Thanjavur Chariot Incident: రథోత్సవంలో అపశ్రుతిపై ప్రధాని మోదీ దిగ్బ్రాంతి, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం
Thanjavur Chariot Incident: రథోత్సవంలో షార్ట్ సర్క్యూట్ జరిగి 11 మంది భక్తులు సజీవదహనం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు.
Thanjavur Chariot Incident: తమిళనాడులోని తంజూవూరులో జరిగిన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రథోత్సవంలో షార్ట్ సర్క్యూట్ జరిగి 11 మంది భక్తులు సజీవదహనం కావడంతో విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబసభ్యులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం (PM Modi Expresses Grief, Announces Rs 2 Lakh Ex Gratia) ప్రకటించారు. గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున పీఎం నేషనల్ రిలీఫ్ ఫండ్ (PMNRF) నుంచి అందజేస్తామని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of those who have lost their lives due to the mishap in Thanjavur, Tamil Nadu. The injured would be given Rs. 50,000: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 27, 2022
తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. రథోత్సవం నిర్వహిస్తుండగా జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 11 మంది సజీవదహనం అయ్యారు. మరికొంత మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. తంజావూరులోని కలిమేడు అప్పర్ ఆలయ రథోత్సవం నిర్వహిస్తుండగా హై టెన్షన్ విద్యుత్ తీగలకు రథం తాకడంతో షార్ట్ సర్క్యూట్ అయింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి భక్తులు సజీవ దహనం అయ్యారు.
Deeply pained by the mishap in Thanjavur, Tamil Nadu. My thoughts are with the bereaved families in this hour of grief. I hope those injured recover soon: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 27, 2022
ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు
రథోత్సవంలో అపశ్రుతిపై తిరుచిరాపల్లి సెంట్రల్ జోన్ ఐజీ వి బాలక్రిష్ణన్ స్పందించారు. రథాన్ని లాగుతున్న భక్తులు , నిర్వాహకులు విద్యుత్ తీగలను గమనించలేదు. రథం పెద్దదిగా ఉండటంతో రథం హై టెన్షన్ తీగలను తగలడంతో అగ్ని ప్రమాదం సంభవించి విషాదం చోటుచేసుకుందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు వెల్లడించారు.
Also Read: Women Death Mystery : చనిపోయిందని ఏడ్చారు కానీ మమ్మీ రిటర్న్స్ ! ఈవిడ కథలో స్టన్నింగ్ సీక్రెట్స్