Uniform Civil Code: ఉత్తరాఖండ్‌లో యునిఫామ్ సివిల్ కోడ్ అమలుకి లైన్ క్లియర్! వచ్చే వారమే ముహూర్తం?
Uniform Civil Code: ఉత్తరాఖండ్‌లో త్వరలోనే యూసీసీ అమలు లైన్ క్లియర్ అయినట్టు సమాచారం.
Uniform Civil Code:
యునిఫామ్ సివిల్ కోడ్..
Uniform Civil Code (UCC) పై కేంద్ర ప్రభుత్వం చాలా రోజులుగా సంకేతాలిస్తోంది. దేశమంతా ఇది అమలు చేస్తామని చెబుతోంది. కేంద్రహోం శాఖ కూడా ఈ విషయంపై సీరియస్‌గానే ఉంది. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం UCCని త్వరలోనే అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. చాలా రోజులుగా మేధోమథనం చేస్తున్న ప్రభుత్వం దీనిపై తుది నివేదికను తయారు చేసినట్టు సమాచారం. రిటైర్డ్ జస్టిస్ రంజన దేశాయ్ (Ranjana Prakash Desai) నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ రిపోర్ట్ తయారు చేసింది. వచ్చే రెండ్రోజుల్లో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామికి (Pushkar Singh Dhami) ఈ రిపోర్ట్‌ని అందజేయనుంది కమిటీ. దీపావళి తరవాత ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు పిలుపునిచ్చింది. ఈ సమావేశాల్లోనే Uniform Civil Code Bill ని ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. ఆ సమావేశాల్లోనే దానికి చట్టబద్ధత కల్పించాలన్న పట్టుదలతో ఉంది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. డ్రాఫ్ట్ కమిటీ ముసాయిదా తయారు చేసి ప్రభుత్వానికి ఇస్తుండడంపై రంజన దేశాయ్ ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి బిల్‌ని తయారు చేసే బాధ్యతలు తనకు అప్పగించండం చాలా సంతోషంగా ఉందని అన్నారు.
గుజరాత్‌లోనూ..
ఉత్తరాఖండ్ తరవాత గుజరాత్‌లోనూ యునిఫామ్ సివిల్ కోడ్‌ని అమలు చేసే యోచనలో ఉంది ప్రభుత్వం. లోక్‌సభ ఎన్నికలకు ( Lok Sabha Elections 2024) ముందే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్లాన్ చేసుకుంది. ఉత్తరాఖండ్‌లో యూసీసీకి లైన్ క్లియర్ అయితే...ఈ కోడ్‌ని అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా చరిత్ర సృష్టించనుంది. ఈ యూసీసీతో పాటు బహుభార్యత్వంపై (Polygamy Ban) నిషేధం విధించే బిల్‌నీ ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అంతే కాదు. లివిన్ రిలేషన్‌లో ఉన్న జంటలు కచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలన్న నిబంధనా తీసుకురానున్నట్టు తెలుస్తోంది.
అసోం ప్రభుత్వం కసరత్తు..
అసోం ప్రభుత్వం కూడాా త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోనుంది. బహు భార్యత్వం (Polygamy)పై రాష్ట్రంలో నిషేధం విధించనుంది. త్వరలోనే ఇందుకు సంబంధిచిన బిల్‌ని ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లోనే ఈ బిల్ ప్రస్తావన తీసుకొచ్చేందుకు సీఎం హిమంత బిశ్వ శర్మ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఒకవేళ ఈ సమావేశాల్లో బిల్‌ని ప్రవేశపెట్టడం కుదరకపోతే...వచ్చే ఏడాది జనవరిలో జరిగే సెషన్‌లో తప్పకుండా తీసుకొస్తామని స్పష్టం చేశారు. యునిఫామ్ సివిల్ కోడ్(UCC) లో యాంటీ పాలిగమీ ( anti-polygamy bill) అనేది ఓ భాగం అని తేల్చి చెప్పారు.
"యునిఫామ్ సివిల్ కోడ్ అనేది పార్లమెంట్ పరిధిలోని విషయం. అక్కడే దానిపై నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్రాలు కూడా ఈ చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదంతో అమలు చేసుకోవచ్చు. ఇది కూడా UCCలో భాగమే. అసోంలో బహు భార్యత్వంపై నిషేధం విధించాలని నిర్ణయించుకున్నాం"
- హిమంత బిశ్వ శర్మ, అసోం ముఖ్యమంత్రి
Also Read: రాజస్థాన్‌లో దారుణం,నాలుగేళ్ల బాలికపై SI అత్యాచారం - బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి