(Source: ECI/ABP News/ABP Majha)
Morth Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాలను సర్కార్ బ్యాన్ చేసిందా?
Morth Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాలను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసిందా? ప్రస్తుతం ఈ వార్త తెగ హల్‌చల్ చేస్తుంది. మరి ఇందులో నిజమెంత?
Morth Electric Vehicles: ఈ మధ్య ఎలక్ట్రిక్ స్కూటర్లు కాలిపోయిన వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఓవైపు పెట్రోల్ ధరలు పెరిగిపోవడంతో విద్యుత్ వాహనాల వైపు చాలా మంది మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ వార్తలు విన్న వారికి భయంగా ఉంది. దీంతో సదరు కంపెనీలు పలు స్కూటర్‌లు రీకాల్ కూడా చేశాయి. అయితే తాజాగా మరో వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఎలక్ట్రిక్ వాహనాలపై కేంద్రం బ్యాన్ విధించిందని వస్తోన్న వార్తలపై నిజమెంతో తెలుసుకుందాం
నిజమేనా?
ఈ వార్తలపై తాజాగా రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (Ministry of Road Transport and Highways-MoRTH) స్పందించింది. భారత్‌లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలను ప్రభుత్వం నిలిపివేసినట్లు వస్తున్న పుకార్లను ఖండించింది. ఈ ప్రచారంలో వాస్తవం లేదని తెలిపింది.
తాము కొత్తగా ఎలాంటి ఎలక్ట్రిక్ టూ-వీలర్స్ లాంచ్ చేయకూడదని ఎలక్ట్రిక్ వెహికల్ (EV) తయారీదారులను కోరలేదని ప్రభుత్వం తెలిపింది. అగ్ని ప్రమాదాలపై దర్యాప్తు పూర్తయ్యేంతవరకు కొత్త ఎలక్ట్రిక్ టూ-వీలర్స్ లాంచ్ చేయకూడదని ప్రభుత్వం ఎక్కడా ఆదేశించలేదని పేర్కొంది. ఈ వాదనలను నిరాధారమైనవి తప్పుదారి పట్టించేవని, వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో వెల్లడించింది.
వరుస ప్రమాదాలు
దేశంలో ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో వాహన తయారీదారుల తప్పు ఉన్నట్లు తేలితే భారీ జరిమానాలను విధిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రీకాల్‌లను జారీ చేసి, ఈలోగా తమ ఉత్పత్తులను పరిష్కరించుకోవచ్చని మంత్రి సూచించారు.
Also Read: IT Jobs Alert: ఫ్రెషర్లకు పండగే పండగ- 90 వేల ఐటీ ఉద్యోగాల మేళా, వర్క్ ఫ్రం హోంపై కీలక ప్రకటన!
Also Read: CJI NV Ramana: సీఎం- న్యాయమూర్తుల సదస్సు ప్రారంభం- సీఎం జగన్ హాజరు, కేసీఆర్ డుమ్మా!