Viral Video: మంత్రాలు చదువుతూ హెల్మెట్ పెట్టాడు- వైరల్ అవుతున్న పోలీసులు అధికారి చర్య
ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులకు పోలీసులు ఫైన్ వేస్తుంటారు. కానీ, ఓ పోలీసు అధికారి చేసిన పనికి అందరూ ఫిదా అవుతున్నారు. ఇంతకీ తను ఏం చేశారంటే..
సాధారణంగా బైక్ నడిపే వారి కామన్ లక్షణం బద్దకం. ఇంకా చెప్పాలంటే నిర్లక్ష్యం. అక్కడక్కడా ఈ విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బైక్ నడిపే వ్యక్తి హెల్మెట్ ఉన్నా.. స్టైల్ గా పెట్రోల్ ట్యాంక్ మీద పెట్టుకుని వెళ్లే ఘటనలు ఎన్నో కనిపిస్తాయి. కార్లులో సీట్ బెల్ట్ ఉన్నా.. పెట్టుకోవడానికి చాలా బద్దకం. ఒక్క మాటలో చెప్పాలంటే భారతీయ వాహనదారులు రోడ్డు భద్రతను ఈజీగా తీసుకుంటారు. వీళ్ల తిక్క కుదిరేలా పోలీసులు సైతం భారీ మొత్తంలో జరిమానాలు విధిస్తూ జేబులు ఖాళీ చేస్తారు. తాజాగా హెల్మెట్ లేకుండా భార్యతో కలిసి బైక్ మీద వెళ్తున్న ఓ వాహనదారుడి విషయంలో పోలీసులు అధికారి వ్యవహరించిన తీరు సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నది.
మామూలుగా అయితే ట్రాఫిక్ రూల్స్ పాటించని వారికి ఫైన్ వేసి వదిలిపెట్టడం చేస్తుంటారు పోలీసులు. ఒక్కోసారి వాహనాలను జప్తు చేస్తుంటారు. మరికొన్నిసార్లు కేసులు పెడుతుంటారు. నార్త్ లో ఓ పోలీసులు అధికారి హెల్మెట్ లేకుండా బైకు నడుపుతున్న వ్యక్తిని ఆపుతారు. ఎందకు హెల్మెట్ పెట్టుకోలేదని అడుగుతారు. వాహనదారుడి నుంచి వచ్చే సమాధానాన్ని వింటారు. కొద్ది సేపటి తర్వాత ఓ హెల్మెట్ ను తెప్పించి సదరు వాహనదారుడికి ఇస్తాడు. అంతేకాదు.. ఆ హెల్మెట్‌ను సదరు పోలీసులు అధికారి వాహనదారుడి తలకు పెడుతూ కొన్ని మంత్రాలు చదువుతారు. ఆ మంత్రాల్లో ట్రాఫిక్ రూల్స్ ఆవశ్యకతను వివరిస్తారు. చివరకు హెల్మెట్ తప్పకుండా ధరించాలంటూ చేతులు జోడించి వేడుకుంటాడు.
इस भाई को इतनी इज़्ज़त से तो शादी में सेहरा भी नहीं पहनाया गया होगा😜 pic.twitter.com/UQn1gRFypz
— Jaiky Yadav (@JaikyYadav16) September 9, 2022
మరోసారి హెల్మెట్ లేకుండా పట్టుబడితే.. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ప్రస్తుతం ఉన్న మొత్తం కంటే ఐదు రెట్లు ఎక్కువ జరిమానా విధిస్తామని పోలీసు అధికారి హెచ్చరించ వదిలేస్తారు. ఇకపై హెల్మెట్ లేకుండా బైక్ నడపనని సదరు వాహనదారుడు హమీ ఇస్తారు. ఈ వీడియోను జైకీ యాదవ్ అనే నెటిజన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు “ఈ సోదరుడు తన పెళ్లిలో ఇంత గౌరవంగా దుస్తులు కూడా ధరించి ఉండడు.” అంటూ వీడియోకు క్యాప్షన్ పెట్టాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు సదరు పోలీసు అధికారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘించిన వారికి మంత్రాల ద్వారా ట్రాఫిక్ రూల్స్ బోధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అధికారుల మూలంగా జనాలు ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నది. ఇప్పటి వరకు వారికి బోధించే ప్రత్యేక పద్ధతికి అధికారిని ప్రశంసించారు. 192K పైగా వ్యూస్ వచ్చాయి. 9,500కు పైగా లైకులు వచ్చాయి.