Indian airspace: పాకిస్తాన్‌కు మరో చావుదెబ్బ - పాకిస్తాన్ విమానాలకు భారత గగనతలంలోకి నో ఎంట్రీ ?
Pakistan air Space: భారత గగనతలం లోకి పాకిస్తాన్ విమానాలు రాకుండా అడ్డుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని వల్ల పాకిస్తాన్ విమానయానరంగానికి తీవ్ర నష్టం జరగనుంది.

Indian airspace closed to Pakistani flights: భారత విమానాలు పాకిస్తాన్ మీద నుంచి వెళ్లకుండా ఆ దేశం బ్యాన్ చేసింది. దీని భారత విమానాలకు కొన్ని రూట్లలో దూరం పెరుగుతుంది. అయితే ఎయిర్ స్పేస్ ఉన్నది పాకిస్తాన్ కేనా.. ఇండియాకు లేదా ? అనే డౌట్ చాలా మందికి ఉంది. దానికి ఇప్పుడు సమాధానం లభించింది. భారత ఎయిర్ స్పేస్ ను పాకిస్తాన్ విమానాల కోసం మూసివేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది.
భారతదేశం పాకిస్తాన్ విమానాలకు తన గగనతలాన్ని మూసివేస్తే పాకిస్తాన్ గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు అవుతుందది. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (PIA) వంటి పాకిస్తాన్ విమానయాన సంస్థలు గా యూరప్, ఉత్తర అమెరికా, తూర్పు ఆసియా దేశాల సర్వీసులకు ప్రత్యామ్నాయ గగనతలాన్ని చూసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల దూరం పెరుగుతుంది. ఫలితంగా ప్రయాణ సమయం గంట నుంచి రెండు గంటలు పెరుగుతుంది. ఇంధన ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి. ఇస్లామాబాద్ నుండి లండన్ లేదా న్యూయార్క్ వెళ్లే విమానాలు ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, అరేబియా సముద్రం మీదుగా సుదీర్ఘ మార్గాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ కారణంగా ఆపరేషనల్ ఖర్చులు పెరిగి విమాన సంస్థల లాభాలను తగ్గిస్తాయి. PIA ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నందున, ఈ అదనపు ఖర్చులు ఆ సంస్థ ఆర్థిక స్థిరత్వాన్ని మరింత దెబ్బతీస్తాయి. ఇప్పటికే పాకిస్తాన్ తన గగనతలంపై భారత విమానాలను నిషేధించింది. దీని వల్ల ఆదాయం కోల్పోతోంది. తమ గగనతలం నుంచి ప్రయాణించే భారత విమానాల నుండి ఓవర్‌ఫ్లైట్ ఫీజుల రూపంలో గణనీయమైన ఆదాయాన్ని ఇప్పటి వరకూ ఆర్జిస్తుంది. అది కూడా ఇప్పుడు లభించే అవకాశం లేదు. పరస్పర నిషేధం వల్ల పాకిస్తాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (CAA) గణనీయమైన ఆదాయాన్ని కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది.
India all set to deny air space to Pakistan for its commercial flights. Longer routes means more consumption of fuel and hence more expenses.
— Monica Verma (@TrulyMonica) April 29, 2025
कंगाली में आटा गीला moment for terroristan pic.twitter.com/4pTVjHAsYx
పాకిస్తాన్ కు ఎగుమతుల ఖర్చు కూడా పెరుగుతుంది. పాకిస్తాన్ ఎగుమతులు, ముఖ్యంగా గల్ఫ్ దేశాలు, యూరప్, ఆసియాకు వెళ్లే వస్తువులు, ఎక్కువ ప్రయాణ సమయం , ఖర్చుల కారణంగా ఆలస్యం అవుతాయి. ఇది పాకిస్తాన్ టెక్స్‌టైల్, వ్యవసాయ ఉత్పత్తులు, ఇతర ఎగుమతి రంగాలను ప్రభావితం చేస్తుంది. గగనతలం మూసివేయడం వంటి చర్యలు పాకిస్తాన్‌ను అంతర్జాతీయంగా మరింత ఒంటరిగా మార్చవచ్చు. - పాకిస్తాన్ ఇప్పటికే అధిక ద్రవ్యోల్బణం, విదేశీ మారక నిల్వల కొరత, రుణ భారంతో సతమతమవుతోంది. గగనతలం మూసివేయడం వల్ల విమానయాన రంగం, ఎగుమతులు, ఓవర్‌ఫ్లైట్ ఫీజుల నుండి ఆదాయ నష్టం ఈ ఆర్థిక సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది.





















