India vs Bangladesh | Women's World cup | బంగ్లాతో తలపడనున్న భారత్
మహిళల వన్డే వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా సెమీస్ బెర్తును దక్కించుకుంది. లీగ్ మ్యాచ్ లో వరుస అపజయాలతో తడబడినా కూడా న్యూజీలాండ్ తో జరిగిన మ్యాచ్ లో పర్వాలేదనిపించారు. ఇప్పుడు బంగ్లాదేశ్‌తో తలపడనుంది టీమిండియా. న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన హర్మన్‌ప్రీత్ సేన అదే తరహాలో బంగ్లాను ఓడించాలని అనుకుంటోంది. సెమీస్‌లో ఆస్ట్రేలియాను ఓడించాలంటే అన్ని విభాగాల్లో రాణించాల్సి ఉంటుంది. అందుకే.. బంగ్లాతో జరిగే మ్యాచ్ చాలా ముఖ్యం.
ముంబైలో ఈ మ్యాచ్ జరగబోతుంది. కానీ, ముంబైలో వర్షం పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే ఈ టోర్నమెంట్ లోని ఎన్నో మ్యాచులు వర్షం కారణంగా ఆగిపొయ్యాయి. ఒకవేళ వర్షం పడితే మ్యాచ్ సాగుతుందా? లేదంటే డక్‌వర్త్ లూయిస్ ప్రకారం కొన్ని ఓవర్లు ఆడతారా ? అనేది తెలియాల్సి ఉంది.
బంగ్లాదేశ్‌పై వన్డేల్లో టీమిండియాకు మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకూ ఆడిన 8 మ్యాచుల్లో భారత్ 6 మ్యాచులను గెలిచింది. ఒకటి టైగా ముగిసింది. ఈ టోర్నమెంట్ లో బంగ్లా బ్యాటింగ్‌లో పరంగా విఫలమవుతుడడంతో వారిని ఓడించడం పెద్ద కష్టమేమీ కాదని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.





















