అన్వేషించండి
Advertisement
Russia Ukraine War: అలాంటిదేం లేదు, ఉక్రెయిన్‌లో మా విద్యార్థులు బందీలుగా లేరు: భారత్
Russia Ukraine War: భారత విద్యార్థులను ఉక్రెయిన్‌లో బందీలుగా చేసినట్లు వస్తోన్న వార్తలను విదేశాంగ శాఖ ఖండించింది. అలాంటి వార్తలేమి రాలేదని స్పష్టం చేసింది.
Russia Ukraine War: ఉక్రెయిన్‌లో భారత విద్యార్థులను నిర్బంధించారని రష్యా చేసిన ప్రకటనను భారత్ ఖండించింది. తమ విద్యార్థులను ఉక్రెయిన్ బందీలుగా చేసినట్లు ఎక్కడా నివేదిక లేదని భారత విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బగ్చీ అన్నారు.
" భారత విద్యార్థిని.. ఖార్కివ్‌లో ఉక్రెయిన్ అధికారులు నిర్బంధించారని మాకు ఎక్కడా సమాచారం రాలేదు. భారత విద్యార్థులను జాగ్రత్తగా తరలించేందుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని ఉక్రెయిన్ అధికారులను మేం కోరాం. వారు సానుకూలంగా స్పందించారు. "
- అరిందమ్ బగ్చీ, భారత విదేశాంగ ప్రతినిధి
ఆపరేషన్ గంగా
మరోవైపు 'ఆపరేషన్ గంగా'లో భాగంగా మరో 3726 మంది భారతీయులు గురువారం స్వదేశానికి రానున్నట్లు కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత బుధవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశం తరువాత భారత వాయుసేన రంగంలోకి దిగింది. రెండు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు హంగేరి, రొమేనియా నుంచి భారతీయులను తీసుకుని భారత్ చేరుకున్నాయి. మరో మూడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు పోలాండ్, హంగేరి, రొమేనియా నుంచి విద్యార్థులను తరలించనున్నాయి.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion