అన్వేషించండి

PM Modi US Visit 2023: ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో అయితే, కానీలు ఉండవు- యూఎస్ కాంగ్రెస్‌లో మోదీ ప్రసంగం

PM Modi US Visit 2023: ఉగ్రవాదానికి సహయం చేస్తున్న శక్తులను అడ్డుకోవాలని యూఎస్ కాంగ్రెస్‌ వేదికగా ప్రపంచానికి సందేశం ఇచ్చారు మోదీ.

PM Modi US Visit 2023: గ్రరాజ్యం అమెరికాలో కాంగ్రెస్ ఉభయసభలను ఉద్దేశించి ప్రధానమంత్రి మోదీ చేసిన ప్రసంగం అందర్నీ మంత్రముగ్దులను చేసింది. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలు ప్రస్తావిస్తూనే వాటికి పరిష్కారాలను కూడా చెప్పారు మోదీ. అదే టైంలో అమెరికా, భారత్ మధ్య ఉన్న బంధాన్ని  ప్రస్తావించారు. ఈ జోడీ ప్రపంచానికి ఎలా సహాయపడగలదో వివరించారు. 

అమెరికా కాంగ్రెస్‌లో ఉభయ సభలను ఉద్దేశించి మోదీ చేసిన ప్రసంగం సుమారు గంటపాటు సాగింది. 2016లో చేసిన ప్రసంగం కంటే ఇది చాలా ఎక్కువ. అప్పట్లో  45 నిమిషాలు మాత్రమే మాట్లాడారు మోదీ. ప్రపంచం ఎదుర్కొంటున్న చాలా అంశాలను తన స్పీచ్‌లో ప్రధాని ప్రస్తావించారు.  చాలా సార్లు మోదీ ప్రసంగానికి అమెరికా ఉపాధ్యక్షురాలు కమల్ హారిస్‌ సహా కాంగ్రెస్ సభ్యులు లేచి నిలబడి చప్పట్లతో ప్రశంసించారు.  

ప్రపంచవ్యాప్తమైన ఇండియన్ అమెరికన్ సంస్కృతి
సమానత్వ స్ఫూర్తితోనే అమెరికా పునాదులు ఏర్పడ్డాయని చరిత్ర చూస్తే అర్థమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరిని దగ్గరికి చేరుకున్నారు. అమెరికా డ్రీమ్స్‌లో వారిని భాగస్వాములను చేశారు. భారత్‌ సంతతి లక్షల మంది ఇక్కడ నివశిస్తున్నారు. వారిలో కొందరు ఈ ఛాంబర్‌లో గర్వంగా కూర్చోగలిగారు. నా వెనుక చరిత్ర సృష్టించిన వ్యక్తి ఉన్నారు. అని మోదీ అభిప్రాయపడ్డారు. 
సమోసా కాకస్ ఇప్పుడు చాలా మందికి ఇష్టమైన వంటకంగా మారిందని నాకు తెలిసింది. భారతీయ వంటకాల వైవిధ్యం కూడా విస్తరిస్తోందని ఆశిస్తున్నాను. అని మోదీ అన్నారు. 

"ఒత్తిడి అధిగమించడానికి , విధానాల రూకల్పనకు చేయాల్సిన సంఘర్షణ నాకు తెలుసు. ఐడియాలు, ఐడియాలజీలపై చర్చలను నేను అర్థం చేసుకోగలను. కానీ ప్రపంచంలోని రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాలైన భారత్‌, అమెరికా మధ్య బంధాన్ని బలోపేతం చేసేందుకు మీరంతా కలిసి రావడం సంతోషంగా ఉంది. దేశంలో విధానాల రూపకల్పన చేసేటప్పుడు కచ్చితంగా డిస్కషన్స్ ఉండాలి. కానీ దేశం కోసం మాట్లాడేటప్పుడు ఒక్కటిగా కలిసి రావాలి అని మోదీ అన్నారు. 

ఉగ్రవాదమే శత్రువు

యావత్ మానవాళికి ప్రమాదకరంగా మారిన ఉగ్రవాదాన్ని తుదముట్టించడంలో అయితే, కానీ అనే పదాలకు తావులేదన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. యూఎస్ కాంగ్రెస్‌లో మాట్లాడిన మోదీ.. ఇపరోక్షంగా పాకిస్తాన్‌ను టార్గెట్ చేశారు. అమెరికా కాంగ్రెస్ ఉభయ సభలను ఉద్దేశించి గురువారం ప్రసంగించిన ప్రధాని మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 9/11 ఘటన జరిగి రెండు దశాబ్ధాలు అయింది. ముంబైయిలో 26/11 దుర్ఘటన జరిగి పదేళ్లు దాటింది. ఇప్పటికి కూడా ఉగ్రవాదం యావత్ ప్రపంచానికి ప్రమాదకరంగానే ఉంది అని మోదీ అన్నారు. 

ఇదే భావజాలంతో చాలా సంస్థలు, చాలా వేదికలు ఉండవచ్చు. కానీ అందరి ఉద్దేశం మాత్రం ఒక్కటే. ఉగ్రవాదం మానవాళికి ప్రథమ శత్రువు. దీనిపై పోరాటం చేయడంలో అయితే, కానీ పదాలకు చోటు లేదు- ప్రధానమంత్రి మోదీ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న, వారికి సహాయపడుతున్న శక్తులపై ఒత్తిడి తీసుకురావాలి అని అన్నారు. ఈ కామెంట్స్ చేస్తున్న టైంలో ఛాంబర్స్‌లో కూర్చొని ఉన్న భారతీయులు మోదీ మోదీ అంటూ గట్టిగా నినాదాలు చేశారు. 

దేశాలన్నీ ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాల పట్ల గౌరవం, వివాదాలను శాంతియుతంగా పరిష్కరించడం, సార్వభౌమాధికారాన్ని గౌరవించడంపై ప్రపంచ క్రమం ఆధారపడి ఉందని అన్నారు మోదీ. ఈ కామెంట్‌ చైనాను పరోక్షంగా టార్గెట్ చేశారు. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget