Ram Mandir Ayodhya: చకచకా అయోధ్య రామమందిర నిర్మాణం- గర్భగుడి పనులకు యోగి శంకుస్థాపన
Ram Mandir Ayodhya: అయోధ్య రామ మందిరంలోని గర్భగుడి నిర్మాణ పనులకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ శంకుస్థాపన చేశారు.
Ram Mandir Ayodhya: అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఆలయ గర్భగుడి నిర్మాణానికి సంబంధించిన పనులకు ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ బుధవారం శంకుస్థాపన చేశారు. శిలాపూజ కార్యక్రమం అనంతరం గర్భగుడి పనులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా హాజరయ్యారు.
अवधपुरी प्रभु आवत जानी।
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) June 1, 2022
भई सकल सोभा कै खानी।।
उत्तर प्रदेश के मुख्यमंत्री श्री @myogiadityanath जी ने शिला पूजन कर श्री रामजन्मभूमि मंदिर के गर्भगृह के निर्माण कार्य का शुभारंभ किया।
इस अवसर पर श्री राम जन्मभूमि न्यास के पदाधिकारी, पूजनीय संत और प्रशासनिक अधिकारी उपस्थित थे। pic.twitter.com/gY2VewJlze
ఆ లోపు పూర్తి
ఈ కార్యక్రమంలో 11 మంది అర్చకులు పూజలు జరిపారు. రామమందిర నిర్మాణ పనులకు సంబంధించిన పుస్తకాన్ని కూడా ఆదిత్యనాథ్ విడుదల చేశారు. అంతకుముందు రామమందిర నిర్మాణం చేపట్టిన ఇంజినీర్లను సీఎం సత్కరించారు.
2023 డిసెంబర్లోగా ఆలయ గర్భగుడి పనులు పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. 2024లోగా ఆలయ నిర్మాణం, 2025లోగా ఆలయ సముదాయంలోని ఇతర నిర్మాణాలు పూర్తవుతాయని రామమందిరం నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా అన్నారు.
ప్రత్యేకతలు
- 2.7 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన ఆలయాన్ని నిర్మిస్తున్నారు.
- మందిరం పొడవు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులు ఉంటుంది.
- మూడు అంతస్తులతో నిర్మించనున్న ఈ మందిరం ఎత్తు 161 అడుగులు ఉంటుంది.
- రెండున్నర అడుగుల పొడవు ఉన్న 17 వేల రాళ్లను మందిరం నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు.
- రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలోని బన్సీ పహార్‌పూర్‌లోని ఇసుకరాళ్లను ఆలయ ప్రధాన నిర్మాణం కోసం ఉపయోగించనున్నారు.
అయోధ్యలో రామాలయం నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ 2019లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 2020 ఆగస్టు 5న అయోధ్య రామ మందిర నిర్మాణం లాంఛనంగా ప్రారంభమైంది.
Also Read: ED Summons Sonia Gandhi: సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఈడీ షాక్- ఆ కేసులో సమన్లు జారీ
Also Read: Tamil Nadu: ఒకేరోజు 5,200 మంది ఉద్యోగులు రిటైర్- ఆ రాష్ట్రంలో భారీగా ఖాళీలు!