అన్వేషించండి

Priyanka Chopra Raghav Chadha News:రాఘవ్ చద్దా రాజకీయం వెనుక వారణాసి హీరోయిన్ ప్రియాంక చోప్రా! 

Priyanka Chopra Raghav Chadha News:ఆప్‌ కీలక నేత రాఘవ్ చద్దా పార్టీ మారడమే సంచలనం అయితే ఇప్పుడు దాని వెనుక వారణాసి సినిమా హీరోయిన్ ప్రియాంక చోప్రా ఉందని ప్రచారం మరింత ఆసక్తిని కలిగిస్తోంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రాఘవ్ చద్దా బీజేపీలో చేరడంపై నవజ్యోత్ కౌర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
  • ప్రియాంక చోప్రా సలహా మేరకే రాఘవ్ చద్దా బీజేపీలో చేరారని ఆమె తెలిపారు.
  • ఈడీ దాడుల నుంచి సోదరి పరిణితిని కాపాడడానికే ఈ మార్పు అని ఆమె పేర్కొన్నారు.
  • రాఘవ్ నిర్ణయంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు, ట్రోలింగ్ జరుగుతోంది.

Priyanka Chopra Raghav Chadha News:భారత్‌ రాజకీయాలు ఎప్పుడూ డైనమిక్‌గా ఉంటాయి. ఏదో విషయం సంచలనం కలిగిస్తూనే ఉంటుంది. తాజాగా ఆమ్‌ ఆద్మీ పార్టీ యువనేత రాఘవ్ చద్దా పార్టీ మారడం ఒక సంచలనమైంది. ఆయన ఆప్ ను వదిలేసి బీజేపీలో చేరడం చర్చనీయాంశమైంది.ఆయనతోపాటు మరొ ఆరుగురిని కూడా బీజేపీలోకి తీసుకెళ్లారు. ఈ సంచలనంపై చర్చ జరుగుతున్న వేళ మాజీ క్రికెటర్‌ నవజ్యోతి సింగ్‌ సిద్దూ భార్య నవజ్యోత్‌ కౌర్ సిద్దూ చేసిన కామెంట్స్ మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి. దీంతో విషయంపై కొత్త చర్చ మొదలైంది. 

రాఘవ్ చద్దా, ప్రియాంకపై నవజ్యోత్ కౌర్ సంచలన కామెంట్స్ 

నవజ్యోత్ కౌర్ సిద్దూ ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ రావ్ చద్దా బీజేపీలో చేరడం వెనుక ఒక టాప్ సీక్రెట్ ఉందని అన్నారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం అంతర్జాతీయ నటి, వారణాసి హీరోయిన్ ప్రియాంక చోప్రా ఈ సలహా ఇచ్చారని అన్నారు. తన సోదరి పరిణితి చోప్రా జీవితంలో ఇబ్బందుల్లేకుండా చేయసే ఉద్దేశంతో రాఘవ్ చద్దాను బీజేపీ వైపు ప్రియాంక నడిపించారని నవజ్యోత్ కౌర్ పేర్కొన్నారు. 

ఎవరికీ తెలియని విషయాలు అంటూ మాట్లాడిన నవజ్యోత్ కౌర్ 

రాఘవ్‌ చద్దా ఆప్‌లో కీలక పాత్ర పోషించినప్పటికీ గత కొంతగాలంగా పార్టీలో ఆయనకు ప్రాధాన్యత తగ్గుతోందని వార్తలు వచ్చాయి. ఎవరికీ తెలియని ఇంకో విషయం ఉందని నవజ్యోత్ కౌర్ సిద్దూ చెప్పుకొచ్చారు. ఆప్‌ నేతలను టార్గెట్ చేస్తూ ఈడీ దారులు జరిగే ఛాన్స్ ఉందని, ఆ జాబితాలో రాఘవ్ చద్దా పేరు ఉందనే విషయం ప్రియాంక చోప్రాకు ముందే తెలుసు అని ఆరోపించారు. ఒక వేళ రాఘవ్ పై దాడులు జరిగితే తన సోదరి పరిణితి ఇబ్బందుల్లో పడుతుందని భావించిన ప్రియాంక, రాజకీయ మార్పు ద్వారా ఆయనను ఆ ముప్పు నుంచి కాపాడారు అని సిద్దూ వివరించారు.  రాఘవ్ చద్దా ఆప్ తరఫున మాట్లాడటం లేదని, పార్టీ నాయకత్వం ఆయనపై ఆగ్రహంగా ఉందనే విషయం మాత్రమే బయటకు వచ్చిందని అన్నారు. 

Also Read: వాట్సాప్‌లోనూ తెలంగాణ 10వ తరగతి ఫలితాలు, ఇలా చెక్ చేసుకోండి

గత ఏడాదిన్నర కాలంగా పార్టీలో జరుగుతున్న తప్పులపై మౌనంగా ఉన్నారని, అప్పుడే గళం విప్పి ఉంటే బాగుండేదని నవజ్యోత్ కౌర్ అభిప్రాయపడ్డారు. మౌనంగా ఉండే ప్రతి వ్యక్తి పార్టీకి విధేయుడే అని అర్థం కాదని విమర్శలు చేశారు. 

బీజేపీలో రాఘవ్ చద్దాపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ 

రాఘవ్ చద్దా నిర్ణయంపై సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోలింగ్ నడిచింది. ఆయన బీజేపీలో చేరిన వెంటనే ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లో ఫాలోవర్స్‌ను కోల్పోయారు. నటుడు ప్రకాశ్ రాజ్ కూడా వ్యంగ్యంగా స్పందించారు. పోలీసులు నేరాలు ఎదుర్కోవడంలో విఫలమయ్యారని అందుకే పోలీస్ ఫోర్స్ వదిలేసి దావూద్ ఇబ్రహీంతో చేతులు కలుపుతున్నానంటూ కామెంట్ చేశారు.  

Also Read: బెంగాల్‌లో రెండో విడత పోలింగ్‌‌కకు సర్వం సిద్ధం - మోదీ వర్సెస్ దీదీ - ఎవరిది పైచేయి?

Frequently Asked Questions

రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీని వదిలి బీజేపీలో ఎందుకు చేరారు?

ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై ఈడీ దాడులు జరిగే అవకాశం ఉందని, ఆ జాబితాలో రాఘవ్ చద్దా పేరు ఉందని ప్రియాంక చోప్రాకు ముందే తెలుసు. ఈ ముప్పు నుంచి ఆయనను కాపాడేందుకే ప్రియాంక ఈ సలహా ఇచ్చారని నవజ్యోత్ కౌర్ సిద్ధూ అన్నారు.

రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రా కారణమని ఎవరు చెప్పారు?

మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూ ఈ విషయాన్ని ఒక పాడ్‌కాస్ట్‌లో వెల్లడించారు. ప్రియాంక చోప్రా సలహా మేరకే రాఘవ్ చద్దా రాజకీయ మార్పు చేశారని ఆమె పేర్కొన్నారు.

రాఘవ్ చద్దా బీజేపీలో చేరిన తర్వాత సోషల్ మీడియాలో ఎలా స్పందించారు?

రాఘవ్ చద్దా నిర్ణయంపై సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ జరిగింది. ఆయన బీజేపీలో చేరిన వెంటనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్‌ను కోల్పోయారు. నటుడు ప్రకాశ్ రాజ్ కూడా వ్యంగ్యంగా స్పందించారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

CJP Protest: ధర్మేంద్ర ప్రధాన్ బలిపశువు అయ్యారు, చాలా బాధాకరం- కేంద్ర మంత్రి రాజీనామాపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
ధర్మేంద్ర ప్రధాన్ బలిపశువు అయ్యారు, చాలా బాధాకరం- కేంద్ర మంత్రి రాజీనామాపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
Dharmendra Pradhan Resignation Reasons: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
CJP GenZ Protest Success Story: కాక్రోచ్‌ల తొలి పోరాటమే సూపర్‌హిట్ - రాజకీయ పార్టీలకు సాధ్యం కానిది సాధించిన జెన్జీలు !
కాక్రోచ్‌ల తొలి పోరాటమే సూపర్‌హిట్ - రాజకీయ పార్టీలకు సాధ్యం కానిది సాధించిన జెన్జీలు !
Rahul Gandhi Student Paper Leak Protest: విద్యార్థుల పోరులో రాహుల్ గాంధీ వ్యూహం - మైలేజీ వచ్చిందా? ఉద్యమం కాంగ్రెస్ సొంతమైందా?
విద్యార్థుల పోరులో రాహుల్ గాంధీ వ్యూహం - మైలేజీ వచ్చిందా? ఉద్యమం కాంగ్రెస్ సొంతమైందా?
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Embed widget