News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Bombay High Court: బాలిక బుగ్గను తాకితే నేరమా?.. బాంబే హైకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలేంటి?

ఓ కేసులో నిందితుడైన మహమ్మద్‌ అహ్మద్‌ ఉల్లా అనే 46 ఏళ్ల వ్యక్తికి సంబంధించిన కేసు తాజాగా బాంబే హైకోర్టులో విచారణకు వచ్చింది. ఆ సందర్భంగా సింగిల్ జడ్జి బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది.

FOLLOW US: 
Share:

బాలికలను తాకే అంశంపై బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దురభిప్రాయం లేకుండా బాలిక బుగ్గలు తాకడం నేరంగా పరిగణించలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. కామ వాంఛ లేకుండా బాలిక బుగ్గలు తాకడం లైంగిక దాడి కిందకు రాదని పోక్సో చట్టంలోని సెక్షన్‌-7 చెబుతున్నట్లుగా ధర్మాసనం గుర్తు చేసింది. ఓ కేసులో నిందితుడైన మహమ్మద్‌ అహ్మద్‌ ఉల్లా అనే 46 ఏళ్ల వ్యక్తికి సంబంధించిన కేసు తాజాగా బాంబే హైకోర్టులో విచారణకు వచ్చింది. ఆయనకు శనివారం బెయిల్‌ మంజూరు చేసిన సందర్భంగా జస్టిస్‌ సందీప్‌ షిండే ఆధ్వర్యంలోని సింగిల్ జడ్జి బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. 

ఈ కేసులో ఆధారాలను ప్రాథమికంగా పరిశీలించామని, వాటిని పరిగణనలోనికి తీసుకున్న మీదట నిందితుడు లైంగిక కోరికలతో బాలిక బుగ్గలు తాకినట్టు అనిపించలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. మహారాష్ట్రలోని థానేలో ఈ 46 ఏళ్ల మహమ్మద్ అహ్మద్ ఉల్లా అనే వ్యక్తి మాంసం దుకాణం నడుపుతుంటారు. ఈయన 2020 జులైలో ఓ ఎనిమిదేళ్ల బాలికను ఉద్దేశపూర్వకంగా బుగ్గను తాకినట్టు ఆమె తరపువారు కేసు నమోదు చేశారు. అయితే, అంతేకాక, ఆ బాలికను అహ్మద్ ఉల్లా తన మాంసం షాపునకు పిలిచాడని, ఆమె వచ్చిన తర్వాత బుగ్గను తాకి.. తన చొక్కా విప్పాడనే ఆరోపణ వచ్చింది.

Also Read: Suryapet: మహిళ బట్టలిప్పేసి కళ్లలో కారం కొట్టి.. కర్రలతో కొడుతూ నగ్నంగా ఊరేగింపు

అంతటితో ఆగకుండా అతను తన ప్యాంటు కూడా తీయబోయాడని, అదే సమయంలో అక్కడికి వెళ్లిన మరో మహిళ దీన్ని గమనించినట్లుగా ఫిర్యాదు దాఖలైంది. ఈ విషయాన్ని పోలీసులు పేర్కొన్నారు. బాలికను దుకాణంలోకి తీసుకెళ్లడాన్ని చూసిన ఆ మహిళ అనుమానంతో అక్కడికి వెళ్లిందని తెలిపారు. 

వెంటనే ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ప్రస్తుతం నిందితుడు తలోజా జైలులో ఉన్నాడు. తన మాంసం వ్యాపారంలో సమీప ప్రత్యర్థులు కుట్ర పన్ని తనను ఇలా ఈ కేసులో ఇరికించారని వివరణ ఇచ్చుకున్నారు. తానెలాంటి నేరమూ చేయలేదని అహ్మద్ ఉల్లా వాదించాడు. వాదనలు విన్న జడ్జి బెయిల్‌ మంజూరు చేశారు.     

Also Read: Weather Updates: రాగల రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు... పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం!

Also Read: Aarogyasri Telangana: తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా ట్రీట్‌మెంట్

Published at : 30 Aug 2021 10:46 AM (IST) Tags: girl cheek touching Bombay High court pocso act news mumbai crime news

ఇవి కూడా చూడండి

SSC JE Answer Key: ఎస్‌ఎస్‌సీ జూనియర్ ఇంజినీర్ పరీక్ష తుది 'కీ' విడుదల

SSC JE Answer Key: ఎస్‌ఎస్‌సీ జూనియర్ ఇంజినీర్ పరీక్ష తుది 'కీ' విడుదల

IDBI Jobs: ఐడీబీఐ బ్యాంకులో 86 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు, వివరాలు ఇలా

IDBI Jobs: ఐడీబీఐ బ్యాంకులో 86 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు, వివరాలు ఇలా

ISRO Projects in 2024: ఇకపై SSLV రాకెట్‌తో ఇస్రో మరిన్ని ప్రయోగాలు, రాజ్యసభలో కేంద్రం వెల్లడి

ISRO Projects in 2024: ఇకపై SSLV రాకెట్‌తో ఇస్రో మరిన్ని ప్రయోగాలు, రాజ్యసభలో కేంద్రం వెల్లడి

AIIMS Bibinagar: బీబీనగర్‌ ఎయిమ్స్‌‌లో 40 జూనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు, వివరాలు ఇలా

AIIMS Bibinagar: బీబీనగర్‌ ఎయిమ్స్‌‌లో 40 జూనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు, వివరాలు ఇలా

SBI Clerks Recruitment: ఎస్‌బీఐ క్లర్క్ పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

SBI Clerks Recruitment: ఎస్‌బీఐ క్లర్క్ పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు

APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు

Extra Ordinary Man X Review - 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' ఆడియన్స్ రివ్యూ: 'దిల్' రాజునూ వాడేసిన నితిన్ - ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే?

Extra Ordinary Man X Review - 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' ఆడియన్స్ రివ్యూ: 'దిల్' రాజునూ వాడేసిన నితిన్ - ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే?

Vizag Pawan Kalyan : ఏపీ భవిష్యత్ కోసమే టీడీపీ, జనసేన కూటమి - విశాఖలో పవన్ కీలక వ్యాఖ్యలు !

Vizag Pawan Kalyan :  ఏపీ భవిష్యత్ కోసమే టీడీపీ, జనసేన కూటమి - విశాఖలో పవన్ కీలక వ్యాఖ్యలు !

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?