అన్వేషించండి

West Bengal Elections 2026:నువ్వు సింగం అయితే నేను పుష్ప! టీఎంసీ నేత, యూపీ పోలీస్ అధికారి మధ్య వార్!

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల వేళ దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఫాల్టాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మ, టీఎంసీ నేత జహంగీర్ ఖాన్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ప్రశాంతతకు భంగం కలిగించే అధికారులను తెచ్చారని టీఎంసీ విమర్శ.

West Bengal Elections 2026: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభంకానుంది. ఈ క్రమంలో రాజకీయ వర్గాల మధ్య ఘర్షణలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ముఖ్యంగా సౌత్‌ 24 పరగణాస్‌ జిల్లాలోని ఫాల్టా ప్రాంతంలో ఒక ఆసక్తికరమైన, అదే టైంలో ఉద్రిక్తతతో కూడిన ఘటన చోటు చేసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌ కేడర్‌కు చెందిన 2011 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అజయ్‌  పాస్ శర్మను కేంద్ర ఎన్నికల సంఘం ఇక్కడ పోలీస్ పరిశీలకుడిగా నియమించింది. అజయ్ పాల్ శర్మకు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా , సింగంగా పేరుంది.

ఫాల్టా నియోజకవర్గంలోని టీఎంసీ అభ్యర్థి జహంగీర్‌ ఖాన్ అనుచరులు ఓట్ల గుర్తింపు కార్డులను సేకరిస్తున్నారని, ఓటర్లను భయపెడుతున్నారని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులపై స్పందించిన అజయ్ పాల్ శర్మ, నేరుగా జహంగీర్‌ ఖాన్ నివాసానికి వెళ్లి హెచ్చరించారు. 

సింగం వార్నింగ్ 

సోమవారం నాడు జహంగీర్‌ ఖాన్ నివాసానికి చేరుకున్న అజయ్‌ పాల్ శర్మ, అక్కడ ఉన్న ఖాన్ బంధువులతో కఠినంగా మాట్లాడారు. ఓటర్లను ఎవరైనా ఇబ్బంది పెట్టినా, అక్రమాలకు పాల్పడినా సహించేది లేదు. జహంగీర్‌కు ఈ విషయం స్పష్టంగా చెప్పండి. నిరంతరం ఫిర్యాదులు వస్తున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మేం కఠిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. పోలీస్‌ పరిశీలకుడు నేరుగా అభ్యర్థి ఇంటికి వెళ్లి ఇలా హెచ్చరించడం, బెంగాల్‌ రాజకీయాల్లో కలకలం రేపింది. 

పుష్ప కౌంటర్ 

ఈ హెచ్చరికలై జహంగీర్ ఖాన్ అంతే ధీటుగా స్పందించారు. అజయ్ పాల్ శర్మ తీరును తప్పుబడుతూ ఇది బెంగాల్‌ ఆయన సింగం అయితే నేను పుష్ప, ఎవరికి తలవంచను అని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రయోజనాల కోసం ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీస్‌ అధికారులు బెంగాల్‌ వచ్చి తమపై ఒత్తిడి తీసుకురావాలని చూస్తున్నారని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో అంగీకరించలేని విషయమని ఆయన మండిపడ్డారు. ఒక పోలీస్‌ పరిశీలకుడు నేరుగా అభ్యర్థికి ఇంటికి వెళ్లి బెదిరించడం ఏం నిబంధనల కిందకు వస్తుందని ఆయన ప్రశ్నించారు. తమ కార్యకర్తలను భయపెట్టడం ద్వారా గెలవాలని చూస్తున్నారని కానీ తాము దేనికీ భయపడబోమని ఖాన్ స్పష్టం చేశారు. 

ఈ పరిణామాల తర్వాత ఫాల్టాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. అజయ్ పాల్ శర్మ కాన్వాయ్‌ ఫాల్టా గుండా వెళ్తున్న సమయంలో టీఎంసీ మద్దతుదారులు జై బంగ్లా నినాదాలతో నిరసన తెలిపారు. కేంద్ర బలగాల వాహనాలు తోడుగా ఉన్నప్పటికీ నిరసనకారులు అధికారి తీరును తప్పుబడుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

మరోవైపు ఈ వివాదానికి కొత్త మలుపు ఇస్తూ ఓ మహిళా ఫాల్టా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి సమయంలో అజయ్ పాల్ శ్రమ, కేంద్ర బలగాలు ఇళ్లల్లోకి చొరబడి మహిళలపై  అసభ్యంగా ప్రవర్తించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఈ అంశంపై టీఎంసీ అగ్రనాయకత్వం కూడా తీవ్రంగా స్పందించింది. పశ్చిమ బెంగాల్‌ మంత్రి చంద్రిమా భట్టాచార్య మాట్లాడుతూ... మీడియా ఆయనకు ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌ అని పేరు పెట్టింది. అటువంటి అధికారి ఇక్కడ ఏం చేస్తున్నారు అర్ధరాత్రి ఇళ్లల్లోకి వెళ్లి బెదిరించే అధికారం ఆయనకు ఎవరిచ్చారు అని ప్రశ్నించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి ఇటువంటి అధికారులను ఇక్కడకు తీసుకొచ్చారని ఆమె ఆరోపించారు.

Frequently Asked Questions

ఈ వివాదంపై మంత్రి చంద్రిమా భట్టాచార్య ఏమని ఆరోపించారు?

శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి ఇటువంటి అధికారులను ఇక్కడకు తీసుకొచ్చారని, అర్ధరాత్రి ఇళ్లల్లోకి వెళ్లి బెదిరించే అధికారం ఆయనకు ఎవరు ఇచ్చారని మంత్రి ప్రశ్నించారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నేడు తాడేపల్లిలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ కీలక భేటీ
నేడు తాడేపల్లిలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ కీలక భేటీ
Kerala Influencer Akhil Megha: కేరళం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ జంటకు దిష్టి తగిలేసిందా? బస్సు క్లీనర్‌తో భార్య పరార్‌! బోరుమంటున్న భర్త!
కేరళం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ జంటకు దిష్టి తగిలేసిందా? బస్సు క్లీనర్‌తో భార్య పరార్‌! బోరుమంటున్న భర్త!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Embed widget