Rohit Sharma Records | India vs Australia ODI Series | రికార్డుల మోత మోగించిన రోహిత్
ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడవ వన్డే మ్యాచ్ లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ విమర్శలకు చెక్ పెడుతూ చెలరేగిపొయ్యారు. ముఖ్యంగా రోహిత్ శర్మ తనదైన శైలిలో సిక్స్‌లు కొడుతూ, ఫోర్లు కొడుతూ సత్తాచాటాడు. సెంచరీతో ఎన్నో రికార్డులను కూడా బ్రేక్ చేసాడు.
ఈ మ్యాచ్ తో ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఫారిన్ బ్యాటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ ఆరు సెంచరీలు నమోదు చేసాడు. ఆస్ట్రేలియా గడ్డపై వన్డేల్లో రెండుసార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్న తొలి భారత క్రికెటర్‌గానూ నిలిచాడు. అంతేకాకుండా యంన్గెస్ట్ ఏజ్ లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్న భారత ప్లేయర్‌గానూ రోహిత్ శర్మ నిలిచాడు. ఇక అన్ని ఫార్మాట్‌లలో కలిపి ఆస్ట్రేలియాలో రోహిత్ శర్మకు ఇది 9వ సెంచరీ. ఈ సెంచరీతో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ ని సమం చేశాడు.
మరోవైపు ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 50 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. ఆస్ట్రేలియాపై వన్డేల్లో అత్యధిక వన్డే సెంచరీలు చేసిన భారత ఆటగాళ్లలో రోహిత్ శర్మ సచిన్‌ను సమం చేశాడు. టెస్ట్, వన్డే, టీ20లలో ఐదు లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్ రికార్డు సైతం రోహిత్ పేరిటే ఉంది.





















