Hanuman Chalisa Row: ప్రధాని మోదీని తాకిన హనుమాన్ చాలీసా ఎఫెక్ట్
Hanuman Chalisa Row: ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి ముందు హనుమాన్ చాలీసా సహా సర్వ మత గ్రంథాలు పఠించేందుకు అనుమతి ఇవ్వాలని ఎన్‌సీపీ నేత అమిత్ షాను కోరారు.

Hanuman Chalisa Row: హనుమాన్ చాలీసా పఠనంపై చెలరేగిన రాజకీయ దుమారం చివరికి ప్రధాని వరకు చేరింది. దిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని మోదీ అధికారిక నివాసం ముందు హనుమాన్ చాలీసా, నమాజ్, దుర్గా చాలీసా, నమోకర్ మంత్రం (జైన్ శ్లోకం), గురు గ్రంథ్ సాహిబ్ (సిక్కు గ్రంథం) చదివేందుకు అనుమతి ఇవ్వాలని ఎన్‌సీపీకి చెందిన ఫహ్మిదా హసన్ ఖాన్ కోరారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.
ఆ తర్వాత
మోదీ ఇంటి ముందు ఇవన్నీ చదివేందుకు అనుమతి ఇస్తే అనంతరం తాను హనుమాన్ చాలీసా పఠిస్తానని, తన ఇంట్లో దుర్గాపూజ కూడా చేస్తానని ఎంఎస్ ఖాన్ చెప్పారు. ఆమె రాసిన ఈ లేఖ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
మహారాష్ట్రలో
హనుమాన్ చాలీసా పఠనంపై మహారాష్ట్రలో ఇంకా ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో శివసేన, భాజపా, ఎన్‌సీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
ఏం జరిగింది?
మహారాష్ట్ర సీఎం నివాసం అయిన మాతోశ్రీ ముందు హనుమాన్ చాలీసా పఠిస్తానని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ సవాల్ చేశారు. ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయిన తర్వాత మహారాష్ట్రలో భయానక వాతావరణం పెరిగిందని, అందుకే "మాతో శ్రీ " ఎదుట హనుమాల్ చాలీసా పఠిస్తానని ఆమె అన్నారు.
నవనీత్ కౌర్ భర్త రవి రానా కూడా ఎమ్మెల్యేనే. ఆయనతో కలిసి హనుమాన్ చాలీసా పఠించేందుకు వెళ్లక ముందే శివసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున ముంబయిలోని వారింటి ముందు ఆందోళనకు దిగారు. శివసేనతో పోరాడుతూండటంతో కేంద్రం ఆమెకు వై కేటగిరి భద్రత కల్పించింది.
రానా దంపతులకు అధికార శివసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శివసేనను సవాల్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, మహారాష్ట్రలో మీరు ప్రశాంతంగా గడపలేరంటూ శివసేన పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ హెచ్చరించారు.
దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నవీనీత్ కౌర్ దంపతులను కోర్టులో హాజరు పరచగా వీరిద‍్దరికీ మే 6 వరకూ జుడీషియల్ రిమాండ్ విధిస్తున్నట్లు బాంద్రా మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలిచ్చింది.
Also Read: Prashant Kishor: పీకే ఆఫర్‌పై కాంగ్రెస్ ఫైనల్ డెసిషన్ ఏంటి? ఏ బాధ్యతలు ఇస్తారు?
Also Read: Covid Update: దేశంలో పెరుగుతోన్న కరోనా ఉద్ధృతి- ఒక్కరోజులో 30 మంది మృతి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

