Konaseema News : భర్త చర్చికి రానన్నాడని నదిలో దూకి మహిళ ఆత్మహత్య
Konaseema News : భర్త చర్చికి రానన్నాడని ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. కోనసీమ జిల్లాలోని పాశర్లపూడి బ్రిడ్జిపై నుంచి దూకి వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది.
Konaseema News : భర్త చర్చికి రానన్నాడని ఓ గ్రామ వాలంటీర్ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలో చోటుచేసుకుంది. ఆదివారం చర్చికి రావాలని భర్తను కోరింది భార్య తులసీ దుర్గ. తాను చర్చికి రానని భర్త చెప్పడంతో చచ్చిపోతానని చెప్పి మోటర్ బైక్ పై ఇంటి నుంచి వెళ్లిపోయింది. కాసేపటికి పాశర్లపూడి బ్రిడ్జిపై నుంచి దూకి మహిళ వాలంటీర్ తులసీ దుర్గ (22)ఆత్మహత్య చేసుకుంది. తులసీ దుర్గ పెదపట్నంలో గ్రామ వాలంటీర్ గా పనిచేస్తున్నారు. ఏపీ టూరిజం సిబ్బంది తులసీని రక్షించేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఆమె మరణించింది. భార్యా మృతదేహం భర్త మురళీ కృష్ణ గుండెపగిలేలా రోధించాడు.
స్విమ్మింగ్ ఫూల్ పడి బాలుడు మృతి
హైదరాబాద్ నార్సింగిలో విషాద ఘటన జరిగింది. కోకాపేటలోని ఓ అపార్ట్‌మెంట్ స్విమ్మింగ్ ఫూల్ లో పడి తొమ్మిదో తరగతి విద్యార్థి మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. శనివారం మధ్యాహ్నం కోకాపేటలోని బంధువుల గృహప్రవేశానికి వచ్చారు ఓ కుటుంబం. ఇవాళ స్విమ్మింగ్ పూల్ వద్ద ఆడుకునేందుకు శ్యామ్ అనే బాలుడు వెళ్లాడు. ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ ఫూల్ పడిన శ్యామ్ ఒక్కసారిగా నీటిలో మునిగిపోయాడు. ఎవ్వరు గమనించకపోవడంతో బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.
శుభకార్యానికి వచ్చి విషాదం
బాలుడు కనిపించకపోవడంతో ఆ ప్రాంతం అంతా వెదికిన తల్లిదండ్రులు, బంధువులు... బాలుడ్ని స్విమ్మింగ్ ఫూల్ లో గుర్తించారు. బాలుడిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. శుభకార్యానికి వచ్చి కొడుకును పోగొట్టుకోవడంతో తల్లిదండ్రులు గుండెలుపగిలేలా రోధించారు. శ్యామ్ స్వస్థలం విజయవాడ. శ్వా్మ్ తల్లిదండ్రులు విజయ్ కుమార్, పద్మారాణి గృహప్రవేశ కార్యక్రమం కోసం హైదరాబాద్ కు వచ్చారు.
విద్యుత్ పోల్స్ పడి ఇద్దరికి గాయాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని పాత సీఎస్పీ వద్ద సింగరేణి విద్యుత్ లైన్ లు మరమ్మత్తులు చేస్తుండగా అపశృతి చోటుచేసుకుంది. విద్యుత్ లైన్ మరమ్మత్తులు చేస్తున్న క్రమంలో విద్యుత్ పోల్స్ విరిగిపడటంతో ఇద్దరు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయాలపాలైన బంటి(19), దీపక్ (22) అనే ఇద్దరు కార్మికులు నేషనల్ హైవే రోడ్డు పనుల కోసం బిహార్ నుంచి వచ్చారు. సింగరేణి ఎలక్ట్రీషియన్ లతో పని చేయించాల్సిన వీరు సింగరేణి అధికారులు నేషనల్ హైవే రోడ్డు సబ్ కాంట్రాక్టర్ తో కుమ్మకై వీరిని విద్యుత్ పోల్స్ ఎక్కించారు. సింగరేణి అధికారులు, నేషనల్ హైవే రోడ్డు సబ్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే వారికి ఈ పరిస్థితి వచ్చిందని తోటి కార్మికులు ఆరోపిస్తున్నారు. దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.