అన్వేషించండి

Cryptocurrency as Property: క్రిప్టోకరెన్సీని ఆస్తిగా ప్రకటించిన మద్రాస్ హైకోర్టు.. డిజిటల్ కరెన్సీలో కొత్త అధ్యాయం

Cryptocurrency means property: వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో క్రిప్టో కరెన్సీలో హక్కులు, రక్షణ, జవాబుదారీతనాన్ని తీసుకురావాలని భారత కోర్టులు భావిస్తున్నాయి.

చెన్నై: క్రిప్టో కరెన్సీపై మద్రాస్ హైకోర్టు (Madras High Court ) కీలక తీర్పు వెలువరించింది. క్రిప్టోకరెన్సీ భారత చట్టం ప్రకారం ఆస్తిగా భావించాల్సి ఉంటుందని, అది కేవలం డిజిటల్ కరెన్సీ మాత్రమే కాదని కోర్టు స్పష్ట చేసింది. ఆ తీర్పు డిజిటల్ ఆస్తులను  యాజమాన్యం, రక్షణతో పాటు చట్టపరమైన అంశాల్లోకి తెచ్చే దిశగా తీసుకెళ్లనుంది. XRP వంటి క్రిప్టోకరెన్సీలు భౌతిక ఆస్తులు లేదా చట్టబద్ధమైన టెండర్ కానప్పటికీ, అవి ఆస్తికి సంబంధించిన అన్ని ప్రధాన లక్షణాలను ప్రదర్శిస్తాయని జస్టిస్ ఎన్ ఆనంద్ వెంకటేష్ శనివారం తీర్పిచ్చారు. కాగా, మన దేశంలో క్రిప్టో కరెన్సీని ప్రభుత్వాలు అధికారికంగా గుర్తించలేదు. దానికి ఎటువంటి రక్షణ లేదని తెలిసిందే.

క్రిప్టో కరెన్సీ స్వాధీనం చేసుకోగల ఆస్తి..

“క్రిప్టో కరెన్సీ ఒక స్పష్టమైన ఆస్తి కాదు లేదా కరెన్సీ కాదు. కానీ ఇది ఆనందించగల, స్వాధీనం చేసుకోగల ఆస్తి. దీనిపై నమ్మకం ఉంచగల సామర్థ్యం ఉన్న ఆస్తి అని’ జడ్జి పేర్కొన్నారు. జూలై 2024లో క్రిప్టో ఎక్స్ఛేంజ్ WazirXపై జరిగిన సైబర్ దాడి తర్వాత మహిళకు చెందిన  ₹1.98 లక్షల విలువైన 3,532.30 XRP టోకెన్‌లు ఫ్రీజ్ అయ్యాయి. ఈ కేసు పిటిషన్ పై విచారణలో భాగంగా పెట్టుబడిదారు పిటిషన్‌కు ప్రతిస్పందనగా ఈ తీర్పు వచ్చింది. Ethereum, ERC-20 టోకెన్‌లను లక్ష్యంగా చేసుకున్న ఈ హ్యాకింగ్, సైబర్ దాడి 230 మిలియన్ల డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు ₹1,900) నష్టాన్ని కలిగించిందని, అన్ని ప్లాట్‌ఫారమ్ లలో అకౌంట్స్ ఫ్రీజ్ చేశారు.

తన కాయిన్స్ తిరిగి ఇప్పించాలని కోర్టులో పిటిషన్

తన XRP హోల్డింగ్‌లు చోరీఅయిన టోకెన్‌లకు భిన్నంగా ఉన్నాయని ఆమె తెలిపారు. ఆర్బిట్రేషన్, కన్సిలియేషన్ చట్టం 1996లోని సెక్షన్ 9 కింద వాటిని రక్షించాలని మహిళా పిటిషనర్ వాదించారు. జన్మై ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించే వాజిర్‌ఎక్స్ తన నిధులను మళ్లీ డస్ట్రిబ్యూట్ చేయకుండా నిరోధించడానికి చట్టపరమైన రక్షణ కోరింది. అయితే జన్మై ల్యాబ్స్ దాని మాతృసంస్థ జెట్టై ప్రైవేట్ లిమిటెడ్ సింగపూర్ కోర్టు ఆదేశించిన పునర్నిర్మాణ ప్రక్రియను ఉటంకించింది. ఈ తీర్పులో వినియోగదారులందరూ సమిష్టిగా నష్టాలను భరించాలని కంపెనీ తెలిపింది. కానీ జస్టిస్ వెంకటేష్ ఆ వాదనను తిరస్కరించారు.  పెట్టుబడిదారుడి ఆస్తులు ఉల్లంఘనలో భాగం కాదని పేర్కొన్నారు. సైబర్ దాడికి గురైనవి ERC 20 కాయిన్స్, ఇవి దరఖాస్తుదారుడి వద్ద లేని క్రిప్టో కరెన్సీలు అని జడ్జి స్పష్టం చేశారు.

క్రిప్టోకరెన్సీని ఆస్తిగా భావించాలన్న మద్రాస్ హైకోర్టు

PASL విండ్ సొల్యూషన్స్ వర్సెస్ GE పవర్ కన్వర్షన్ ఇండియా (2021)లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ న్యాయస్థానం అభ్యంతరాలను కూడా తోసిపుచ్చింది. ఇది భారత కోర్టులు దేశంలోని ఆస్తులను రక్షించడానికి అనుమతి ఇస్తుంది. పెట్టుబడిదారుడి లావాదేవీలు చెన్నైలో ప్రారంభమై, భారత బ్యాంకుకు సంబంధించినవి కనుక.. ఈ కేసు మద్రాస్ హైకోర్టు పరిధిలోకి వచ్చింది.

జస్టిస్ వెంకటేష్ ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 2(47A)ని ప్రస్తావించారు. క్రిప్టోకరెన్సీలను వర్చువల్ డిజిటల్ ఆస్తులుగా పేర్కొంటూ వాటికి  చట్టపరమైన గుర్తింపు అసరమని పేర్కొన్నారు.  బలోపేతం చేస్తుంది. స్వతంత్ర ఆడిట్‌లు, క్లయింట్ ఫండ్ విభజన, KYC/AML సమ్మతితో సహా Web3 ప్లాట్‌ఫారమ్‌ల కోసం కఠినమైన నియమాలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. 

క్రిప్టోను చట్టబద్ధంగా ఆస్తిగా గుర్తించడం ద్వారా ఇది డిజిటల్ కరెన్సీ లేదా కేవలం కోడ్ కాదు. న్యాయపరంగా పెట్టుబడిదారుల హక్కులు అమలు చేయడానికి వీలవుతుంది. క్రిప్టో హోల్డింగ్‌లు ఇతర విలువైన ఆస్తుల తరహాలోనే రక్షణ పొందుతాయని తీర్పు స్పష్టం చేసింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nidhhi Agerwal : హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
Sivaji Reaction : ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
Pawan Kalyan In Ippatam: ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
Hyderabad Crime News: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగురి అరెస్ట్
బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Advertisement

వీడియోలు

ప్రపంచ రికార్డ్ సృష్టించిన షెఫాలీ వర్మ
టీమిండియా సూపర్ విక్టరీ.. ఐసీసీ ర్యాంకులో దూసుకెళ్లిన దీప్తి
15 ఏళ్ల తర్వాత రోహిత్, కోహ్లీ.. ఫస్ట్ టైం స్టార్లతో నిండిన విజయ్ హజాారే ట్రోఫీ
టీమిండియా ప్లేయర్ల కెరీర్ ని సెలెక్టర్లు నాశనం చేస్తున్నారు: మహమ్మద్ కైఫ్
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nidhhi Agerwal : హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
Sivaji Reaction : ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
Pawan Kalyan In Ippatam: ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
Hyderabad Crime News: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగురి అరెస్ట్
బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Rohit Sharma: విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
The Paradise Movie : నాని 'ది ప్యారడైజ్'లో హీరోయిన్ ఫిక్స్? - కన్ఫర్మ్ చేసేసిన బ్యూటీ!
నాని 'ది ప్యారడైజ్'లో హీరోయిన్ ఫిక్స్? - కన్ఫర్మ్ చేసేసిన బ్యూటీ!
Vaibhav Suryavanshi: 36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
H1B visa: హెచ్-1బీ వీసాలకు లాటరీ విధానం ఎత్తివేత - భారతీయులపై ఎంత ప్రభావం పడుతుందో తెలుసా?
హెచ్-1బీ వీసాలకు లాటరీ విధానం ఎత్తివేత - భారతీయులపై ఎంత ప్రభావం పడుతుందో తెలుసా?
Embed widget