అన్వేషించండి

Jaishankar-Blinken Meet: కాసేపట్లో జైశంకర్‌, బ్లింకెన్‌ భేటీ-మళ్లీ పాత పాటే పాడిన అమెరికా

కాసేపట్లో జైశంకర్‌, బ్లింకెన్‌ భేటీ జరగనుంది. సమావేశానికి ముందు కెనడా ఆరోపణలను మరోసారి ఖండించింది భారత్‌. అయితే అమెరికా మాత్రం పాత పాటే పాడింది.

అమెరికా పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌.. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో సమావేశం కానున్నారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్  నిజ్జార్‌ హత్యపై కెనడా-భారత్‌ మధ్య దౌత్యపరమైన వివాదం కొనసాగుతోంది. ఎస్.జైశంకర్-బ్లింకెన్‌ మీటింగ్‌లో.. భారత్‌-కెనడా మధ్య దౌత్యవివాదంపై చర్చించే అవకాశం  ఉన్నట్టు తెలుస్తోంది. అయితే... బ్లింకెన్‌తో సమావేశానికి ముందు కెనడా ఆరోపణలోను మరోసారి ఖండించింది భారత్‌. కెనడా ఆరోపణలు నిరాధారమైనవని జైశంకర్‌  ప్రకటించారు. అయితే అమెరికా మాత్రం పాతపాటే పాడింది. ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసులో కెనడా దర్యాప్తునకు భారత్‌ సహకరించాలని కోరింది అమెరికా. 

మధ్యాహ్నం ఎస్‌.జైశంకర్-బ్లింకెన్‌ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్‌లో ఏయే అంశాలపై చర్చిస్తారనే విషయంపై స్పందించేందుకు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి  మాథ్యూ మిల్లర్ నిరాకరించారు. జైశంకర్‌-బ్లింకెన్‌ సమావేశాల ఎజెండా తాను చెప్పదలుచుకోలేదని అన్నారు. అయితే...  కెనడా అంశంలో తమ అభిప్రాయాన్ని ఇప్పటికే  స్పష్టంగా చెప్పామన్నారు. ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యపై కెనడా దర్యాప్తునకు భారత్‌ సహకరించాలని మరోసారి వ్యాఖ్యానించారు. 

గత వారం న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సెషన్‌లో జైశంకర్- బ్లింకెన్ సమావేశమయ్యారు. అయితే, ఆ సమావేశంలో భారత్-కెనడా దౌత్యవివాదంపై  చర్చ జరగలేదని సమాచారం. మంగళవారం న్యూయార్క్‌లోని కౌన్సిల్ ఫర్ ఫారిన్ రిలేషన్స్‌లో మాట్లాడుతూ... కెనడా చేసిన ఆరోపణలపై భారతదేశ వైఖరిని  పునరుద్ఘాటించారు జైశంకర్. విధానపరంగా భారత్‌ అలాంటి చర్యలకు పాల్పడదని స్పష్టం చేశారు. కెనడా ప్రధాని ఆరోపణలపై అమెరికా తీవ్ర ఆందోళన చెందుతోందని మిస్టర్  బ్లింకెన్ అన్నారు. అమెరికా జవాబుదారీతనం చూడాలని కోరుకుంటోందని... ఈ విషయంలో దర్యాప్తు జరిగడం ముఖ్యమని భావిస్తున్నామన్నారు. కెనడా ఆరోపణలను  భారతదేశం నిర్ద్వంద్వంగా తిరస్కరించిందని..  అవి నిరాధార ఆరోపణలని ఖండించింది. నిజ్జర్‌ హత్యకు సంబంధించిన నిర్దిష్ట సమాచారం అందిస్తే..దర్యాప్తు చేస్తామని జైశంకర్  కెనడాకు స్పష్టంగా తెలియజేశారు. 

ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య వెనుక భారత్‌ ఏజెంట్ల హస్తం ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఆరోపించడంతో... ఇరు దేశాల మధ్య దౌత్యవివాదం  రాజుకుంది. కెనడా ఆరోపణలను భారత్‌ తీవ్రంగా ఖండించగా... అగ్రరాజ్యం అమెరికా కెనడాకు అనుకూలంగా వ్యవహరించడం హాట్‌ టాపిక్‌గా మారింది. కెనడా ఆరోపణలపై  భారత్‌ దర్యాప్తునకు సహకరించాలని అమెరికా పదేపదే సూచిస్తోంది. అంతేకాదు నిజ్జర్ హత్యపై నిఘా సమాచారాన్ని అగ్రరాజ్యమే కెనడాకు ఇచ్చినట్లు కూడా అంతర్జాతీయ  మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో జైశంకర్‌-బ్లింకన్‌ మీటింగ్‌పై ఆసక్తి రేగుతోంది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
Chiranjeevi On Vikram 1: విక్రమ్ 1 విజయంపై చిరంజీవి ట్వీట్... పీఎం మోడీ, పవన్ కళ్యాణ్ సైతం... స్కైరూట్‌కు అభినందనలు
విక్రమ్ 1 విజయంపై చిరంజీవి ట్వీట్... పీఎం మోడీ, పవన్ కళ్యాణ్ సైతం... స్కైరూట్‌కు అభినందనలు
Skyroot Aerospace : మన స్పేస్ ఎక్స్.. స్కైరూట్! గ్లోబల్ స్పేస్ వార్‌లో ఎలోన్ మస్క్‌కు పోటీగా నిలుస్తున్న తెలుగు కుర్రాళ్లు
మన స్పేస్ ఎక్స్.. స్కైరూట్! గ్లోబల్ స్పేస్ వార్‌లో ఎలోన్ మస్క్‌కు పోటీగా నిలుస్తున్న తెలుగు కుర్రాళ్లు
Skyroot Vikram-1 launch: నింగిలోకి దూసుకెళ్లిన స్కైరూట్ విక్రమ్‌-1! అంతరిక్షానికి ఉబర్‌ లాంటి సేవలు ప్రారంభం!
నింగిలోకి దూసుకెళ్లిన స్కైరూట్ విక్రమ్‌-1! అంతరిక్షానికి ఉబర్‌ లాంటి సేవలు ప్రారంభం!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Nara Lokesh Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
CM Revanth Reddy: ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Embed widget