By: ABP Desam | Updated at : 25 Apr 2022 07:42 PM (IST)
Edited By: Murali Krishna
ఆ విషయంలో మూడో స్థానంలో భారత్- చైనా, అమెరికాకు పోటీగా
Military Expenditure: కరోనా సంక్షోభం, రష్యా- ఉక్రెయిన్ యుద్ధం వేళ కూడా పలు దేశాలు సైన్యం కోసం భారీగా ఖర్చు పెడుతున్నాయి. స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్ (SIPRI) నివేదిక ప్రకారం అమెరికా సైన్యం కోసం గతేడాది భారీగా ఖర్చు చేసింది. ఆ తర్వాతి స్థానంలో చైనా ఉండగా, మూడో ప్లేస్‌లో భారత్ నిలిచింది.
భారీగా ఖర్చు
2021లో అంతర్జాతీయ సైనిక వ్యయం 2113 బిలియన్ డాలర్లకు చేరి రికార్డు సృష్టించింది. 2020తో పోలిస్తే ఈ వ్యయం 0.7 శాతం ఎక్కువ. 2021లో అమెరికా, చైనా, భారత్, యూకే, రష్యా దేశాలు మిలటరీ కోసం అత్యధికంగా ఖర్చు చేశాయి. ప్రపంచ సైనిక వ్యయంలో కేవలం ఈ ఐదు దేశాలే 62 శాతం ఖర్చు చేశాయి.
అమెరికా 2021లో 801 బిలియన్ డాలర్లు సైన్యంపై ఖర్చు పెట్టింది. ఇది 2020తో పోలిస్తే 1.4శాతం తగ్గింది. తర్వాత చైనా 293 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉంది. 2020తో పోలిస్తే 4.7 శాతం పెరిగింది.
భారత్ 76.6 బిలియన్ డాలర్లు సైన్యం కోసం వెచ్చించింది. 2020తో పోలిస్తే ఇది 0.9 శాతం పెంచింది. కానీ 2012తో పోల్చితే మాత్రం భారీ వ్యత్యాసం కనిపిస్తుంది. ఏకంగా 33 శాతం పెరగడం విశేషం. ప్రస్తుతం దేశం ఆయుధాల కొనుగోలుకే ఎక్కువగా ఖర్చు చేస్తుంది. ఇక యూకే గతేడాది 68.4 బిలియన్ డాలర్లను సైన్యం కోసం ఖర్చు చేయగా రష్యా 65.9 బిలియన్ డాలర్లని ఖర్చు చేసింది.
ఉక్రెయిన్, రష్యా ఉద్రిక్తతల వేళ పలు దేశాలు రక్షణ రంగానికి ఎక్కువగా ఖర్చు చేస్తున్నాయి. రక్షణ శాఖలో పెట్టుబడులు కూడా భారీగా పెడుతున్నాయి. భారత్ కూడా సైన్యం కోసం ఎక్కువగా ఖర్చు పెడుతోంది. అమెరికా, చైనా తర్వాత భారత్ మూడో స్థానంలో నిలిచింది.
Also Read: Hanuman Chalisa Row: ప్రధాని మోదీని తాకిన హనుమాన్ చాలీసా ఎఫెక్ట్
Also Read: World Oldest Person Died: ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు కన్నుమూత- వయసెంతంటే?
Kerala OTT : కేరళ ప్రభుత్వ సొంత "ఓటీటీ" - ఇక సినిమాలన్నీ అందులోనేనా ?
Sunil Jakhar Joins BJP: కాంగ్రెస్‌కు వరుస షాక్‌లు- భాజపాలోకి మరో సీనియర్ నేత
Krishna Janmabhoomi Row: శ్రీకృష్ణ జన్మభూమిలో ఈద్గా తొలగింపుపై పిటిషన్- విచారణకు కోర్టు ఓకే
Yasin Malik Convicted: వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌ను ఆ కేసులో దోషిగా తేల్చిన కోర్టు
Navjot Singh Sidhu: సిద్ధూకు ఏడాది జైలు శిక్ష- 34 ఏళ్ల క్రితం కేసులో సుప్రీం తీర్పు
Chandrababu Kurnool Tour: భూలోకంలో ఎక్కడ దాక్కున్నా లాక్కొచ్చి లోపలేయిస్తా: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
RCB Vs GT Highlights: ఫాంలోకి వచ్చిన కింగ్ కోహ్లీ - గుజరాత్‌పై బెంగళూరు ఘనవిజయం!
NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!
Nikhat Zareen: తెలంగాణ బంగారు కొండ - ప్రపంచ చాంపియన్‌గా నిఖత్ జరీన్!