News
News
వీడియోలు ఆటలు
X

Wrestlers Protest: జంతర్ మంతర్ వద్ద అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్త‌త‌, పోలీసులతో ఘర్షణలో ఇద్దరు రెజ్ల‌ర్ల‌కు గాయాలు

Wrestlers Protest: ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నరెజ్లర్లకు పోలీసుల మధ్య ఘర్షణ జ‌రిగింది. బాధ్యుల‌పై చ‌ర్య‌ల కోసం రెజ్ల‌ర్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.

FOLLOW US: 
Share:

Wrestlers Protest: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్​పై లైంగిక ఆరోపణలు చేస్తూ... ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నరెజ్లర్లకు  పోలీసుల మధ్య అర్ధరాత్రి ఘర్షణ చోటుచేసుకుంది. బుధవారం (మే 3) రాత్రి 11 గంటల సమయంలో పోలీసులు తమపై దాడి చేశారని, అసభ్య పదజాలంతో దూషించారని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. 

మాలవ్య నగర్‌కు చెందిన ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతిని ఆందోళ‌న‌కారుల కోసం మంచాల‌ను తీసుకురాగా ఆయ‌న‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారతి అనుమతి లేకుండా మడత మంచాల‌తో ఆ ప్రాంతానికి చేరుకున్నార‌ని ఢిల్లీ పోలీసులు తెలిపారు. మరోవైపు, పోలీసులతో జరిగిన ఘర్షణలో తన సోదరుడు గాయపడ్డాడని రెజ్లర్ గీతా ఫోగట్ ఆరోపించారు. "రెజ్లర్లపై పోలీసులు చేసిన దాడిలో నా తమ్ముడు దుష్యంత్ ఫోగట్ తలకు గాయ‌మైంది, మరో రెజ్లర్ కూడా గాయపడ్డాడు. ఇది చాలా సిగ్గుచేటు" అని గీతా ఫోగట్ ట్వీట్ చేసింది.

పోలీసుల అదుపులో దీపేంద‌ర్ హుడా

కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా మాట్లాడుతూ.. తాను ఆటగాళ్లను కలిసేందుకు జంతర్ మంతర్ చేరుకున్నానని, అయితే పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. ఆయ‌న ఒక వీడియోను ట్వీట్ చేస్తూ, "ఆటగాళ్ల యోగక్షేమాలను విచారించడానికి నేను జంతర్ మంతర్ చేరుకున్నప్పుడు, ఢిల్లీ పోలీసులు నన్ను నిర్బంధించారు. ఇప్పుడు నన్ను వసంత్ విహార్ పోలీసు పోస్ట్‌కు తీసుకువచ్చారు" అని పేర్కొన్నారు.

కాంగ్రెస్ నిర‌స‌న‌

"దేశం గర్వించేలా చేసిన మన ఆడపడుచులు వీరే" అని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. "మ‌న‌కు ఎన్నో పతకాలు తెచ్చిపెట్టిన వారిపై హోంమంత్రి అమిత్ షా పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. దోపిడీకి వ్యతిరేకంగా గళం విప్పడమే వారు చేసిన‌ ఏకైక నేరం" అని ట్వీట్‌లో పేర్కొంది.

మరో ట్వీట్‌లో, రెజ్ల‌ర్ల‌పై ఢిల్లీ పోలీసుల దౌర్జన్యాలను తెలుసుకున్న వెంటనే కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా సంఘటనా స్థలానికి చేరుకున్నారని కాంగ్రెస్ పేర్కొంది. పోలీసులు బ‌ల‌వంతంగా ఆయ‌న‌ను  అదుపులోకి తీసుకున్నార‌ని ఆరోపించింది. ఆందోళ‌న చేస్తున్న వారికి కాంగ్రెస్ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చింది. 

హోం మంత్రికి బజరంగ్ పునియా లేఖ

బుధ‌వారం రాత్రి జరిగిన ఘటనలపై బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. త‌మ‌ డిమాండ్ల కోసం 11 రోజులుగా శాంతియుతంగా నిరసనలు చేస్తున్నామని  లేఖలో పేర్కొన్నారు. మే 3వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో, విశ్రాంతి కోసం ఏర్పాట్లు చేస్తున్నప్పుడు, ఢిల్లీ ఏసీపీ ధర్మేంద్ర, 100 మంది పోలీసులతో కలిసి త‌మ‌పై దాడి చేశార‌ని., ఇందులో దుష్యంత్ ఫోగట్, రాహుల్ యాదవ్‌కు గాయాల‌య్యాని తెలిపారు. వినేష్ ఫోగట్‌ను పోలీసులు దుర్భాషలాడారని, సాక్షి మాలిక్, సంగీతా ఫోగట్‌లను మగ అధికారులు నెట్టారని లేఖలో పేర్కొన్నారు.

హోంమంత్రికి 4 డిమాండ్లు

1- ఘటనకు బాధ్యులైన అధికారులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి.

2- నిరసన ప్రదేశంలో మాకు అవసరమైన కనీస వస్తువులు వాటర్‌ప్రూఫ్ టెంట్లు, బలమైన స్టేజ్, బెడ్, సౌండ్ సిస్టమ్, మ్యాట్రెస్, ప్రాక్టీస్ కోసం రెజ్లింగ్ మ్యాట్‌లు, జిమ్ పరికరాలను తెచ్చుకునేందుకు అనుమతి ఇవ్వాలి.

3- వివిధ ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్న మా సహచరులందరినీ వెంటనే విడుద‌ల‌ చేయాలి.

4- మా డిమాండ్లకు సంబంధించి ప్రభుత్వ ఉన్నతాధికారులతో త్వరలో చర్చలు జరపాలి.

ఇలాంటి రోజు కోసం మేము పతకాలు సాధించామా?: వినేష్ ఫోగట్
జంతర్ మంతర్ వద్ద ఢిల్లీ పోలీసులతో వివాదం తర్వాత వినేష్ ఫోగట్ కన్నీళ్లు పెట్టుకుంది. విలేక‌రుల సమావేశంలో వినేష్ మాట్లాడుతూ.. దేశం కోసం పతకాలు సాధించినప్పుడు, ఇలాంటి రోజు  వ‌స్తుంద‌ని ఎప్పుడూ అనుకోలేద‌ని తెలిపింది. ఏ ఆటగాడు దేశం కోసం పతకం సాధించకూడదని నేను చెబుతాన‌ని పేర్కొంది. ఇప్పటి వరకు నేలపై పడుకున్నామ‌ని, వర్షం కార‌ణంగా పడుకోవడానికి మంచం అడిగామని, అయితే అందుకు పోలీసులు అనుమతించలేదని చెప్పింది. మద్యం మత్తులో ఉన్న ఒక పోలీసు త‌మ‌తో అనుచితంగా ప్రవర్తించాడ‌ని ఆరోపించింది. ఇన్ని కుంభకోణాలు చేసినా, బ్రిజ్‌భూషణ్ తన ఇంట్లో హాయిగా నిద్రిస్తున్నారని, అయితే తాము ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామ‌ని వినేష్ ఫొగ‌ట్‌ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. 

ఢిల్లీ పోలీసులు ఏం చెప్పారు?
ఢిల్లీ డిప్యూటి పోలీస్‌ కమిషనర్ ప్రణవ్ తాయల్ మాట్లాడుతూ, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సోమనాథ్ భారతి అనుమతి లేకుండా 'మడత' మంచంతో నిరసన స్థలానికి వచ్చారని తెలిపారు. దీని గురించి ప్రశ్నించగా, భారతి మద్దతుదారులు ట్రక్కు నుంచి మంచాలను తీసేందుకు ప్రయత్నించారని, చిన్న గొడవ జరగడంతో భారతితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామ‌ని చెప్పారు.

Published at : 04 May 2023 10:09 AM (IST) Tags: Delhi Police vinesh phogat Brij Bhushan Sharan Singh Wrestlers Protest JantarMantar

సంబంధిత కథనాలు

Odisha Train Accident: కవచ్‌ ఉన్నా లాభం లేకపోయేది, కొన్ని ప్రమాదాల్ని ఏ టెక్నాలజీ అడ్డుకోలేదు - రైల్వే బోర్డ్

Odisha Train Accident: కవచ్‌ ఉన్నా లాభం లేకపోయేది, కొన్ని ప్రమాదాల్ని ఏ టెక్నాలజీ అడ్డుకోలేదు - రైల్వే బోర్డ్

Odisha Train Accident: ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరిది? కాగ్ రిపోర్ట్‌ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు - ప్రియాంక గాంధీ

Odisha Train Accident: ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరిది? కాగ్ రిపోర్ట్‌ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు - ప్రియాంక గాంధీ

Form 16: ఇంకా ఫామ్‌-16 అందలేదా?, ఆన్‌లైన్‌లో చూసే ఆప్షన్‌ కూడా ఉంది

Form 16: ఇంకా ఫామ్‌-16 అందలేదా?, ఆన్‌లైన్‌లో చూసే ఆప్షన్‌ కూడా ఉంది

NEET UG 2023: వెబ్‌సైట్‌లో నీట్ యూజీ రెస్పాన్స్ షీట్లు, త్వరలోనే ఆన్సర్ కీ!

NEET UG 2023: వెబ్‌సైట్‌లో నీట్ యూజీ రెస్పాన్స్ షీట్లు, త్వరలోనే ఆన్సర్ కీ!

EPFO: 6 కోట్ల మంది సబ్‌స్క్రైబర్‌లకు EPFO మెసేజ్‌లు, అందులో ఏం ఉంది?

EPFO: 6 కోట్ల మంది సబ్‌స్క్రైబర్‌లకు EPFO మెసేజ్‌లు, అందులో ఏం ఉంది?

టాప్ స్టోరీస్

Telangana As Number 1: జయహో తెలంగాణ‌, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హ‌ర్షం

Telangana As Number 1: జయహో తెలంగాణ‌, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హ‌ర్షం

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు

Allu Arjun - Telugu Indian Idol 2 : గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పేసిన అల్లు అర్జున్ - ఇంటికెళ్లాక పరిస్థితి ఏంటో?

Allu Arjun - Telugu Indian Idol 2 : గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పేసిన అల్లు అర్జున్ - ఇంటికెళ్లాక పరిస్థితి ఏంటో?