Schools will be accredited soon : స్కూళ్లకూ అక్రిడేషన్ తప్పని సరి - కేంద్రం కీలక నిర్ణయం !
అన్ని స్కూళ్లను అక్రిడేషన్ పరిధిలోకి తేవాలని కేంద్రం నిర్ణయించింది. ఇందు కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తోంది. ఉన్నత విద్యాసంస్థలన్నింటినీ ర్యాంకుల పరిధిలోకి తేనుంది.
Schools will be accredited soon : వచ్చే ఏడాది నుంచి దేశంలో అన్ని స్కూళ్లకు అక్రిడేషన్ తప్పని సరి చేయాలని కేంద్రం నిర్ణయించింది. అలాగే ఉన్నత విద్యా సంస్థలన్నీ నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ ( NIRF ) పరిధిలోకి తేవాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. స్కూల్స్ అన్నింటికీ అక్రిడేటెడ్ పరిధిలోకి తీసుకు రావడానికి త్వరలోనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ఈ విషయంలో స్కూల్స్ కంగారు పడాల్సిన పనిలేదు అక్రిడేషన్ అసెస్‌మెంట్ మొత్తం పారదర్శకంగా... సెల్ఫ్ అసెస్‌మెంట్ బేసిస్‌లోనే జరుగుతుందని ప్రధాన్ తెలిపారు.
వామ్మో! తండ్రిని కొట్టిన వ్యక్తిని గన్‌తో కాల్చేసిన పిల్లల గ్యాంగ్- విదేశాల్లో కాదు మన రాజధానిలోనే!
దేశంలో ఉన్న ప్రతి విద్యా సంస్థ అక్రిడేట్ చేసుకోవాల్సిందేనని కేంద్రం చెబుతోంది.ఈ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వాలను భాగం చేస్తామని చెబుతున్నారు. తమ పిల్లలను చదువుతున్న స్కూళ్ల గురించి తెలుసుకునే హక్కు ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు ఉంటుందన్నారు. ప్రస్తుతం దేశంలో విద్య కేంద్ర, రాష్ట్ర అంశాల పరిధిలో ఉంది. రాష్ట్రపరిధిలో స్టేట్ సిలబస్, కేంద్ర పరిధిలో సీబీఎస్‌ఈ సిలబస్ తో స్కూళ్లు నడుస్తున్నాయి.
రెండో పెళ్లి చేసుకోవాలంటే పర్మిషన్ తప్పదు, ఆ రాష్ట్రంలో కొత్త రూల్
అయితే ఇప్పుడు కేంద్రం అన్ని స్కూళ్లకు అక్రిడేషన్ ఇవ్వాలని నిర్ణయించడంతో సిలబస్‌ను కూడా ఏకీకృతం చేస్తారా లేకపోతే ఇప్పుడున్న పద్దతిలోనే కొనసాగిస్తారా అన్నదానిపై స్పష్టత లేదు. దేశంలో ఉన్నత విద్యా సంస్థలకు ర్యాంకింగ్‌లు ఇచ్చే సిస్టం నడుస్తోంది. అయితే అన్నీ విద్యా సంస్థలూ ఈ జాబితాలో లేవు. ఇక నుంచి మెరుగైన కాలేజీలను.. విద్యాసంస్థలను విద్యార్థులు ఎన్నుకునేందుకు ఈ ర్యాంకులను అన్ని ఉన్నత విద్యాసంస్థలకు ఇవ్వలని సంకల్పించారు. వచ్చే ఏడాది నుంచి కేంద్రం తీసుకొస్తున్న ఈ మార్పులు విద్యా రంగంలోకి కీలకంగా మారే చాన్స్ ఉంది.
ప్రేమంటే సులువు కాదురా ! - ఢిల్లీ మెట్రోలో ఆ జంటను చూస్తే అర్థమైపోతుంది
ఈ మార్పలకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత వరకూ సహకరిస్తాయన్నది కూడా ముఖ్యమే. ఇప్పటికే మెడికల్ సీట్ల భర్తీకి నిర్వహిస్తున్న నీట్ ఎగ్జామ్ విషయంలో రాష్ట్రాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇంజనీరింగ్ కాలేజీలకూ త్వరలో ఇదే పద్దతి అమలు చేస్తారన్న ప్రచారమూ జరుగుతోంది. ఇప్పుడు స్కూళ్లను కూడా కేంద్ర పరిధిలోకి తీసుకోవడానికి ప్రస్తుతం ముందడుగు వేస్తున్నారన్న అభిప్రాయం ఏర్పడితే రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించే అవకాశం ఉంది.