అన్వేషించండి

Sugar Price: వర్షాల ఎఫెక్ట్‌- చేదెక్కుతున్న చెక్కెర

Sugar Price: రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మొన్నటి వరకు టమాటా, నిన్న ఉల్లి, నేడు చక్కెర ధరలు.. రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి.

Sugar Price: రోజురోజుకూ నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయి. మొన్నటి వరకు టమాటా, నిన్న ఉల్లి ధరలు ప్రజలను కూరలు చేసుకోనీయకుండా చేస్తే... నేడు చెక్కెర సామాన్య ప్రజల నోటిని చేదు చేస్తోంది. మరోవైపు బయ్యం, పప్పులు, ఇతర సరకుల ధరలు అమాంతం పెరుగుతుండగా.. ప్రస్తుతం పంచదార ధర కూడా విపరీతంగా పెరిగింది. ఇప్పటికే చక్కెర ధర రికార్డు స్థాయికి చేరిందని.. మరో రెండు, మూడు నెలల పాటు ఇవే ధరలు కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. సరిపడా నిల్వలు లేకపోవడం వల్లే ధరలు పెరుగుతున్నట్లు వివరించారు. వర్షాభావ పరిస్థితులు, చెరకు ఉత్పత్తిపై నెలకొన్న ఆందోళన, క్రష్షింగ్ సీజన్ ప్రారంభంలో నెలకొన్న ఆలస్యం ఇందుకు కారణం అని జేఎం ఫైనాన్షియల్ ఇన్ స్టిట్యూషన్స్ సెక్యూరిటీస్ తన నివేదికలో పేర్కొంది. అయితే చెరకు ఉత్పత్తిపై నెలకొన్న ఆందోళన నేపథ్యంలో పంచదార ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే అంతర్జాతీయంగా కూడా చక్కెర ధరలు భారీగా పెరుగుతాయని, 12 ఏళ్ల గరిష్టానికి చేరుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

మరోవైపు దేశంలో చక్కెర ఉత్పత్తి తగ్గిపోతుందని అంతా భావిస్తున్నారు. 2023, 2024 అక్టోబర్, సెప్టెంబర్ సీజన్ లో నికర చక్కెర ఉత్పత్తి 31.7 మిలియన్ టన్నులుగా ఉంటుందని ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ ప్రాథమికంగా అంచనా వేసింది. అలాగే ఈ ఏడాది ఆగస్టు నెలలో ప్రధానంగా చెరకు ఎక్కువగా పండించే మహారాష్ట్ర, కర్ణాటకతోపాటు దేశ వ్యాప్తంగా మెజార్టీ ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే దేశ ఉత్పత్తిలో.. మహారాష్ట్ర, కర్ణాటక నుంచే దాదాపు 45 నుంచి 50 శాతం ఉంటుంది. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో రైతులు పంట మార్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. 

ఈ ఫలితంగానే చక్కెర ఉత్పత్తి మరింతగా పడిపోతుందని అంతా అనుకుంటున్నారు. రాబోయే సీజన్ లో దాదాపు 30 మిలియన్ టన్నులుగా ఉంటుందని నివేదికలో పేర్కొన్నారు. దేశీయ వినియోగం 25 నుంచి 28.5 మిలియన్ టన్నులుగా ఉంటుంది. అయితే పరిస్థితి మరీ ఇబ్బందికరంగా ఏమీ ఉండకపోవచ్చని... కానీ ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించాలని భావిస్తే మాత్రం మే నెల తర్వాతనే ఉంటుందని నివేదిక అభిప్రాయ పడింది.

మరోవైపు విపరీతంగా పెరిగిపోయిన గోధుమల ధరలు

రష్యా నుంచి తక్కువ ధరకే గోధుమలు దిగుమతి చేసుకునే పనిలో పడింది భారత్. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా గోధుమల సరఫరాలో అంతరాయం కలిగింది. ఈ దాదాపు అన్ని దేశాల్లోనూ ఈ ప్రభావం పడింది. ముఖ్యంగా భారత్‌లో ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతూ పోతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ద్రవ్యోల్బణాన్ని అడ్డుకోవాలంటే డిమాండ్‌కి తగ్గట్టుగా సరఫరా ఉండాలి. అందులోనూ వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలున్నాయి. ఇలాంటప్పుడే ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తోంది మోదీ సర్కార్. అందులో భాగంగానే రష్యా నుంచి గోధుమలు దిగుమతి చేసుకునేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రైవేట్ ట్రేడ్ ద్వారా అయినా, లేదంటే రెండు ప్రభుత్వాలు అధికారికంగా ఒప్పందం చేసుకునైనా గోధుమలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం. ఇప్పటికే రష్యాతో చర్చలు మొదలైనట్టు కొన్ని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. జులై రికార్డు స్థాయి ధర పలికాయి గోధుమలు. గత 15 నెలల్లో ఎప్పుడూ లేనంతగా ధరలు పెరిగాయి. నిజానికి గోధుమలు దిగుమతి చేసుకునేందుకు భారత్ ఎప్పుడూ దౌత్య చర్చలు జరపలేదు. చివరిసారిగా 2017లో ఆ అవసరం వచ్చింది. ఇప్పుడు ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో ఆధార పడుతోంది. 

టాప్ హెడ్ లైన్స్

Independence Day 2026 PM Modi Speech Highlights: సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
CJP Instagram: స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీజేఐకి షాక్! ఇన్‌స్టాగ్రామ్ ఖాతా డిలీట్‌! అభిజిత్ దీప్కే ఆగ్రహం !
స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీజేఐకి షాక్! ఇన్‌స్టాగ్రామ్ ఖాతా డిలీట్‌! అభిజిత్ దీప్కే ఆగ్రహం !

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Devdutt Padikkal Century: శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
Comrade Kalyan Release Date : మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
Embed widget