Maruti E-Vitara Price: అత్యంత అధునాతన EV ని తీసుకురానున్న మారుతి! e-Vitara ఎప్పుడు ఎస్తుంది.. ధర ఎంత?
Maruti e-Vitara Features | మారుతి ఈ విటారా ప్రత్యేక ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించారు. ఇది మొదట ఎలక్ట్రిక్ కారుగా రూపొందించినా, పెట్రోల్ నుండి మార్చలేదు.

మారుతి సుజుకి మొదటి ఎలక్ట్రిక్ కారు ఈ-విటారా కోసం ఎదురుచూపులు త్వరలో ఫలించనున్నాయి.మారుతీ కంపెనీ చాలా కాలం తర్వాత తన మొదటి ఎలక్ట్రిక్ కారును విడుదల చేయనుంది. ఈ మోడల్‌ను కంపెనీ మొదటిసారిగా భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ప్రదర్శించింది. దీనిని డిసెంబర్ 2025లో విడుదల చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. కంపెనీ ఈ కారును ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫారమ్‌పై తయారు చేసింది. ఇది మొదట ఎలక్ట్రిక్ కారుగా రూపొందించారు. పెట్రోల్ మోడల్ అయితే ఎలక్ట్రికుక్ మార్చడం జరగదు.
మారుతి ఈ-విటారా ఎలా ఉంది?
మారుతి e-Vitara ఆకారం సమతుల్యమైన, ఆచరణాత్మకమైన SUV గా చేస్తుంది. ఈ విటారా పొడవు 4275 mm, వెడల్పు 1800 mm, వీల్‌బేస్ 2700 mm ఉంది. కారు డిజైన్ ట్రెడీషనల్ మారుతి SUV ఆధునిక, ఫ్యూచరిస్టిక్ డిజైన్ లో ఉంటుంది. గుజరాత్‌లోని హన్సల్‌పూర్ ప్లాంట్‌లో ఈ కారు ఉత్పత్తి ప్రారంభమైంది. ఇక్కడి నుంచి మారుతి అనేక గ్లోబల్ మోడళ్లను ఎగుమతి చేస్తుంది. మారుతి కంపెనీ e-Vitara కోసం పెద్ద ఉత్పత్తి టార్గెట్ నిర్దేశించుకుంది. ఈ కారు 100 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేయనున్నారు.
కారు బ్యాటరీ, రేంజ్
మారుతి e-Vitara భారత్2లో రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో వస్తుంది. 49kWh, 61kWh తో మార్కెట్లోకి వస్తుంది. టాప్ వేరియంట్ దాదాపు 500 కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉంటుంది. కారు ఎక్కువ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ SUV లలో ఒకటిగా మారుతుంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. దాంతో బ్యాటరీని తక్కువ సమయంలో 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. e-Vitara సిటీ, హైవే జర్నీ రెండింటికీ అద్భుతమైన పనితీరును ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
మారుతి e-Vitara ఇప్పటివరకు మోడ్రన్ ఫీచర్లతో కూడిన SUV అని చెప్పవచ్చు. ఇందులో అనేక అధునాతన ఫీచర్లు ఉంటాయి. అవి 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS లెవెల్ 2 డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్ (ఆటోమేటిక్ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ ఉన్నాయి). వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. దీనితో పాటు కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, వాయిస్ కమాండ్ సపోర్ట్ ఉంటుంది.
మారుతి ఈ విటారా కారు ధర ఎంత?
మారుతి సుజుకి e-Vitara కంపెనీలో ఇప్పటివరకు అత్యంత ఖరీదైన కారు అవుతుంది. SUV Grand Vitara, Victoris కంటే పైన ఉంటుంది. దీని ధర ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కారు ప్రారంభ ధర 25 లక్షల నుండి 30 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుందని భావిస్తున్నారు. ఈ ధర వద్ద e-Vitara కారు Hyundai Creta EV, టాటా కర్వ్ ఈవీ (Tata Curvv EV), మహీంద్రా (Mahindra XUV400 Pro), MG ZS EV వంటి ప్రీమియం ఎలక్ట్రిక్ SUVs తో ఉంటుంది.






















