Russia Ukraine War: నేను చెప్తే పుతిన్ యుద్ధం ఆపేస్తారా?: సీజేఐ ఎన్వీ రమణ
Russia Ukraine War: భారత సుప్రీం కోర్టు యుద్ధం ఆపమని చెప్తే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వింటారా? అని సీజేఐ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.
Russia Ukraine War: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత పౌరులను తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇందుకు సంబంధించి కేంద్రానికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం.. కీలక వ్యాఖ్యలు చేసింది.
తరలింపు వేగవంతం
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మరింత వేగవంతం చేసింది.
►ఆపరేషన్ గంగ కార్యక్రమంలో భాగంగా మరో 220 మంది పౌరులను తీసుకువచ్చింది.
►రొమేనియా నుంచి భారత వైమానిక దళం (ఐఏఎఫ్) విమానం సీ-17.. గురువారం తెల్లవారుజామున దిల్లీకి చేరుకుంది.
► ఇప్పటివరకు ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 3 వేల మంది భారతీయులను ప్రభుత్వం స్వదేశానికి తీసుకువచ్చింది.
మరో 9 విమానాలు
'ఆపరేషన్ గంగా'లో భాగంగా ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు మరో 9 విమానాలను ప్రభుత్వం పంపుతోంది. ఈ విమానాలు మార్చి 4న హంగేరిలోని బుచారెస్ట్, బుడాఫెస్ట్, ర్జేసో విమానాశ్రయాలకు చేరుకోనున్నాయి. ఈ 9 విమానాల్లో 18 వందల మంది విద్యార్థులను తరలించనున్నట్టు తెలుస్తోంది.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత బుధవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశం తరువాత భారత వాయుసేన రంగంలోకి దిగింది. రెండు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు హంగేరి, రొమేనియా నుంచి భారతీయులను తీసుకుని భారత్ చేరుకున్నాయి. మరో మూడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు పోలాండ్, హంగేరి, రొమేనియా నుంచి విద్యార్థులను తరలించనున్నాయి.
రొమానియా ప్రధానితో భేటీ
పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా.. రొమేనియా ప్రధానితో సమావేశమయ్యారు. రొమానియాలోని భారత విద్యార్థులను త్వరలో స్వదేశానికి చేరేలా సహకరించాలని కోరారు. ఇందుకు రొమేనియా ప్రధాని సానుకూలంగా స్పందించారు.
Also Read: Russia Ukraine War: ఐరాసలో రష్యా వ్యతిరేక ఓటింగ్‌కు మరోసారి భారత్ దూరం- ఇదే కారణం