Viral Video: ఏం గుండెరా అది.. రైలు ఎదురొచ్చిన అస్సలు భయపడలేదు
రైలు.. రెండు, మూడు కిలో మీటర్ల దూరంలో ఉంది.. అనగానే.. ఇక్కడే పక్కకు జరిగిపోతాం. కానీ ఓ ఏనుగు మాత్రం తన దగ్గరకు వచ్చేదాకా.. పక్కకి జరగలేదు.
ఎదురుగా రైలు కనిపిస్తే.. ఏం చేస్తాం.. పరుగో పరుగు కదా. దాని హార్న్ సౌండ్ కే.. భయపడిపోతాం. కానీ ఓ ఏనుగు మాత్రం.. ఏహే రా.. అన్నట్టు రైలు వైపు చూసింది. ఏం చేస్తావ్ అన్నట్టుగా నిలుచుంది. దగ్గరకు వస్తున్నా.. అస్సలు పక్కకు జరగలేదు. ఇక చివరకు ఏమైందంటే..
ఏదైనా... కాస్త.. డిఫరెంట్ గా ఉంటే.. అలాంటి వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతాయి. ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతూ ఉంటాయి. ఏనుగు, నెమలికి సంబంధించిన వీడియో కూడా అలాగే వైరల్ అయింది. ఇక అసలు విషయంలోనకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్‌లోని మల్బజార్ ప్రాంతం. రైల్వే ట్రాక్ పై రైలు వెళ్తుంది. ఈ ఏరియాలో వన్య ప్రాణులు తరచూ రైలు కిందపడి చనిపోతున్నాయి. కానీ ఓ ఏనుగు మాత్రం.. రైలు దగ్గరకు వచ్చే వరకు అలానే నించోని ఉంది. దానికి ముందుగా ఓ నెమలి ఉంది.. రైలు దగ్గరకు వస్తుందనే భయంతో.. పక్కకు తప్పుకుంది. కానీ ఏనుగు మాత్రం.. అలానే నిలుచుని ఉంది. ఏనుగు ట్రాక్ పై నుంచి కదలకపోవడంతో ఎమర్జెన్సీ బ్రేక్ వేశాడు డ్రైవర్. రైలు పుర్తిగా నెమ్మదిగా వస్తుంటే మాత్రమే.. ఏనుగు పక్కకు తప్పుకుంది.
Alert LP & ALP of 15778Dn Alipurduar-NJP Tourist's Spl Sri Y.Amit & K.B.Mandal noticed 2 Wild Elephants & their baby Crossing the track at KM 72/1 btwn NKB-Chalsa at 16.40 hrs today & applied Brake to control the train speed & saved Wildlife. @RailMinIndia @RailNf @wti_org_india pic.twitter.com/I53vW4qh02
— DRM APDJ (@drm_apdj) December 13, 2021
ఎమర్జెన్సీ బ్రేక్ అనేది.. అన్నిసార్లు వేసేందుకు సాధ్యం కాదు. ఒకవేళ ప్రయాణికులు వెళ్లే రైలు అయితే.. ఎమర్జెన్సీ బ్రేక్స్ తో రిస్క్ సైతం ఉంటుంది. ఎందుకంటే.. బోగీలు పట్టాలు తప్పే ప్రమాదం కూడా ఉంటుంది. కానీ ఈ వీడియోలో వన్య ప్రాణి కోసం.. డ్రైవర్ ఎమర్జెన్సీ బ్రేక్ వేసి.., ఏనుగు ప్రాణాలు కాపాడటంపై సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటున్నాడు.
Also Read: డాక్టర్ బాబుని అవమానించిన పిల్లలు… రుద్రాణి వలలో దీప చిక్కుకుంటుందా, కార్తీక దీపం ఈ రోజు ఎపిసోడ్
Also Read: తనలో డాక్టర్ బాబుని కంట్రోల్ చేసుకున్న కార్తీక్.. ఇదేంటని ప్రశ్నించిన దీప.. మరింత ఎమోషనల్ గా మారిన కార్తీక దీపం సీరియల్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి