(Source: ECI/ABP News/ABP Majha)
COVID 19: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు- 65 మంది మృతి
COVID 19: దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. కొత్తగా 2,226 మందికి వైరస్ సోకింది.
COVID 19: దేశంలో కొత్తగా 2,226 కరోనా కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 14,955గా ఉంది. మరో 65 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజే 2,202 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.75గా ఉంది.
COVID19 | India reports 2,226 fresh cases today; Active caseload at 14,955 pic.twitter.com/ODtD2ZDNk1
— ANI (@ANI) May 22, 2022
మొత్తం కరోనా కేసులు: 43,105,551
మొత్తం మరణాలు: 5,24,413
యాక్టివ్ కేసులు: 14,955
మొత్తం రికవరీలు: 4,25,97,003
వ్యాక్సినేషన్
దేశవ్యాప్తంగా తాజాగా 14,37,381 మందికిపైగా టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,92,28,66,524కు చేరింది. ఒక్కరోజే 4,42,681 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
కీలక నిర్ణయం
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ 19 వ్యాక్సిన్ డోసుల మధ్య కాల వ్యవధిని తగ్గించారు. కరోనా వ్యాక్సిన్ రెండో డోసు, మూడో డోసుకు మధ్య కాల వ్యవధిని 9 నెలల నుంచి 90 రోజులకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కొవిన్ యాప్ (COWIN App)లో మార్పులు చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
బీఎంసీ పరిధిలోని అన్ని ప్రైవేట్ & ప్రభుత్వ టీకా కేంద్రాలకు వ్యాక్సిన్ కోసం ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే అంతర్జాతీయ ప్రయాణం చేయాల్సిన వ్యక్తులకు మాత్రమే కరోనా వ్యాక్సిన్ రెండో, మూడో డోసుల మధ్య తగ్గించిన గ్యాప్ టైమ్ వర్తిస్తుందని బీఎంసీ స్పష్టం చేసింది.
Also Read: PM Modi Japan visit: జపాన్‌లో మోదీ సుడిగాలి పర్యటన- 40 గంటల్లో 23 సమావేశాలు
Also Read: US Formula Milk Shortage : అమెరికాలో ఫార్ములా మిల్క్ కొరత - ఎక్కడ చూసినా నో స్టాక్ !