CM Mamata on Prashanth kishor: అయినా పీకేతో కలిసే పని చేస్తాం- బంగాల్ సీఎం మమతా క్లారిటీ
CM Mamata on Prashanth kishor: ప్రశాంత్ కిశోర్‌తో కలిసి పనిచేయడంపై బంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు.
CM Mamata on Prashanth kishor: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌పై బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ప్రశాంత్ కిశోర్‌తో కలిసే పనిచేస్తామని మమతా బెనర్జీ ప్రకటించారు. తాను కాంగ్రెస్‌లో చేరడం లేదంటూ పీకే ప్రకటించిన తర్వాత మమతా బెనర్జీ ఆయన గురించి మాట్లాడటం ఇదే తొలిసారి.
రెండో ఫ్రెంటే
మరోవైపు భాజపాను ఓడించాలంటే రెండో ఫ్రెంట్‌కే సాధ్యమని ప్రశాంత్ కిశోర్ అన్నారు. దేశంలో మూడో ఫ్రంటో, నాలుగో ఫ్రంటో ఎన్నికల్లో విజయం సాధించలేదని, భాజపాని కనుక ఓడించాలనుకుంటే రెండో ఫ్రంట్‌గా ముందుకెళ్లడం తప్ప మరో మార్గం లేదన్నారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ థర్డ్ ఫ్రంట్‌గా అవతరించేందుకు మీరు సాయం చేస్తున్నారా? అన్న ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో థర్డ్ ఫ్రంట్ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని తాను అనుకోవడం లేదని, భాజపాను తొలి ఫ్రంట్ అనుకుంటే కనుక అప్పుడు దానిని ఓడించేందుకు రెండో ఫ్రంట్ మాత్రమే ఉండాలని అన్నారు. భాజపాని ఓడించాలని అనుకునే ఏ పార్టీ అయినా అది రెండో ఫ్రంట్‌గా మాత్రమే ఉండాలని పేర్కొన్నారు.
కాంగ్రెస్‌కు నో
కాంగ్రెస్‌లో చేరాలని ముందుగా ప్రశాంత్ కిశోర్ ఆ పార్టీ అధిష్ఠానం ఇచ్చిన ఆఫర్ నచ్చకపోవడంతో నో చెప్పారు. పార్టీ పునరుద్ధరణకు అవసరమైన స్వేచ్ఛ, సీనియర్ హోదాను ప్రశాంత్ కిశోర్ ఆశించారు. అయితే ఇందుకు భిన్నంగా ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలను రూపొందించే సాధికారిక బృందంలో సభ్యుడిగా ఉండాలని అధిష్ఠానం ప్రతిపాదించడం, దానికి ఆయన తిరస్కరించడంతో కాంగ్రెస్‌లో పీకే చేరతారంటూ జరుగుతున్న ప్రచారానికి తెరపడింది.
పీకేను కాంగ్రెస్‌లో చేర్చుకునే విషయంలో సొంత పార్టీలోనే భిన్నాభిప్రాయాలు ఉండగా, తనకంటే కూడా పార్టీలో లోతుగా వేళ్లూనుకున్న సంస్థాగత సమస్యలను గుర్తించే నాయకత్వం, సమష్టి కృషి కాంగ్రెస్‌కు ఇప్పుడు చాలా అవసరమనే అభిప్రాయాన్ని పీకే వ్యక్తం చేశారు.
Also Read: CJI NV Ramana: సీఎం- న్యాయమూర్తుల సదస్సు ప్రారంభం- సీఎం జగన్ హాజరు, కేసీఆర్ డుమ్మా!
Also Read: Morth Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాలను సర్కార్ బ్యాన్ చేసిందా?