UK PM Boris Johnson India Visit: బ్రిటన్ ప్రధానితో హైదరాబాద్ హౌస్‌లో మోదీ భేటీ- ఉక్రెయిన్, స్వేచ్ఛా వాణిజ్యంపై చర్చ
UK PM Boris Johnson India Visit: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చర్చలు జరిపారు. స్వేచ్ఛా వాణిజ్యం సహా పలు కీలక విషయాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది.
UK PM Boris Johnson India Visit: రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్ వచ్చిన యూకే ప్రధాని బోరిస్ జాన్సన్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌కు బోరిస్‌ను సాదరంగా మోదీ ఆహ్వానించారు.
ద్వైపాక్షిక భేటీ
#WATCH | Delegation-level talks between PM Modi and British PM Boris Johnson are underway at Hyderabad House in Delhi pic.twitter.com/UyM3SqsV0A
— ANI (@ANI) April 22, 2022
ప్రధాని మోదీ, బ్రిటన్ ప్రధాని బోరీస్ జాన్సన్ ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. ఉదయం 11:30 గంటలకు హైదరాబాద్ హౌస్‌లో ఇద్దరూ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలతోపాటు ఉక్రెయిన్ తదితర అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చించినట్లు సమాచారం.
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, ఇండో-పసిఫిక్ ప్రాంతం, ఉగ్రవాదానికి సంబంధించిన అంశాలు సహా భారత్‌లో పెట్టుబడులు, బ్రిటన్‌లోని భారతీయులకు వీసాల సడలింపు వంటి అంశాలపై ప్రధానంగా భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది.
భారత్‌లో ఆర్ధిక నేరాలకు పాల్పడి పారిపోయిన నీరవ్ మోదీ, విజయ్ మాల్యా వంటి వారిని అప్పగించడంపై కూడా చర్చ జరిగిందని సమాచారం.
#WATCH Prime Minister Narendra Modi and British PM Boris Johnson hold talks at Delhi's Hyderabad House
— ANI (@ANI) April 22, 2022
(Source: DD) pic.twitter.com/AlMBrLLB1f
విదేశాంగ మంత్రితో
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా సమావేశమయ్యారు. అంతకుముందు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాష్ట్రపతి భవన్‌లో గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా తనకు అద్భుత స్వాగతం పలికినందుకు మోదీకి బ్రిటన్ ప్రధాని ధన్యవాదాలు తెలిపారు.
"భారత్- యూకే మధ్య పరిస్థితులు ఇంతకముందు కంటే ఇప్పుడు మరింత బలంగా ఉన్నాయి" అని బోరిస్ జాన్సన్ అన్నారు. ఈ పర్యటనతో ఇరు దేశాల మధ్య బంధం మరింత బలోపేతమైందని బ్రిటన్ ప్రధాని అభిప్రాయపడ్డారు.
Also Read: Covid Tally: దేశంలో పెరుగుతోన్న కరోనా ఉద్ధృతి- కొత్తగా 2451 కేసులు
Also Read: Gujrat Drugs: గుజరాత్‌లో భారీగా డ్రగ్స్ స్వాధీనం! విలువ ఏకంగా రూ.2 వేల కోట్లు