X
Match 9 - 21 Oct 2021, Thu up next
BAN
vs
PNG
15:30 IST - Al Amerat Cricket Ground Oman Cricket (Ministry Turf 1), Oman
Match 10 - 21 Oct 2021, Thu up next
OMA
vs
SCO
19:30 IST - Al Amerat Cricket Ground Oman Cricket (Ministry Turf 1), Oman
Match 11 - 22 Oct 2021, Fri up next
NAM
vs
IRE
15:30 IST - Sharjah Cricket Stadium, Sharjah
Match 12 - 22 Oct 2021, Fri up next
SL
vs
NED
19:30 IST - Sharjah Cricket Stadium, Sharjah
Super 12 - Match 13 - 23 Oct 2021, Sat up next
AUS
vs
SA
15:30 IST - Sheikh Zayed Stadium, Abu Dhabi

AMRUT 2.0: అమృత్ 2.0కు కేంద్ర కేబినెట్ ఆమోదం.. లక్ష్యాలివే..

స్వచ్ఛభారత్ మిషన్ అర్బన్ 2.O, అమృత్ 2.0 కార్యక్రమాలను కేంద్ర కెబినెట్ ఆమోదం తెలిపింది. 2025-26 వరకు ఆమోదించింది.

FOLLOW US: 

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0, అమృత్ 2.0 ఆమోదం లభించింది. అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ 2.0 (అమృత్ 2.0) ని 2025-26 వరకు ఆమోదించింది. స్వచ్ఛ భారత్ 2.0కు లక్షా 41 వేల 6వందల కోట్ల వ్యయంగా కెబినెట్ ఖరారు చేసింది. తొలిదశలో ఖర్చు చేసిన దానితో పోలిస్తే.. దాదాపు రెండున్నర రెట్లు అధిక వ్యయంగా ఉంది. 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా అడుగులు వేయడమే లక్ష్యంగా ముందుకు సాగనుంది కేంద్రం. అమృత్ 2.0 అమలుకు 2 లక్షల 77వేల కోట్ల వ్యయంగా కేంద్ర కెబినెట్ ఖరారు చేసింది. ఇందులో కేంద్రం వాటా 76వేల 700 కోట్లని అధికారు తెలిపారు.

అమృత్ 2.0..

అమృత్‌ 2.0.. కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా ఉన్న 4,700 పట్టణ స్థానిక సంస్థల్లో 2.68 కోట్ల నల్లా కనెక్షన్లు ఇచ్చి ప్రతి ఇంటికీ తాగునీటి సౌకర్యాన్ని కల్పిస్తారు. 500 అమృత్‌ పట్టణాల్లో ఇళ్లకు కనెక్షన్లు ఇస్తారు. దీనివల్ల పట్టణ ప్రాంతాల్లో ఉన్న 10.5 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుందని ప్రధాన మంత్రి కార్యాలయం పేర్కొంది.

ఉపరితల, భూగర్భ జలాలను సంరక్షించడంతో పాటు, వాటి పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటారు. ఇందుకోసం ప్రపంచస్థాయి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు. ఈ మొత్తం కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం రూ.2.77 లక్షల కోట్లు కేటాయించింది.

నగరాలను చెత్త రహితంగా చేయడమే స్వచ్ఛభారత్ మిషన్ అర్బన్ 2.O లక్ష్యం.  నగరాలన్నింటిలో నీటి సంరక్షణ చర్యలు కూడా చేపట్టనున్నారు. బురదనీరు చెరువుల్లో చేరకుండా చర్యలు చేపట్టనున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను అందుకోవడంలో స్వచ్ఛభారత్ మిషన్ అర్బన్ 2.Oకీలకంగా నిలుస్తుందని కేంద్రం చెబుతోంది.

ఏం చేస్తారు?  • స్వచ్ఛ భారత్‌ (పట్టణ) కింద పట్టణాలను మురుగు నుంచి విముక్తి కల్పిస్తారు.

  • అమృత్‌ పథకం పరిధిలోకి రాని అన్ని పట్టణ ప్రాంతాల్లో మురికి నీటి నిర్వహణ చేపడతారు.

  • అన్ని పట్టణ స్థానిక సంస్థలను బహిరంగ మల విసర్జన రహితంగా మారుస్తారు.

  • ఘన వ్యర్థాలను అవి ఉత్పత్తి అయ్యేచోటే వేరు చేయడంపై దృష్టి సారిస్తారు.

  • వాటిని తగ్గించడం, పునర్వినియోగించడం, పునఃశుద్ధి చేయడం గురించి ఆలోచిస్తారు.

  • మున్సిపాల్టీల్లో వెలువడే అన్నిరకాల వ్యర్థాలను శాస్త్రీయంగా శుద్ధిచేసి, వాటిని సమర్థవంతంగా వినియోగిస్తారు.

Also read: శునకాలు మరణాన్ని ముందే పసిగడతాయా? వాటి అరుపులతో ఆ విషయాన్ని మనకు తెలియజేస్తాయా?

Also read: ఈ అలవాట్లు మానుకోండి... లేకుంటే కిడ్నీలకు ప్రమాదం తప్పదు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Prime Minister Modi swachha bharat 2.0 amrut 2.0 mission central cabinet

సంబంధిత కథనాలు

ముస్లిం వివాహం ఓ కాంట్రాక్టు.. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి.. హైకోర్టు

ముస్లిం వివాహం ఓ కాంట్రాక్టు.. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి.. హైకోర్టు

Actress Molested: విమానంలో నటి నడుంపట్టుకుని ఒళ్లోకి లాక్కున్న వ్యాపారవేత్త.. పురుషుడు అనుకున్నాడట..

Actress Molested: విమానంలో నటి నడుంపట్టుకుని ఒళ్లోకి లాక్కున్న వ్యాపారవేత్త.. పురుషుడు అనుకున్నాడట..

Weather Alert: ఏపీకి మరో రెండు రోజులు రెయిన్ అలర్ట్.. ఆ రాష్ట్రాల్లో ముంచెత్తుతున్న వానలు

Weather Alert: ఏపీకి మరో రెండు రోజులు రెయిన్ అలర్ట్.. ఆ రాష్ట్రాల్లో ముంచెత్తుతున్న వానలు

CBSE Exam Centre Change: సీబీఎస్‌ఈ బోర్డు కీలక ప్రకటన.. ఎగ్జామ్ సెంటర్ మార్పునకు ఓకే!

CBSE Exam Centre Change: సీబీఎస్‌ఈ బోర్డు కీలక ప్రకటన.. ఎగ్జామ్ సెంటర్ మార్పునకు ఓకే!

Priyanka Gandhi Detained: నేను రాష్ట్రంలో తిరగకూడదా? రెస్టారెంట్లో కూర్చోవాలా?: ప్రియాంక గాంధీ

Priyanka Gandhi Detained: నేను రాష్ట్రంలో తిరగకూడదా? రెస్టారెంట్లో కూర్చోవాలా?: ప్రియాంక గాంధీ
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Mahesh Babu- Sai Pallavi: సూపర్ స్టార్ మహేశ్ బాబు బిజినెస్ పెంచిన సాయిపల్లవి...

Mahesh Babu- Sai Pallavi: సూపర్ స్టార్ మహేశ్ బాబు బిజినెస్ పెంచిన సాయిపల్లవి...

Pattabhi Arrest: టీడీపీ నేత పట్టాభి అరెస్ట్.. తలుపులు బద్దలుకొట్టి మరీ ఇంట్లోకి వెళ్లిన పోలీసులు..

Pattabhi Arrest: టీడీపీ నేత పట్టాభి అరెస్ట్.. తలుపులు బద్దలుకొట్టి మరీ ఇంట్లోకి వెళ్లిన పోలీసులు..

Yadadri Temple: యాదాద్రిలో బంగారు తాపడం కోసం మేఘా సంస్థ భారీ విరాళం.. ఎంతంటే..

Yadadri Temple: యాదాద్రిలో బంగారు తాపడం కోసం మేఘా సంస్థ భారీ విరాళం.. ఎంతంటే..

Breaking News Live: మహా వ్యవస్థకు నాంది పలికావు డీజీపీ.. చూస్తా నీ కథ: చంద్రబాబు తీవ్రస్థాయిలో ఫైర్

Breaking News Live: మహా వ్యవస్థకు నాంది పలికావు డీజీపీ.. చూస్తా నీ కథ: చంద్రబాబు తీవ్రస్థాయిలో ఫైర్