అన్వేషించండి

విద్యార్థుల ఖాతాల్లోకి పొరపాటున రూ.3 కోట్లు, రికవర్ చేయాలని ఆదేశాలు - తలలు పట్టుకుంటున్న టీచర్‌లు

Punjab Students: పంజాబ్ ప్రభుత్వం పొరపాటున విద్యార్థుల అకౌంట్‌లలో రూ.3 కోట్లు జమ చేసింది.

Punjab Students: 

విద్యార్థులకు రూ.3 కోట్లు..

పంజాబ్ ప్రభుత్వం చేసిన ఓ చిన్న పొరపాటు తలనొప్పి తెచ్చి పెట్టింది. అనుకోకుండా విద్యార్థుల ఖాతాల్లోకి రూ.3 కోట్ల స్కాలర్‌షిప్ అమౌంట్ క్రెడిట్ అయింది. దాదాపు 24 వేల మంది అకౌంట్‌లలో ఆ డబ్బులు జమ అయ్యాయి. వెంటనే పొరపాటుని గుర్తించిన ప్రభుత్వం ఏం చేయాలో అర్థం కాక సతమతమైంది. చివరకు ఆ డబ్బులను రికవర్ చేసే బాధ్యతని టీచర్లకే అప్పగించింది. ఇప్పుడు టీచర్‌లంతా ఆ డబ్బుని వెనక్కి తీసుకొచ్చేందుకు నానా తంటాలు పడుతున్నారు. 2022-23 అకాడమిక్ సెషన్‌కి స్కాలర్‌షిప్ మనీ ఇవ్వాల్సి ఉంది. అయితే..పంజాబ్ విద్యాశాఖ ఇవ్వాల్సిన దాని కన్నా అదనంగా రూ.3 కోట్లు పొరపాటున జమ చేసింది. అందుకే అన్ని స్కూల్స్‌కీ ఓ నోటీసు పంపింది. నిజానికి ఒక్కో విద్యార్థికి రూ.1,400 చొప్పున స్కాలర్‌షిప్ ఇవ్వాలి. కానీ...పొరపాటున 23,001 మంది విద్యార్థుల అకౌంట్‌లకు రూ.2,800 మిగతా 674 మంది విద్యార్థుల అకౌంట్‌లలో రూ.4,200 జమ అయ్యాయి. అయితే..టెక్నికల్ గ్లిచ్ కారణంగానే ఇలా జరిగిందని వివరణ ఇచ్చింది విద్యాశాఖ. స్కూల్‌ హెడ్స్‌తో పాటు DEOలు ఈ డబ్బులను ఎలాగోలా రికవర్ చేయాలని ఆదేశించింది. అక్టోబర్ 20వ తేదీలోగా ఈ పని పూర్తి చేయాలని తేల్చి చెప్పింది. కానీ...ఈ డబ్బుని రికవర్ చేయడం అంత సులువైన పని కాదని అంటున్నారు ఉపాధ్యాయులు. 

టెక్నికల్ గ్లిచ్ సాకు..

9,10వ తరగతి విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్ ఇస్తోంది ప్రభుత్వం. అయితే..వీరిలో చాలా మంది మెట్రిక్యులేషన్ పాస్ అయ్యి వేరే స్కూళ్లలో జాయిన్ అయిపోయారు. అలాంటి విద్యార్థుల నుంచి మనీ రికవర్ చేయడమే అసలు సమస్య. టెక్నికల్ గ్లిచ్ అని చెప్పి తమ తప్పుని కప్పిపుచ్చుకుంటున్నారన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. విద్యాశాఖ చేసిన తప్పుకి టీచర్‌లు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అంతే కాదు. రికవర్ చేయకపోతే టీచర్‌లకు పెనాల్టీలు కూడా విధిస్తారట. అయినా తప్పని పరిస్థితుల్లో ఉపాధ్యాయులంతా డబ్బుని రికవరీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. వెంటనే ఈ పని మొదలు పెట్టినా వాళ్లు చెప్పిన తేదీ నాటికి అంత డబ్బు రికవరీ చేయడం కష్టమే అంటున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Kawasaki Ninja ZX 4RR: మార్కెట్లోకి కొత్త నింజా బైక్ - రేటు చూస్తే మాత్రం షాకే!
మార్కెట్లోకి కొత్త నింజా బైక్ - రేటు చూస్తే మాత్రం షాకే!
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
Mulugu News: 'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Embed widget