అన్వేషించండి

Operation Sindoorను ప్రత్యక్షంగా పర్యవేక్షించిన ప్రధాని మోదీ, పక్కా ప్లానింగ్‌తో పహల్గాం దాడికి ప్రతీకారం

PM Modi monitors Operation Sindoor భారత ప్రధాని నరేంద్ర మోదీ రాత్రంతా మెలకువగా ఉండి సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ఆపరేషన్‌ను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ప్లాన్ చేసి మరీ భారత్ దెబ్బకొట్టింది.

Indias Operation Sindoor | న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం మొదలుపెట్టింది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ ప్రతీకాదర దాడులతో పాకిస్తాన్ ఉగ్రవాదులకు నిద్రలేకుండా చేసి కాళరాత్రిని మిగిలిచ్చింది భారత సైన్యం. పీఓకేలోని మొత్తం 9 ఉగ్ర స్థావరాలు లక్ష్యంగా చేసిన దాడి ఆపరేషన్ సిందూర్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. భారత బలగాలు ఉగ్రవాద స్థావరాలను విధ్వంసం చేయడాన్ని ప్రధాని మోదీ రాత్రంతా నిరంతరం పర్యవేక్షించారని కొందరు అధికారులు ఏఎన్ఐకి తెలిపారు. 

ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు

పహల్గాం ఉగ్రదాడికి భారత్ ఏం చేస్తుంది అనే దానికి మంగళవారం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమాధానంగా మారింది. భారత బలగాలు పాకిస్తాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు లక్ష్యంగా చేసిన దాడులు విజయవంతమయ్యాయని భారత వర్గాలు వెల్లడించాయి. భారతదేశంలో ఉగ్రదాడులకు ప్లాన్ చేసిన జైషే ఈ ముహమ్మద్, లష్కరే తోయిబా అగ్ర నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ దాడులు చేశాయి. భారత ప్రధాని మోదీ ప్రత్యక్షంగా ఆపరేషన్ సిందూర్‌ను పర్యవేక్షించారు. అంటే ఉగ్రదాడులను సహించేది లేదని, పహల్గాం దాడికి అంతకు మించి ప్రతీకారం తీర్చుకుంటామని మన ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పారు.

పాక్ సైనిక స్థావరాల జోలికి వెళ్లలేదు..
మేం కేవలం ఉగ్రవాదంపై, ఉగ్రవాదులపై దాడులు చేయాలని నిర్ణయించాం. ఈ మేరకు భారత సైన్యం పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ సిందూర్ కు శ్రీకారం చుట్టినట్లు రక్షణ శాఖ వెల్లడించింది. భారత సైన్యం బుధవారం తెల్లవారుజామున ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టింది.  పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత  కాశ్మీర్‌ ((PoK)లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. భారత్‌పై ఎక్కడి నుంచి ఉగ్రదాడులకు ప్లాన్ చేశారో.. అదే స్థావరాలపై సైన్యం దాడి చేసిందని రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన తెలిపింది.

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 25 మంది భారతీయులు, నేపాల్ కు చెందిన ఒకరు ప్రాణాలు కోల్పోయారు. అందుకే పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం ఈ చర్యలు చేపట్టిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. బాధ్యులను జవాబుదారీగా ఉంచాలని, వారికి భారత బలగాలు సత్తా చూపించామన్నారు.

పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (PoJK) లోని 9 ఉగ్రవాద స్థావరాలపై పక్కా సమాచారంతో, ప్లాన్ చేసి భారత సైన్యం, నావికాదళం, ఎయిర్ ఫోర్స్ ఈ దాడుల్లో పాల్గొన్నాయి. భారత్‌లో ఉగ్రదాడులకు కారణమైన జైషే మహ్మద్, లష్కరే తోయిబా లాంటి ఉగ్రసంస్థలను నామరూపం లేకుండా చేయాని వారి స్థావరాలపై భారత్ బుధవారం తెల్లవారుజాము వరకు మెరుపు దాడులు చేసింది.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: జీడిమెట్ల ఆర్టీసీ డిపోలో ఘోర ప్రమాదం!మెకానిక్ దుర్మరణం!
జీడిమెట్ల ఆర్టీసీ డిపోలో ఘోర ప్రమాదం!మెకానిక్ దుర్మరణం!
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Fact Check: చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
Fact Check: చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
Embed widget