Viral Video: పాముకు ముద్దు పెట్టబోయిన స్నేక్ క్యాచర్, తరువాత ఏం జరిగిందో తెలిస్తే షాక్ !
Snake Bites Man Video Viral: పాములు లాంటి కొన్ని విష ప్రాణాలతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ముద్దు పెట్టుకోబోతే నాగుపాము తిరిగి కాటేసింది. కర్ణాటకలో జరిగిన ఘటన ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Karnataka Snake Bites Man Video Viral: టెక్నాలజీతో పాటు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎక్కడ ఏదో తేడా కొట్టినా విషయం వెంటనే నెటిజన్లకు తెలిసిపోతుంది. కానీ కొందరు చిన్న తప్పిదాలు, మరికొందరు పిచ్చి చేష్టలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ముఖ్యంగా పాములు లాంటి కొన్ని విష ప్రాణాలతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది. కర్ణాటకలో జరిగిన ఘటన ప్రస్తుతం వైరల్ అవుతోంది. ముద్దు పెట్టుకోబోతే నాగుపాము తిరిగి కాటేసింది.
పామును పట్టుకున్న స్నేక్ క్యాచర్
కర్ణాటకలోని శివమొగ్గలోని భద్రావతి ప్రాంతంలో జనావాసాలకు మధ్య ఓ నాగుపాము వచ్చింది. పామును చూసి భయపడ్డ స్థానికులు స్నేక్ క్యాచర్ కు ఫోన్ చేశారు. కొంత సమాయానికే అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ ఎంతో చాకచక్యంగా ఆ పామును పట్టుకున్నాడు. ఇక మీరు బయపడాల్సిన పనిలేదంటూ వారికి ధైర్యం చెప్పాడు. కానీ పట్టుకున్న పామును అలాగే తీసుకెళ్లి సమీపంలోని అడవుల్లోనో, లేక ఊరి బయట వదిలేయడమే అటవీ శాఖ అధికారులకు ఫోన్ చేయడం లాంటివి చేస్తుంటారు స్నేక్ క్యాచర్స్. కానీ ఇతడు కాస్త భిన్నంగా వ్యవహరించేసరికి మొదటికే మోసం వచ్చింది.
A reptile expert who went to kiss a cobra and got bitten on the lip..
— AH Siddiqui (@anwar0262) October 1, 2022
He tried to kiss the snake after rescuing it.
#Kiss #Cobra #CobraBite #Viral pic.twitter.com/Khbfc2vK3W
పట్టుకున్న నాగుపామును వదిలేయకుండా స్నేక్ క్యాచర్ ఆ పామును తలపై ముద్దుపెట్టుకోబోయాడు. అది అసలే పాము.. కాటు వేయడం దాని సహజ స్వభావం. తన తలకు దగ్గరగా రావడంతో స్నేక్ క్యాచర్ మూతిపై ఒక్కసారిగా కాటు వేసింది. నొప్పిని భరించలేక వెంటనే స్నేక్ క్యాచర్ ఆ పామును వదిలేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆసుపత్రిలో చేరిన స్నేక్ క్యాచర్
పాము కరవడంతో స్నేక్ క్యాచర్ ను అతడి మిత్రులు, స్థానికులు చేర్పించారు. అతడి ప్రాణాలు ఏ ముప్పులేదని, కానీ ఇలాంటి పిచ్చి చేష్టలు చేయవద్దు అని వైద్యులు సూచించారు. విష ప్రాణాలతో అజాగ్రత్తగా ఉన్నా, నిర్లక్ష్యంగా వ్యవహరించిన కొన్ని సందర్బాలలో ప్రాణాలు కూడా పోతాయని డాక్టర్లు, అటవీశాఖ అధికారులు హెచ్చరించారు.
నెటిజన్ల కామెంట్లు..
నువ్వు మాత్రమే కిస్ చేస్తావా, నేను తిరిగి ముద్దు పెడతానని పాము కూడా కిస్ చేసిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. దానికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, అందుకే సీరియస్ అయిందని మరో నెటిజన్ అన్నాడు. పిచ్చి ముదిరితే ఇలాగే ఉంటుందని, ప్రాణం పోతుందని తెలిసి కూడా స్నేక్ క్యాచర్ అజాగ్రత్తగా ఎందుకు ఉన్నారని మరికొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్స్ ట్రా చేయబోతే అతడికి పాము గుణపాఠం చెప్పిందని, ఇకనుంచి బుద్ధిగా ప్రవర్తిస్తాడని అభిప్రాయపడ్డారు మరికొందరు నెటిజన్లు.