By: ABP Desam | Updated at : 07 Mar 2023 10:18 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
ఏనుగులు మృతి
Elephants Died : తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లా, మారండహళ్లి సమీపంలోని కలికౌండన్‌కోట్టై గ్రామానికి చెందిన మురుగేషన్ (50) తన 2 ఎకరాల వ్యవసాయ భూమిలో మొక్కజొన్న, రాగులు, కొబ్బరి పంటలు సాగుచేశాడు. రాత్రి వేళల్లో ఏనుగులు, అడవి పందుల బెడదతో తన వ్యవసాయ భూమిలో అక్రమంగా విద్యుత్ తీగలను అమర్చాడు. రాత్రి ఆహారం, నీరు వెతుక్కుంటూ వచ్చిన 5 ఏనుగులు తీగకు చిక్కుకోగా మూడు ఏనుగులు అక్కడికక్కడే మృతి చెందాయి. మరో రెండు ఏనుగులు ప్రాణాలతో బయటపడ్డాయి. 5 ఏనుగుల గుంపులో మూడు ఏనుగులు విద్యుత్ షాక్ తో మృతి చెందగా మరో రెండు ఏనుగులు మృతి చెందిన ఏనుగుల వద్దే తిరుగుతున్న దృశ్యాలు స్థానికులను కలచివేశాయి. గత ఏడాది సైతం ఇదే ప్రాంతంలో ఓ ఏనుగు వ్యవసాయ బావిలో పడి మృతి చెందింది. రాయకోట ఫారెస్ట్ అధికారులు రైతు మురుగేషన్ పై అటవీ శాఖా చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతి చెందిన ఏనుగులకు శవపరీక్షలు నిర్వహించి అంత్యక్రియలు నిర్వహించారు.
మారండహళ్లిలోని ఒక గ్రామానికి సమీపంలో అక్రమ విద్యుత్ కంచెలో చిక్కుకుని రెండు ఆడ ఏనుగులు, ఒక మగ ఏనుగు మరణించాయి. అయితే ఫారెస్ట్ స్క్వాడ్ విద్యుత్ సిబ్బందిని అప్రమత్తం చేయడంతో సమూహంలోని రెండు ఏనుగు పిల్లలను రక్షించారు. విద్యుత్ వైర్‌ను సిబ్బంది డిస్‌కనెక్ట్ చేశారు. ధర్మపురిలోని కెందనహళ్లిలోని కాళీ కవుందర్ కొట్టాయ్ గ్రామంలో సోమవారం రాత్రి 10.30 గంటలకు రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. మారండహళ్లిలో మూడు పెద్ద ఏనుగులు, రెండు పిల్లలు కూడిన గుంపు పంట పొలాల వైపు వచ్చాయి. అటవీ శాఖ ఆ గుంపు దారిని మళ్లించేందుకు ప్రయత్నించిందన్నారు. అయితే ఇంతలోనే ప్రమాదం జరిగిందన్నారు. మా సిబ్బంది వచ్చే సరికి మూడు ఏనుగులు నేలపై పడివున్నాయి, రెండు పిల్ల ఏనుగులు వాటి చుట్టూ తిరుగుతున్నాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు. వెంటనే విద్యుత్ శాఖ సిబ్బందిని అప్రమత్తం చేసి విద్యుత్ సరఫరాను నిలిపివేశామన్నారు. పెద్ద ఏనుగుల వయస్సు దాదాపు 30 సంవత్సరాలు ఉంటుందన్నారు.
విద్యుత్ వైర్ ఒక అడుగున్నర ఎత్తులో ఒక చెక్క కర్రకు పొలం చుట్టూ కట్టారు. ఆ విద్యుత్ వైర్ కు అక్రమంగా కనెక్షన్ ఇచ్చారని డీఎఫ్ఓ నాయుడు తెలిపారు. ఈ ప్రమాదం 9 నెలల లోపు వయస్సు గల రెండు పిల్ల ఏనుగులకు విషాదం మిగిల్చింది. అవి ఆ ప్రాంతం చుట్టూ తిరుగుతూ రోధించిన తీరు గ్రామస్థులను కలచివేసింది. చనిపోయిన తల్లులకు దగ్గరే ఆ రెండు పిల్లలు ఉండిపోయాయి. ఆ పిల్ల ఏనుగులను వేరే సమూహంతో కలపడానికి ప్రయత్నిస్తామని డీఎఫ్ఓ అన్నారు.
బుధవారం తెప్పకాడు ఏనుగుల శిబిరం నుంచి ప్రత్యేక బృందం అక్కడికి చేరుకుని ఏనుగు పిల్లలను గుంపు వద్దకు చేర్చేందుకు ప్రయత్నిస్తుంది. ఒక గుంపు కనుగొని అవి దూడలను అంగీకరిస్తాయో లేదో చూడాలన్నారు డీఎఫ్ఓ నాయుడు. ఒకవేళ ఏనుగుల గుంపు ఈ పిల్లలను రానివ్వకపోతే వాటిని ముదుమలై ఏనుగుల శిబిరానికి పంపుతామని నాయుడు తెలిపారు. మూడు ఏనుగులను పోస్టుమార్టం అనంతరం ఆ స్థలంలోనే పూడ్చిపెట్టారు. రెండు పిల్లలను మృతదేహాల నుంచి 200 మీటర్ల దూరం వరకు తరలించి, ఓ ప్రత్యేక బృందం వాటికి ఆహారం అందిస్తూ పర్యవేక్షిస్తోంది. అటవీ అధికారులు పొలాల్లో రెగ్యులర్ డ్రైవ్‌లు నిర్వహిస్తుంటే ఈ ప్రమాదాలు జరగవని స్థానికులు అంటున్నారు. అక్రమంగా విద్యుత్ వైర్ ఏర్పాటు చేసిన 67 ఏళ్ల రైతు కె. మురుగేషన్‌ను అరెస్టు చేశారు.
America Jobs: అమెరికాలో ఉద్యోగం చేయాలని ఉందా? అయితే ఇలా వెళ్లి జాబ్ చేసుకోండి!
CRPF Admit Cards: సీఆర్‌పీఎఫ్ పారామెడికల్ స్టాఫ్ హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
Hindenburg Research: అదానీ తర్వాత హిండెన్‌బర్గ్ టార్గెట్ చేసిన కంపెనీ ఇదే! వెంటనే 19% డౌనైన షేర్లు
Accenture Layoffs: అసెంచర్‌లోనూ లేఆఫ్‌లు, ఏకంగా 19 వేల మందిని తొలగిస్తామని ప్రకటించిన కంపెనీ
Coronavirs Cases India: మళ్లీ టెన్షన్ పెడుతున్న కరోనా, కొత్త స్ట్రాటెజీ ప్రకటించిన కేంద్రం
TSPSC Exams : రాజకీయంలో చిక్కుకుపోతున్న టీఎస్‌పీఎస్సీ - మళ్లీ పరీక్షలు ఎప్పుడు ?
Sajjala On Mlc Results : టీడీపీకి ఓటు వేసిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలెవరో తెలుసు, డబ్బులు ఆశచూపి ప్రలోభపెట్టారు- సజ్జల
పేపర్ లీక్ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు
CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ