Salaar Re Release Review: 'సలార్' రీ రిలీజ్ రివ్యూ... ఫ్యాన్స్ అరుపులతో థియేటర్లు దద్దరిల్లాయ్, వాళ్ళకు పూనకాలే!
Salaar Re Release Fans Reaction: ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా 'సలార్' రీ రిలీజ్ అయ్యింది. ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో మార్నింగ్ 8 గంటలకు చిత్రాన్ని ప్రదర్శించారు. ఆ హంగామా ఎలా ఉందంటే?

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులకు నచ్చిన యాక్షన్ ఫిల్మ్ 'సలార్' (Salaar Part 1 Ceasefire). ఆయన పుట్టినరోజు (Prabhas Birthday) సందర్భంగా ఇవాళ కొన్ని థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రీ రిలీజ్ రెస్పాన్స్ ఎలా ఉంది? ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య 70 ఎంఎం థియేటర్‌లో అభిమానుల హంగామా ఎలా ఉంది? అనేది తెలుసుకోండి.
గాల్లోకి లేచిన పేపర్లతో స్క్రీన్స్ ఫుల్...
అరుపులతో థియేటర్లలో ఓ రేంజ్ రీ సౌండ్!
ఒక్క ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ మాత్రమే కాదు... 'సలార్' రీ రిలీజ్ చేసిన ప్రతి థియేటర్ / స్క్రీన్‌లో ఒక్కటే రెస్పాన్స్. సినిమా ఫస్ట్ రిలీజ్ టైంలో ఫ్యాన్స్, ఆడియన్స్ హంగామా ఎలా ఉంటుందో? ఇప్పుడీ 'సలార్' రీ రిలీజ్‌కు సైతం అదే విధంగా ఉంది. హీరో ఇంట్రడక్షన్, యాక్షన్ బ్లాక్స్ వచ్చినప్పుడు అభిమానుల ఆనందహేళ, అరుపులతో థియేటర్లు దద్దరిల్లాయ్. గాల్లోకి లేచిన పేపర్లకు 70 ఎంఎం స్క్రీన్ సైతం చిన్నబోయింది.
కాటేరమ్మ కొడుకు ఫైట్‌కు పూనకాలే...
మళ్ళీ మళ్ళీ చూసినా బోర్ కొట్టని యాక్షన్!
'సలార్' అంటే ప్రభాస్ యాక్షన్! ఆయన కటౌట్‌కు తగ్గ యాక్షన్ బ్లాక్స్ డిజైన్ చేశారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ సినిమాను ఇంతకు ముందు ఒకసారి సినిమాను రీ రిలీజ్ చేశారు. మార్చిలో థియేటర్లలో సందడి చేసింది. మళ్ళీ మరోసారి ప్రభాస్ బర్త్ డేకి రీ రిలీజ్ చేశారు. ఓటీటీలోనూ సినిమా అందుబాటులో ఉంది. యూట్యూబ్ ఓపెన్ చేసి 'సలార్' అని సెర్చ్ చేస్తే యాక్షన్ బ్లాక్స్ అన్నీ ఉన్నాయి. అయినా సరే థియేటర్లలో కాటేరమ్మ కొడుకు ఫైట్ గానీ, క్వారీలో యాక్షన్ బ్లాక్ గానీ చూస్తే పూనకాలు రావడం గ్యారెంటీ. ప్రభాస్ ఆరున్నర అడుగుల కటౌట్ స్క్రీన్ నిండుగా నిలువెత్తున నిలబడేలా చేస్తూ ప్రశాంత్ నీల్ చూపించిన దర్శకత్వ ప్రతిభ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే.
Also Read: 'మాస్ జాతర' ఫస్ట్ రివ్యూ... ఆ గంటసేపూ థియేటర్లు ఊగిపోతాయ్ - రవితేజ అభిమానులకు కిక్ ఇచ్చేలా!
'సలార్'కు మెయిన్ ఎట్రాక్షన్ ఆ యాక్షన్ సన్నివేశాలే. అందులో ఆయన చూపిన యాటిట్యూడ్ కూడా. దేవా పాత్రలో సెటిల్డ్ హీరోయిజం చూపించారు. యాక్షన్ సన్నివేశాల్లో ఆయన యాటిట్యూడ్ హీరోయిజాన్ని పీక్స్‌కు తీసుకు వెళ్ళింది. ఈ సినిమాలో ప్రభాస్ స్నేహితుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించగా... శృతి హాసన్ కథానాయికగా, శ్రియా రెడ్డి, జగపతి బాబు, టినూ ఆనంద్, ఝాన్సీ ఇతర కీలక పాత్రల్లో నటించారు.
ఈతరం అమ్మాయిల్లోనూ ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు. థియేటర్లలో అబ్బాయిల కంటే అమ్మాయిలు చేసిన సందడి ఎక్కువ. అరుపుల్లో వాళ్ళవీ ఉన్నాయ్. 'సలార్' రీ రిలీజ్ ఒక్కటే కాదు... అభిమానులకు ఇవాళ 'ఫౌజీ' ఫస్ట్ లుక్ విడుదల చేయడం, 'ది రాజా సాబ్' కొత్త పోస్టర్, 'కల్కి 2898 ఏడీ' నుంచి వచ్చిన స్టిల్ సంతోషాన్ని ఇచ్చాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్', హోంబలే ఫిలిమ్స్ సంస్థలో 'సలార్ 2' కాకుండా మరో రెండు సినిమాలు చేయనున్న సంగతి తెలిసిందే.





















