By: ABP Desam | Published : 14 May 2022 08:06 PM (IST)|Updated : 14 May 2022 08:06 PM (IST)
ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్ కు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆహ్వానం
TTD Chairman YV Subba Reddy: భువనేశ్వర్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్ధానం మహా సంప్రోక్షణ కార్యక్రమానికి హాజరు కావాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ (Odisha CM Naveen Patnaik)ను ఆహ్వానించారు. శనివారం సాయంత్రం టీటీడీ చైర్మన్ ఒడిశా సీఎంను ఆయన అధికారిక నివాసంలో కలిసి శ్రీవారి ప్రసాదాలు, ఆహ్వాన పత్రిక అందజేసి శాలువతో సన్మానించారు.
మే 21 నుంచి మహా సంప్రోక్షణ..
మే 21 వ తేదీ నుంచి ఆలయ మహాసంప్రోక్షణకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని సుబ్బారెడ్డి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కి తెలియజేశారు. 26వ తేదీ విగ్రహ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ, ఆవాహన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగుతాయని చైర్మన్ వివరించారు. కార్యక్రమానికి హాజరవుతానని నవీన్ పట్నాయక్ తెలియజేశారు. ఒడిశా సీఎంను కలిసిన సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి కొవిడ్19 నిబంధనలు పాటించారు. ముఖానికి మాస్క్ ధరించి కనిపించారు.
అంతకుముందు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి భువనేశ్వర్ లో ఆలయ నిర్మాణ పనులు, మహాసంప్రోక్షణకు జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కళ్యాణ మండపంలోని గదులకు ఏసీ సదుపాయం కల్పించాలని భక్తులు చైర్మన్ ను కోరారు. వెంటనే ఈ ఏర్పాటు చేయాలని చైర్మన్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శ్రీవారి సేవకులతో అక్కడి వసతులు, ఇతర అంశాలపై మాట్లాడి సమాచారం తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జెఈవో వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహ కిషోర్, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, విజిఓ మనోహర్, భువనేశ్వర్ స్థానిక సలహామండలి చైర్మన్ దుశ్యంత్ కుమార్, సభ్యులు పాల్గొన్నారు.
PM Modi in Nepal: నేపాల్ పర్యనటలో మోదీ- ప్రముఖ బౌద్ధ క్షేత్రం సందర్శన
Coronavirus Cases: దేశంలో కొత్తగా 2,202 కరోనా కేసులు- 27 మంది మృతి
Minister Wife's Day Comments: ‘మదర్స్ డే’లాగా భార్యల దినోత్సవం కచ్చితంగా ఉండాలట! ఎందుకో చెప్పిన కేంద్ర మంత్రి
IF Moon Disappeared: భూమి ఉపగ్రహం చంద్రుడు లేకపోతే ఏం జరుగుతుంది ? ఈ మార్పులు ఎప్పుడైనా ఊహించారా
Congress Chintan Shivir: ఈవీఎంల రద్దు, కుటుంబానికి ఒక్క టికెట్, 5 ఏళ్లు ఛాన్స్ - చింతన శిబిరంలో మరిన్ని కీలక నిర్ణయాలివే
Telangana Politics: మొన్న రాహుల్, నిన్న అమిత్ షా పర్యటనల ఉద్దేశమేంటీ ? జాతీయ పార్టీల టార్గెట్గా కేసీఆర్ !
Lovers Death: కొద్దిరోజుల్లోనే పెళ్లి, యాక్సిడెంట్లో ప్రియుడు మృతి - ప్రియురాలు షాకింగ్ నిర్ణయం!
World Hypertension Day: హైబీపీలో కనిపించే లక్షణాలు ఇవే, ఇలా అయితే వెంటనే వైద్యుడిని కలవాల్సిందే
Breaking News Live Updates: నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం, లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు