PM Modi On AI: ఏఐతో జాబ్స్ పోవు, కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి - ఏఐ సమ్మిట్ నిర్వహణకు భారత్ రెడీ: నరేంద్ర మోదీ
PM Modi in Paris Tour | ఏఐతో జాబ్స్ పోతాయని టెన్షన్ వద్దని, ఆవిష్కరణల ద్వారా కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఏఐ సమ్మిట్ నిర్వహణకు భారత్ సిద్ధంగా ఉందన్నారు.

PM Modi at AI Action Summit | పారిస్: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉన్న ఉద్యోగాలు పోవని, కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. ప్రజలే యాప్‌లను రూపొందించేలా టెక్నాలజీ పెరగాలని, అదే సమయంలో డీప్ ఫేక్, సైబర్ మోసాలకు చెక్ పెట్టాలని పిలుపునిచ్చారు. ఫ్రాన్స్‌తో కలిసి పారిస్‌లో మంగళవారం నిర్వహించిన ఐఏ యాక్షన్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. తరువాత AI యాక్షన్ సమ్మిట్‌కు భారతదేశం ఆతిథ్యం ఇస్తుందని మోదీ అన్నారు.
మెరుగైన సమాజం, బెటర్ కంట్రీ కోసం..
ఏఐ కోసం అంతర్జాతీయ ఫ్రేమ్ వర్క్ కావాలి. పాలన అంటే కేవలం ప్రజలకు సంక్షేమం అందించడం, అభివృద్ధి చేయడం మాత్రమే కాదు. సరికొత్త ఆవిష్కరణలతో ముందుకెళ్లాలి. మెరుగైన సమాజం, బెటర్ కంట్రీ కోసం టెక్నాలజీని సరైన విధంగా ఉపయోగించాలి. ఈ సమ్మిట్‌లో భాగంగా తీసుకున్న AI ఫౌండేషన్, కౌన్సిల్ ఫర్ సస్టైనబుల్ AIలను ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. ఇందుకుగానూ నా ఫ్రెండ్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
గ్లోబల్ పార్టనర్‌షిప్ ఫర్ AIని మనం ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేయాలి. టెక్నాలజీలో సమస్యలు, లోపాలను అధిగమించి సరికొత్త ఆవిష్కరణలు రావాల్సిన సమయం ఇది. రాజకీయాలకు అతీతంగా డేటాను వినియోగించాలి. పర్యావరణాన్ని కాపాడటంలో, ప్రభుత్వ పాలనా వ్యవస్థలో సైతం ఏఐ టెక్నాలజీతో అద్భుతాలు చేయడానికి కలిసి పనిచేద్దాం. విద్య, ఆరోగయం, వ్యవసాయం సహా పలు రంగాలలో ఏఐ టెక్నాలజీని జత చేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయి. ఐఏ ఆవిష్కరణల ద్వారా ఉద్యోగాలు పోతాయని ఆందోళన అక్కర్లేదు. దీని ద్వారా కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. ఉద్యోగాలను ఏఐ మాయం చేయదు.
Le Forum des chefs d'entreprise Inde-France joue un rôle clé dans le renforcement des liens économiques et la promotion de l'innovation. Il est réjouissant de voir des chefs d'entreprise des deux pays collaborer et créer de nouvelles opportunités dans des secteurs clés. Cela… pic.twitter.com/mkOrTQTr6z
— Narendra Modi (@narendramodi) February 11, 2025
పారిస్‌లో జరిగిన AI సమ్మిట్ లో భాగంగా 20 ప్రధాన కార్పొరేషన్లు, సంస్థల బృందం రాబోయే 5 ఏళ్లలో యూరోపియన్ AIలో 150 బిలియన్ యూరోలు పెట్టుబడి పెట్టేందుకు ప్లాన్ చేస్తామని తెలిపింది. వెంచర్ క్యాపిటలిస్ట్ సంస్థ జనరల్ క్యాటలిస్ట్ నేతృత్వంలోని 'AI ఛాంపియన్స్' అనే కార్యక్రమం అటు ఇన్వెస్టర్స్, ఇటు స్టార్టప్‌ల మధ్య గ్యాప్ తగ్గించింది.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రభుత్వం ఎంతో మంది దాతలు, పారిశ్రామిక భాగస్వాముల నుండి 400 మిలియన్ల యూరోల పెట్టుబడితో AI ప్రాజెక్టుని ప్రారంభించారు. ఈ AI వెంచర్ డేటాను పారదర్శకంగా వినియోగించడానికి, ఓపెన్ సోర్స్ టూల్స్ లో ఇన్వెస్ట్ చేసి ఫలితాలు రాబడతామని మాక్రాన్ చెప్పారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

