesterday.
— Indian Military News (@indmilitarynews) July 31, 2022
Tribute & Salute to Warrior 🌺 pic.twitter.com/qPnC4eIL1x
Indian Army's sniffer dog Axel laid down his life in the line of duty during an operation against Jihadi terrorists in Baramulla, of Jammu Kashmir. Axel was hit by the 3 bullets fired by the terrorists.
— Major Surendra Poonia (@MajorPoonia) July 31, 2022
Tribute & Salute to Warrior 🌺🙏 pic.twitter.com/SvZMAQ39q9
Axel, Indian Army’s two year old assault dog was hit by three bullets and laid down his life in the line of duty during anti-terrorist operation in Baramulla today. Remember, they too serve. pic.twitter.com/wrXDWnJ2mT
— Maverick Musafir (@Maverickmusafir) July 30, 2022
అంత్యక్రియలు పూర్తి చేసిన భారత సైన్యం
ఈ కుక్క ఉగ్రవాదిని పసిగట్టి వెళ్లుంటే ఎన్‌కౌంటర్ ముందుగానే ముగిసిపోయేదని అన్నారు సైనికాధికారులు. అంతకు ముందు జరిగిన పలు కీలక ఆపరేషన్లలో యాక్సెల్ పాల్గొందని, ఎంతో మంది ఉగ్రవాదులను పసిగట్టి వారిని హతమార్చటంలో సహకరించిందని చెప్పారు. ఆర్మీలోని శునకాలకు కొన్ని సందర్భాల్లో కెమెరాలు అమర్చి అనుమానిత ప్రదేశాలకు పంపుతారు. జీపీఎస్ ద్వారా ముష్కరులున్న లొకేషన్‌ని ట్రాక్ చేస్తారు. వాళ్ల వద్ద ఎలాంటి ఆయుధాలున్నాయి..? అనేది తెలుస్తుంది. దీని ఆధారంగానే ఆర్మీ, ఆపరేషన్‌ను ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలోనే యాక్సెల్‌ను కోల్పోయింది భారత సైన్యం. ఈ శునకానికి అంత్యక్రియలు పూర్తి చేశారు.
Also Read: Chiranjeevi First Love Story: ఏడో తరగతిలో ప్రేమలో పడిన మెగాస్టార్ చిరంజీవి
Also Read: Konaseema News : భర్త చర్చికి రానన్నాడని నదిలో దూకి మహిళ ఆత్మహత్య