News
News
X

UP Puppies: తప్పతాగి కుక్కపిల్లలపట్ల అమానుషం! తోక, చెవులు కోసి - ఉప్పు, కారం కలిపి ఘోరం

బరేలీ జిల్లాలోని ఫరీదాపూర్ ప్రాంతంలో ఎస్‌డీఎం కాలనీలో ఈ ఘటన జరిగింది. రెండు కుక్క పిల్లల్లో ఒకదానికి చెవులు కోసి, రెండో దానికి తోక కట్ చేశాడు. వాటికి ఉప్పూ కారం కలిపాడు.

FOLLOW US: 
Share:

మద్యానికి విపరీత స్థాయిలో బానిసైన ఓ వ్యక్తి చేసిన పని అత్యంత జుగుప్సాకరంగా ఉంది. ఈ ఘటన గురించి తెలుసుకొని అందరూ అవాక్కవుతున్నారు. ఓ తాగుబోతు వ్యక్తి రెండు కుక్క పిల్లల తోక చెవులు కత్తిరించి వాటికి ఉప్పు, కారం కలిపాడు. ఉత్తర్ ప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 

స్థానిక వార్తా పత్రికలు వెల్లడించిన వివరాల ప్రకారం.. బరేలీ జిల్లాలోని ఫరీదాపూర్ ప్రాంతంలో ఎస్‌డీఎం కాలనీలో ఈ ఘటన జరిగింది. రెండు కుక్క పిల్లల్లో ఒకదానికి చెవులు కోసి, రెండో దానికి తోక కట్ చేశాడు. అవి అక్కడే బాగా మూలుగుతూ తీవ్రమైన రక్త స్రావంతో తిరుగుతుండడం స్థానికులు గమనించినట్లుగా పోలీసులు తెలిపారు. వెంటనే వాటిని పశువైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారని, వాటి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని తెలిపారు. నిందితుడ్ని పోలీసులు ముఖేష్ వాల్మీకి అని గుర్తించారు. ఈ అసహ్యపని చేసే సమయంలో అతను తన స్నేహితుడితో కలిసి మద్యం తాగుతున్నాడు. 

స్థానికులు జంతుసంరక్షణ యాక్టివిస్ట్ లకు సమాచారం అందించడంతో ధీరజ్ పాఠక్ అనే జంతు ప్రేమికుడు అక్కడికి చేరుకున్నాడు. అప్పటికే కుక్కపిల్లలు రక్తం కారుతూ ఏడుస్తూ ఉన్నాయి. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో నిందితుడిపై ధీరజ్ పాఠక్ ఫిర్యాదు చేయించారు. దాంతో జంతువుల పట్ల క్రూరంగా ప్రవర్తించారనే నేరం కింద పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఈ ఘటనపై తగిన విచారణ చేసి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ అఖిలేష్ చౌరాసియా చెప్పారు.

ఆ రెండూ వీధి కుక్కపిల్లలే..

ముఖేష్ వాల్మీకి మద్యం మత్తులో పట్టుకున్న రెండు కుక్క పిల్లలు వీధి కుక్క పిల్లలు. ఘటన తర్వాత కుక్కపిల్లలు రెండూ చలిలో విలపిస్తున్నాయి. తాగుబోతులు రెండు కుక్కపిల్లల తోక, చెవులు కోసిన తర్వాత నిందితుడు ఆ భాగాలను మాయం చేశాడు. అక్కడున్న మహిళ రక్తంపై మట్టి వేసి సాక్ష్యాలను చెరిపేసేందుకు ప్రయత్నించింది.

రెస్క్యూ టీం ద్వారా రెండు కుక్కపిల్లలకు చికిత్స

ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఫరీద్‌పూర్ పోలీసులు కూడా అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. మూగ జంతువులతో క్రూరత్వం గుర్తించినప్పుడు, చుట్టుపక్కల ప్రజలు సంఘటన గురించి PFA యొక్క రెస్క్యూ టీమ్‌కు సమాచారం అందించారు. టీమ్ ఇన్‌ఛార్జ్ ధీరజ్ పాఠక్ సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు, కుక్కపిల్లలు రెండూ రక్తంతో కప్పబడి మూసివున్న గదిలో మొరాయిస్తున్నాయి, వాటి రెండు చెవులు కోసి రక్తం కారుతున్నాయి. అనంతరం రెండు కుక్కపిల్లలకు వైద్య చికిత్స అందించారు. 

19 ఏళ్ల బాలుడు ప్రత్యక్ష సాక్షి

యువకులు రెండు కుక్క పిల్లలను రక్షించి చికిత్సకు సహకరించారు. అదే ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల యువకుడు ఈ ఘటన మొత్తాన్ని చూశాడు. వెంటనే జంతు సంరక్షణ టీమ్ ఇన్‌ఛార్జ్‌కి తెలిపాడు. బరేలీలోని ఫరీద్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో రెస్క్యూ ఇన్‌ఛార్జ్ ధీరజ్ పాఠక్ తరపున ముఖేష్ వాల్మీకి, అజ్ఞాత వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం, 1960లోని సెక్షన్ 11, 429 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Published at : 15 Dec 2022 10:44 AM (IST) Tags: UP puppies incident tail ears cutting Bareilly Faridpur UP Puppies

సంబంధిత కథనాలు

అబుదాబి-ముంబై విమానంలో మహిళ హంగామా- సిబ్బందిని కొట్టి నగ్నంగా వాకింగ్‌

అబుదాబి-ముంబై విమానంలో మహిళ హంగామా- సిబ్బందిని కొట్టి నగ్నంగా వాకింగ్‌

RRB Group D DV: ఫిబ్రవరి 7 నుంచి గ్రూప్‌-డి అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన!

RRB Group D DV: ఫిబ్రవరి 7 నుంచి గ్రూప్‌-డి అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన!

ఈ ఏడాది బడ్జెట్‌ ఎప్పుడు ఎలా చూడాలి? తొలి బడ్జెట్ ఎవరు ప్రవేశపెట్టారు?

ఈ ఏడాది బడ్జెట్‌ ఎప్పుడు ఎలా చూడాలి? తొలి బడ్జెట్ ఎవరు ప్రవేశపెట్టారు?

Breaking News Live Telugu Updates: అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

Breaking News Live Telugu Updates: అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

Gujarat: ఆశారాం బాపూకి షాక్ ఇచ్చిన గుజరాత్ కోర్టు, అత్యాచార కేసులో దోషిగా తేల్చిన న్యాయస్థానం

Gujarat: ఆశారాం బాపూకి షాక్ ఇచ్చిన గుజరాత్ కోర్టు, అత్యాచార కేసులో దోషిగా తేల్చిన న్యాయస్థానం

టాప్ స్టోరీస్

MLA Kotamreddy: క్లైమాక్స్ కి చేరిన ఎమ్మెల్యే కోటంరెడ్డి ఎపిసోడ్ - వైసీపీకి గుడ్ బై చెప్పేస్తారా !

MLA Kotamreddy: క్లైమాక్స్ కి చేరిన ఎమ్మెల్యే కోటంరెడ్డి ఎపిసోడ్ - వైసీపీకి గుడ్ బై చెప్పేస్తారా !

Taraka Ratna Health: తారకరత్నకు ప్రమాదం లేదు - మంచి మాట చెప్పిన చిరంజీవి

Taraka Ratna Health: తారకరత్నకు ప్రమాదం లేదు - మంచి మాట చెప్పిన చిరంజీవి

Hyderabad: ప్రాణాలమీదకి తెచ్చిన సరదా! నెర్రెలో ఇరుక్కొని వ్యక్తి విలవిల

Hyderabad: ప్రాణాలమీదకి తెచ్చిన సరదా! నెర్రెలో ఇరుక్కొని వ్యక్తి విలవిల

RRR Awards : ఆస్కార్ బరిలో సినిమాలను కాదని 'ఆర్ఆర్ఆర్'కు ఓటేసిన ఆడియన్స్

RRR Awards : ఆస్కార్ బరిలో సినిమాలను కాదని 'ఆర్ఆర్ఆర్'కు ఓటేసిన ఆడియన్స్