అన్వేషించండి

Monsoon in India 2026: ఈ ఏడాది భారత్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. టెన్షన్ పెంచుతున్న వెదర్ రిపోర్ట్

Monsoon for India | భారత్‌లో ఈ ఏడాది తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, అందుకు ఎల్ నినో కారణం అవుతాయని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది.

Skymet Prediction | భారత్‌లో ఈ ఏడాది వర్షాకాలంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ప్రైవేట్ వాతావరణ అంచనా సంస్థ స్కైమెట్ వెల్లడించింది. ముఖ్యంగా జూన్ నుండి సెప్టెంబర్ వరకు నైరుతి రుతుపవనాలు కొనసాగే వర్షాకాలం రెండో భాగంలో ఎల్ నినో (El Nino) ప్రభావం వల్ల వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని సంస్థ అంచనా వేసింది. ఈ 4  నెలల నైరుతి రుతుపవన కాలంలో దీర్ఘకాలిక సగటు వర్షపాతం 868.6 మి.మీ కాగా, ఇందులో కేవలం 94 శాతం మాత్రమే వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

భారత వాతావరణ శాఖ (IMD) విడుదల చేయనున్న అంచనా వివరాలపై ప్రభుత్వం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. వచ్చే వారం IMD తన తొలి ముందస్తు అంచనాలను విడుదల చేయనుందని తెలిసిందే. భారత్‌లో ఏడాదిలో నమోదయ్యే వర్షపాతంలో దాదాపు 70 శాతం వరకు నైరుతి రుతుపవనాల ద్వారా సాధ్యమవుతుంది. భారత జిడిపికి వెన్నెముకగా ఉన్న వ్యవసాయ రంగానికి ఈ వర్షాలు అత్యంత కీలకమని తెలిసిందే. దేశంలోని మొత్తం జనాభాలో సగానికి పైగా ప్రజలు జీవనోపాధి వ్యవసాయంపైనే ఆధారపడి ఉంటుంది. 

రైతులకు అతిముఖ్యమైనది ఖరీఫ్ సీజన్ సీజన్. ఈ సాగు ప్రధానంగా జూన్, జూలై నెలల్లో మొదలవుతుంది. ఆ సమయంలో నైరుతి రుతుపవనాలు సమయానికి రావడం, అవి దేశ వ్యాప్తంగా త్వరగా విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాధారణంగా జూన్ 1న లేదా తొలి వారంలో కేరళను తాకే రుతుపవనాలు, జూలై 15 నాటికి ఉత్తరాది సహా దేశమంతటా అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తాయి.

ఎల్ నినో ప్రభావంతో వర్షపాతంపై ప్రతికూల ప్రభావం
పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా పెరగడాన్ని ఎల్ నినో అని వ్యవహరిస్తారు. ఈ ఎల్ నినో రావడం సాధారణంగా రుతుపవనాలను బలహీనపరుస్తుంది. అందుకు భిన్నంగా సముద్ర ఉపరితలం చల్లగా మారితే దాన్ని లా నినా (La Nina) అని అంటారు. లా నినా ఏర్పడితే వర్షపాతం పెరుగుతుందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. కానీ ప్రస్తుతం ఎల్ నినో ప్రభావం కనిపిస్తుండటంతో ఈ ఏడాది భారత వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావం పడుతుందన్న నెలకొంది. అయితే వచ్చే వారం భారత వాతావరణ శాఖ విడుదల చేయనున్న అంచనా నివేదిక కోసం అటు వ్యవసాయ రంగంతో పాటు దానిపై ఆధారపడిన రంగాల వారు, కేంద్ర ప్రభుత్వం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Vijay vs Udhayanidhi Stalin: తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
Air India New CEO: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Embed widget