అన్వేషించండి

Raghav Chadha : రాజకీయ సంచలనం రాఘవ్ చద్దా డైట్ సీక్రెట్ ఇదే! ఆంధ్రఫుడ్ గురించి ఆయన చెప్పిన ముచ్చటేంటీ?

Raghav Chadha: ఆమ్‌ ఆద్మీపార్టీ వీడి బీజేపీలో చేరిన రాఘవ్ చద్దా రాజకీయ సంచలనంగా మారారు. ఈ పరిణామాల మధ్య గతంలో ఆయన పంచుకున్న ఆరోగ్య రహస్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రాఘవ్ చద్దా, ఆప్ ఎంపీలు ఆరుమందితో కలిసి పార్టీకి రాజీనామా లేఖ ఇచ్చారు.
  • రాఘవ్ చద్దా ఫిట్నెస్, ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు.
  • అల్మండ్ మిల్క్, మామిడి పండ్లతో చేసిన ఆరోగ్యకరమైన షేక్ ఆయన ఇష్టం.
  • ఆంధ్రా భవన్‌లో లభించే సింపుల్ భోజనాన్ని కూడా రాఘవ్ ఇష్టపడతారు.

Raghav Chadha: ఆమ్‌ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన రాఘవ్ చద్దా మరికొందరు ఎంపీలతో కలిసి ఆప్‌కు షాక్ ఇచ్చారు. మొత్తం ఏడుగురు తమకు ఆప్‌తో సంబంధం లేదని బీజేపీ సభ్యులుగా గుర్తించాలని చెబుతూ రాజ్యసభ ఛైర్మన్‌కు లేఖ రాశారు. ఇది రాజకీయ వర్గాల్లో విస్మయానికి గురి చేసింది. రాజ్యసభలో సమీకరణాలను మార్చేసింది. ఈ క్రమంలోనే రాఘవ్ చద్దాకు గతంలో షేర్ చేసిన ఒక వీడియో వైరల్ అవుతోంది. క్లీ టేల్స్‌కు ఇచ్చిన పాత ఇంటర్వ్యూలో ఆయన తన ఇంటి వంటగది రహస్యాలను, ఇష్టమైన వంటకాలను, ఆంధ్రా ఫుడ్ గురించి చాలా విషయాలు పంచుకున్నారు. 

రాజకీయాల్లో నిత్యం బిజీగా ఉండే రాఘవ్ చద్దా, తన ఫిట్‌నెస్‌, ఆహారపు అలవాట్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆయన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో మార్పులు వచ్చినా, ఆయన ఇష్టపడే అల్మండ్‌ మిల్ మ్యాంగోషేక్‌ మాత్రం మారలేదు. సాధారణంగా వేసవిలో మామిడి పండ్లను తింటాం. కానీ చద్దా అక్టోబర్ నెలలో కూడా ఈషేక్ తీసుకుంటానని చెప్పారు. అంటే ఆ డ్రింక్ అంటే ఆయనకు ఎంత మక్కువో అర్థమవుతుంది. ఇది కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది ఒక హెల్తీ వర్షన్ అని ఆయన గర్వంగా చెబుతుంటారు. 

Also Read: పంజాబ్‌ రాజకీయ తుపాను ఆప్‌ను ముంచేస్తుందా? రాఘవ్‌ చద్దా సహా ఏడుగురి ఎంపీల నిర్ణయంతో ఏం జరగనుంది?

సాధారణంగా మనం మామిడి పండ్ల రసంలో చక్కెర, చిక్కటి పాలు వేసి తాగుతుంటాం. ఇది రుచిగా ఉన్నప్పటికీ కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కానీ రాఘవ్ చద్దా సూచించిన విధానం హెల్తీ ట్విస్ట్ తో ఉంటుంది. 

ఇందులో సాధారణంగా ఆవు లేదా గేదె పాలకు బదులు బాదం పాలు వేస్తారు. ఇది జీర్ణక్రియను పటిష్టం చేస్తుంది. లాక్టోజ్‌ అలర్జీ ఉన్న వారికి మేలు చేస్తుంది. ఇందులో శుద్ధి చేసిన చక్కెర వాడరు. మామిడి పండ్లులోని సహజ తీపి సరిపోకపోతే దానికి బదులు తేనె వినియోగిస్తారు. ఇందులో బాదం పప్పుు, జీడిపప్పులను కలపడం వల్ల ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు అందుతాయి. 

ఈ షేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు 

ఈ రుచికరమైన షేక్ తయారీకి పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. మనం ఇంట్లో దొరికే వస్తువులతోనే దీన్ని తయారు చేసుకోవచ్చు. ఒకటి లేదా రెండు బాగా పండిన మామిడి పండ్లు తీసుకోవాలి. ఒక కప్పు చల్లని బాదం పాలు తీసుకోవాలి. గుప్పెడు బాదం, జీడిపప్పులు, ఒక టేబుల్ స్పూన్ తేనె, మూడు నుంచి నాలుగు ఐస్ క్యూబ్‌లు తీసుకోవాలి. అలంకరణ కోసం పిస్తా లేదా బాదం తురుము వేయవచ్చు. 

Also Read: కేజ్రీవాల్‌కు ఊహించని షాక్- బీజేపీలో విలీనమైన రాజ్యసభ సభ్యుల బృందం - హర్భజన్ కూడా!

తయారీ విధానం

మొదట మామిడి పండ్లను శుభ్రంగా కడిగి పీచు లేకుండా తొక్క తీసి ముక్కలు కోసుకోవాలి. ఒక బ్లెండర్‌ జార్ తీసుకొని అందులో మామిడి ముక్కలు, చల్లని బాదం పాలు, బాదం పప్పులు, జీడి పప్పులు వేయాలి. మీకు కావాల్సిన తీపిని బట్టి తేనె , ఐస్ ముక్కలు వేయాలి. ఈ మిశ్రమాన్ని మెత్తగా క్రీములా అయ్యే వరకు బ్లెండ్ చేయాలి. ఒక గాజుగ్లాస్‌లో తీసుకొని పైన పిస్తా పప్పులు, లేదా బాదం పలుకులుతో గార్నిష్ చేయాలి. 

ఆరోగ్య ప్రయోజనాలు 

ఈ మ్యాంగో షేక్ తీసుకోవడం వల్ల తక్కువ కేలరీలు లభిస్తాయి. బాదంాలలో డైర మిల్క్‌ తక్కువ కేలరీలు ఉంటాయి ఇది బరువు తగ్గాలనుకునే వారికి సహాయపడుతుంది. మామిడి పండ్లలో విటమిన్ ఏ, సీ, బాదం పాలలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ సౌందర్యాన్ని, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. నట్స్ మామిడి పండులోని సహజ చక్కెరలు తక్షణ శక్తిని ఇస్తాయి. 

రాఘవ్ చద్దా ఒకసారి ఢిల్లీలో ఉన్న ఆంధ్రభవన్‌లో భోజనం చేశారు. అక్కడ లభించే ఆంధ్రా భోజనం రుచి చూశారు. ఇలా సింపుల్‌గా ఉండే భోజనం ఇష్టమని చెప్పుకొచ్చారు.  

Frequently Asked Questions

రాఘవ్ చద్దాకు ఇష్టమైన పానీయం ఏమిటి?

రాఘవ్ చద్దాకు బాదం మిల్క్ మ్యాంగో షేక్ అంటే చాలా ఇష్టం. సాధారణంగా వేసవిలో తీసుకునే ఈ షేక్ ను ఆయన అక్టోబర్ లో కూడా తీసుకుంటారని తెలిపారు.

రాఘవ్ చద్దా తాగే మ్యాంగో షేక్ ప్రత్యేకత ఏమిటి?

ఈ షేక్ లో ఆవు లేదా గేదె పాల బదులు బాదం పాలు వాడతారు. చక్కెర బదులు తేనె ఉపయోగిస్తారు, ఇది జీర్ణక్రియకు, లాక్టోజ్ సమస్యలు ఉన్నవారికి మేలు చేస్తుంది.

ఈ బాదం మిల్క్ మ్యాంగో షేక్ తయారీకి కావలసిన పదార్థాలు ఏమిటి?

బాగా పండిన మామిడి పండ్లు, చల్లని బాదం పాలు, బాదం, జీడిపప్పులు, తేనె, ఐస్ క్యూబ్స్ అవసరం. అలంకరణకు పిస్తా లేదా బాదం తురుము ఉపయోగించవచ్చు.

ఈ మ్యాంగో షేక్ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ఈ షేక్ లో కేలరీలు తక్కువగా ఉంటాయి, బరువు తగ్గాలనుకునే వారికి సహాయపడుతుంది. మామిడి పండ్లలో విటమిన్ ఏ, సీ, బాదం పాలలో విటమిన్ ఇ చర్మ సౌందర్యాన్ని, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

రాఘవ్ చద్దాకు ఎలాంటి భోజనం ఇష్టం?

రాఘవ్ చద్దాకు ఢిల్లీలోని ఆంధ్ర భవన్ లో భోజనం నచ్చింది. సింపుల్ గా ఉండే భోజనం ఇష్టమని ఆయన తెలిపారు.

టాప్ హెడ్ లైన్స్

Vijay vs Udhayanidhi Stalin: తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
Air India New CEO: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly Monsoon Sessions: ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Vijay vs Udhayanidhi Stalin: తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Anchor Charmilla: చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Embed widget