PM Modi Japan visit: జపాన్‌లో మోదీ సుడిగాలి పర్యటన- 40 గంటల్లో 23 సమావేశాలు
PM Modi Japan visit: ఈ నెల 24న ప్రధాని నరేంద్ర మోదీ క్వాడ్ సదస్సు కోసం జపాన్ వెళ్లనున్నారు.
PM Modi Japan visit: ప్రధాని నరేంద్ర మోదీ క్వాడ్ సదస్సు కోసం జపాన్ వెళ్లనున్నారు. ఈ నెెల 24న క్వాడ్ సదస్సు జరగనుంది. దీంట్లో మోదీ పాల్గొంటారు. ఈ సందర్భంగా జపాన్, ఆస్ట్రేలియా ప్రధానులు ఫుమియో కిషిద, స్కాట్ మారిసన్‌లతో మోదీ సమావేశమవుతారు. జపాన్ ప్రధాని కిషిద ఆహ్వానం మేరకు మోదీ టోక్యో వెళ్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
23 భేటీలు
అదే విధంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో మోదీ భేటీ అవుతారు. ఈ పర్యటనలో భాగంగా జపాన్‌లో మోదీ 40 గంటలు గడుపుతారు. ఈ 40 గంటల్లో ఆయన మొత్తం 23 సమావేశాల్లో పాల్గొంటారు. 30 మంది జపాన్ సీఈవోలు, దౌత్యవేత్తలు, జపాన్‌లో భారతీయులతోనూ ఆయన సమావేశమవుతారు.
నేపాల్ పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల జపాన్‌లో పర్యటించారు. భారత్- నేపాల్ స్నేహబంధం బలంగా మారడం మొత్తం మానవాళికే ప్రయోజనకరంగా ఉంటుందని మోదీ అన్నారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో ఇరుదేశాల బంధం చాలా కీలకమని మోదీ అన్నారు. బుద్ధుడి పట్ల ఆరాధాన ఇరుదేశాల ప్రజలను అనుసంధానించి ఒకే కుటుంబంగా మారుస్తోందని పేర్కొన్నారు.
అంతకుముందు మే నెల మొదటి వారంలో ప్రధాని మోదీ మూడు రోజులపాటు యూరప్‌లో పర్యటించారు. దిల్లీ నుంచి బయలుదేరిన ప్రధాని మోదీ తొలుత జర్మనీ చేరుకున్నారు. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో భారత ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. అనంతరం బెర్లిన్‌లో జర్మనీ ఛాన్స్‌లర్ ఒలాఫ్ షాల్జ్‌తో భేటీ అయ్యారు మోదీ. జర్మనీ, ఫ్రాన్స్, డెన్మార్క్‌లో ప్రధాని మోదీ 3 రోజుల టూర్లో భాగంగా పలు కీలక భేటీల్లో పాల్గొన్నారు.
Also Read: COVID 19: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు- 65 మంది మృతి
Also Read: Asafoetida: ఇంగువ మన దేశంలో ఇంతవరకు పండించలేదు, మరెలా మన వంటల్లో భాగమైంది?