By: ABP Desam | Updated at : 04 Jul 2022 09:04 PM (IST)
సిద్దూ హంతకుల వైరల్ వీడియో
Sidhu Moose Wala's murder accused Viral Video : పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నింతులు గన్స్‌తో కారులో తిరుగుతూ వీడియో తీసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. గత మే 29న సిద్ధూను దుండగులు కాల్చి చంపారు. ఈ హత్యకు పాల్పడ్డ గ్యాంగుకు చెందిన ఇద్దరు షూటర్లను తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరిలో ఒకరు అంకిత్ సిర్సా కాగా, మరొకరు అతడి అనుచరుడు సచిన్ బివాని. ఇద్దరిలో అంకిత్ సిర్సా వయసు 19 ఏళ్లే .
#WATCH | In a viral video, Sidhu Moose Wala's murder accused Ankit Sirsa, Priyavrat, Kapil, Sachin Bhivani, & Deepak brandished guns in a vehicle pic.twitter.com/SYBy8lgyRd
— ANI (@ANI) July 4, 2022
సిద్ధూ హత్యకు పాల్పడింది లారెన్స్ బిష్ణోయ్ అనే గ్యాంగ్‌స్టర్‌కు చెందిన గ్యాంగ్. గోల్డీ బ్రార్ అనే కెనడాకు చెందిన మరో గ్యాంగ్‌స్టర్ సూచనల మేరకు లారెన్స్ గ్యాంగ్ సభ్యులు ఈ హత్యకు పాల్పడ్డారు. ఈ కాల్పుల ఘటనలో పాల్గొన్న వారిలో అంకిత్ సిర్సా, సచిన్ బివాని ఉన్నారు. ఈ గ్యాంగు గతంలో కూడా పలు నేరాలు, హత్యలకు పాల్పడింది. హరియాణాలోని సోనిపట్‌కు చెందిన అంకిత్ నాలుగు నెలల క్రితమే లారెన్స్ గ్యాంగులో చేరాడు. అంకిత్ పాల్గొన్న తొలి హత్య సిద్ధూదే.
Main shooter ankit sirsa in sidhu moosewala murder just 19 year old boy was having ak 47 what was the police and intelligence agency where doing the same police catches any sikh with local handmade guns label them terrorist what was source for guns.❓ #MoosewalaParentsSeekJustice pic.twitter.com/ofOKzbtatI
— ਮਨਰਾਜ मनराज singh (@manraj_mokha) July 4, 2022
రాజస్థాన్‌లో జరిగిన మరో రెండు హత్యలతో అంకిత్ సిర్సాకు సంబంధాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు.సిద్ధూ హత్య జరిగేటప్పుడు పక్కనే అంకిత్, ప్రియావ్రత్ ఫౌజీ అనే మరో గ్యాంగ్‌స్టర్ కారులో ఉన్నారు. వీరిద్దరూ పోలీసు దుస్తులు ధరించి, సిద్ధూ వాహనానికి కారు అడ్డుగా పెట్టారు. తర్వాత అంకిత్ దగ్గరి నుంచి సిద్ధూను కాల్చాడు. అనంతరం అక్కడి నుంచి ఇద్దరూ పారిపోయారు. అంకిత్, సచిన్ బివాని నుంచి పోలీసులు పిస్టల్, సిమ్ కార్డు, పోలీస్ యునిఫామ్ స్వాధీనం చేసుకున్నారు. వారి ఫోన్లలోనే ఈ వీడియో ఉన్నట్లుగా తెలుస్తోంది.
Bihar BJP JDU Alliance End: రాజీనామాకు నితీశ్ కుమార్ రెడీ- BJPకి హ్యాండ్ ఇచ్చిన జేడీయూ!
Maharashtra Cabinet Expansion: ఎట్టకేలకు 'మహా' కేబినెట్ విస్తరణ- 18 మందికి చోటు, మహిళలకు నో ఛాన్స్!
Bihar Political Crisis: బిహార్ రాజకీయంలో మరో ట్విస్ట్- గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన నితీశ్!
ABP Desam Anniversary: ఏబీపీ దేశం తొలి వార్షికోత్సవం- మొదటి అడుగుతోనే మరింత ముందుకు
Nature Index Rank: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీనే నెంబర్ వన్ - నేచర్ ఇండెక్స్ ర్యాంకులో టాప్
Dangerous Job: ప్రపంచంలో ప్రమాదకరమైన ఉద్యోగం ఇదే, ఈ పని చేసిన వారు 50 ఏళ్లు బతకడం చాలా కష్టం
Happy Rakhi Pournami 2022: రక్షా బంధన్ శుభముహూర్తం ఎప్పుడు, రాఖీ ఏ టైమ్ లో కట్టాలి!
Munugodu ByElections : చలో మునుగోడు ! తెలంగాణ రాజకీయం అంతా ఇక అక్కడే
Actress Pragathi : ఏ వయస్సులో చేయాల్సినవి ఆ వయస్సులో చేయాలి - ప్రగతిపై పంచ్