Budget Social Media Trolls: బడ్జెట్‌పై సోషల్ మీడియాలో పేలుతున్నజోకులు
Trolls on Budget: కేంద్ర బడ్జెట్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు చెలరేగిపోతున్నారు. మీమ్ పేజీలలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ప్రధాని మోడీని , బీజేపీ ప్రభుత్వాన్ని ఆడుకుంటున్నారు.
Telugu News: కేంద్ర బడ్జెట్ పై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తమ అసహనాన్ని వెళ్లగక్కుతున్నారు. నిన్న పార్లమెంట్ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి దేశవ్యాప్తంగా తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. మైనారిటీ ప్రభుత్వాన్ని నడుపుతున్న మోడీ.. తమను కాపాడుతున్న బీహార్, ఏపీ రాష్ట్రాలకు మాత్రమే నిధులిచ్చిందని, మిగతా రాష్ట్రాలు భారతదేశంలో లేవా అని ప్రశ్నిస్తున్నారు.
దేశ వ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని మీమ్స్
Budget in Null-shit #BudgetSession2024 #BudgetSession pic.twitter.com/jaRNrDWuql
— Driver Hyderabadi Chicha (@HyderabadiChic3) July 23, 2024
Budget reactions pic.twitter.com/RhYLKT9lgn
— Pakchikpak Raja Babu (@HaramiParindey) July 23, 2024
తెలంగాణకు మీరేదో చేస్తారని మీకు అధికారమిస్తే, మీరు చేసేది మాత్రం సున్నా..#TelanganaPrajaPrabhutwam #UnionBudgetOnIndiaTV #BJP4IND #NirmalaSitharaman #Congress #KCROnceagain pic.twitter.com/wohWKeYwju
— KCR Adda (@KCR_Adda) July 23, 2024
పార్లమెంట్ ఆవరణలో కూటమి పార్టీల ధర్నా
కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా బుధవారం ఉదయం సమావేశాలకు ముందు కూటమి పార్టీలకు చెందిన ఎంపీలంతా పార్లమెంట్ (Parliament) వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఇది అని ఆరోపించారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే , సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సహా కూటమి పార్టీల నేతలంతా నిరసన తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని ఖర్గే ఆరోపించారు. ‘ఇది అన్యాయం. న్యాయం కోసం దీనిపై మేము పోరాడుతాం’ అని తెలిపారు. కూటమి నేతలంతా ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నిర్మలా సీతారామన్ ఏపీ, బీహార్ రాష్ట్రాలకు మాత్రమే ఆర్థిక మంత్రి అని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. తమ పార్టీ అఫీషియల్ ఎక్స్ అకౌంట్‌లో "Kursi bachane ki akhri prayas! ప్రధాని కుర్చీని కాపాడుకునేందుకు ప్రయాసపడుతున్న బడ్జెట్‌గా వర్ణించారు. దేశం ఎదుర్కొంటున్న ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి సమస్యలను కూడా పక్కనపెట్టి తమ సంకీర్ణ భాగస్వామ్య పార్టీలకు లంచం ఇచ్చినట్టుగా బడ్జెట్ ఉంది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీ విమర్శించారు.
అది బడ్జెట్ కాదని, అది 2024 లోక్ సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ రూపొందించిన మేనిఫెస్టో అని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం వ్యాఖ్యానించారు. ఈ బడ్జెట్ లో కాంగ్రెస్ మేనిఫెస్టో నుంచే చాలా అంశాలు కాపీ కొట్టారని ఆయన విమర్శించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం ఇదే విధంగా ఇది కుర్చీ బచావో బడ్జెట్ అని విమర్శించారు.
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర బడ్జెట్ పై విమర్శలు గుప్పించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ ఏం ఆశించవచ్చని ఓ జర్నలిస్ట్ ఈ ఉదయం నన్ను అడిగారు. గత 10 సంవత్సరాలుగా మనకు వచ్చేదే రావొచ్చని నేను బదులిచ్చాను. అదేంటంటే.. పెద్ద సున్న మాత్రమే” అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఆదిలాబాద్‌లో ప్రాంతానికి తలమానికంగా ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మూతపడి చాలా ఏళ్లు గడుస్తోంది. ఈ పరిశ్రమను తెరిపించాలని ప్రజాప్రతినిధులు పలుమార్లు కేంద్రమంత్రులను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ బడ్జెట్‌లో మూతబడిన సీసీఐ పరిశ్రమకు నిధులు వస్తాయని స్థానికులు ఆశించారు. కానీ బడ్జెట్‌లో దాని ఊసే లేకపోవడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, కమ్యూనిస్టు నాయకులు మండిపడుతున్నారు.
రైల్వేశాఖకు నిరాశ..
నిత్యం రైలు ప్రమాదాలు, ప్రయాణికుల సమస్యల మధ్య ఈసారి సార్వత్రిక బడ్జెట్‌లో రైల్వేశాఖకు పెద్దపీట వేస్తారని ప్రజలు ఆశించగా, ప్రజల ఆశలు నీరుగారిపోయాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొత్తం ప్రసంగంలో ఒక్కసారి మాత్రమే రైల్వే అనే పదాన్ని ఉపయోగించారు,
ఇక నూతన రైళ్లు, రైల్వే లైన్లు, వంటి ప్రాజెకట్టులేవీ మంజూరు కాలేదు. రైల్వేశాఖకు పెద్దగా నిధులు కేటాయించకపోవడంతో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించడానికి విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని కొప్పర్తి నోడ్, హైదరాబాద్-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లో నీరు, విద్యుత్, రైల్వేలు, రోడ్లు వంటి అవసరమైన మౌలిక సదుపాయాలకు నిధులు మంజూరు చేస్తామని చెప్పారు.
బడ్జెట్‌లో ఎటువంటి ప్రకటన లేకపోవడంతో, రైల్ వికాస్ నిగమ్ (RVNL), ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC), IRCON ఇంటర్నేషనల్, రైల్‌టెల్ కార్పొరేషన్, టెక్స్‌మో రైల్ & ఇంజనీరింగ్ వంటి రైల్వే స్టాక్‌లు 1-5 శాతం క్షీణించాయి.
అదే విధంగా మధ్యంతర బడ్జెట్‌లో ఇవి 11-112 శాతం పెరిగాయి. ఇక మధ్యంతర బడ్జెట్‌లో రైల్వే భద్రత, కొత్త కోచ్‌లు, కారిడార్లు, వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లకు ప్రాధాన్యత ఇవ్వడం విశేషం.