అన్వేషించండి

PM Modi Government: మోదీ ప్రభుత్వానికి 11 ఏళ్లు పూర్తి.. ఆర్థిక వృద్ధి, గ్లోబల్ లీడర్ సహా ఎన్డీయే పాలనలో ఫోకస్ చేసిన అంశాలివే

PM Narendra Modi Rule : ప్రధాని నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలన పూర్తి చేసుకుని 12వ ఏడాదిలోకి అడుగు పెట్టారు. ఆర్థిక వృద్ధి, డిజిటల్ ఇండియా, వాతావరణ మార్పులపై దృష్టి, అభివృద్ధి భారత్ లక్ష్యంగా పనిచేశారు.

PM Modi News Today | న్యూఢిల్లీ: ఎన్డీయే పాలనకు 11 ఏళ్లు పూర్తయింది. తన పాలనలో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మాత్రమే కాకుండా, వాతావరణ చర్యలు, డిజిటల్ ఆవిష్కరణ వంటి కీలకమైన ప్రపంచ సమస్యలపై ప్రధాన గొంతుకగా కూడా మారిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గత 11 సంవత్సరాలలో రెండు దఫాలు పదవీకాలం పూర్తి కాగా, ఎన్డీఏ ప్రభుత్వం మూడో టర్మ్‌లో మొదటి సంవత్సరం పాలన పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మంచి పాలనతో, పాటు, గ్లోబల్ లీడర్‌షిప్, ఆర్థిక వృద్ధి, పరివర్తనపై స్పెషల్ ఫోకస్ చేశామన్నారు.

ఎన్డీఏ హయాంలో సామాజిక న్యాయం

ప్రస్తుత కేంద్ర మంత్రులలో 60 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, OBC కేటగిరీలకు చెందినవారు ఉన్నారు. కానీ ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ లాంటివి తమ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తున్నాయని చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నాయి. తమ ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని చెప్పడానికి సగానికి పైగా కేంద్ర మంత్రులు వెనుకబడిన వర్గాలకు చెందినవారే కావడం నిదర్శనం. 

ప్రధాని మోదీ తన ఎక్స్ పోస్ట్ లో.. 140 కోట్ల మంది భారతీయుల ఆశీస్సులతో, అందరి భాగస్వామ్యంతో మన దేశం వివిధ రంగాలలో వేగవంతమైన మార్పులకు సాక్ష్యంగా నిలిచింది. 'సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్' అనే సూత్రాలతో నడుస్తున్న NDA ప్రభుత్వం వేగంతో పాటు సున్నితత్వంతో మార్పులు తీసుకువచ్చిందని ప్రధాని మోదీ అన్నారు.

11 ఏళ్ల సేవలు పూర్తి

ఆర్థిక వృద్ధి నుండి సామాజిక అభివృద్ధి వరకు, ప్రజలకు సంబంధించిన అందరినీ కలుపుకొనిపోయేతత్వంతో సమగ్ర అభివృద్ధిపై దృష్టి సారించామని ఆయన అన్నారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ, "మా సమష్టి విజయానికి మేం గర్విస్తున్నాము. అదే సమయంలో, వికసిత్ భారత్ ను నిర్మించడానికి ఆశ, విశ్వాసం, సంకల్పంతో ముందుకు సాగుతున్నాం. "దేశంలోని పలు రంగాలలో తీసుకువచ్చిన మార్పుల వివరాలను వెల్లడిస్తూ, "11 సంవత్సరాల సర్వీస్" అనే హ్యాష్‌ట్యాగ్‌తో పోస్ట్ చేశారు. 

అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు, 'వికాస్‌వాద్‌'ను ప్రధాన స్రవంతిలోకి మోదీ తీసుకువచ్చారు. ఇది రాజకీయ చర్చ, విధాన చర్యలు దీని చుట్టూ తిరుగుతున్నాయని బీజేపీ పేర్కొంది. 2014లో భారత ప్రధానిగా నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి, 'ఇండియా ఫస్ట్' తన ప్రతి విధానానికి మార్గదర్శకంగా ఉందని పేర్కొంది.

ఎన్డీయే హయాంలో దేశంలోని 81 కోట్ల మందికి పైగా ప్రజలు ఉచితంగా ఆహార ధాన్యాలు (రేషన్ బియ్యం) పొందుతున్నారు. 15 కోట్ల ఇళ్లకు పైగా నల్లా నీటి కనెక్షన్లు వచ్చాయి. అర్హులైన నిరు పేదల కోసం 4 కోట్ల ఇళ్లు నిర్మించాం. దేశవ్యాప్తంగా 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మించాం. 68 లక్షల వీధి వ్యాపారులకు రుణాలు ఇచ్చాం. స్మార్టప్స్, చిన్న వ్యవస్థాపక సంస్థలకు ఏకంగా 52.5 కోట్ల రుణాలు ఇవ్వడంతో పాటు కరోనా సమయంలో 20 కోట్ల మంది మహిళలకు పలు పథకాల ద్వారా నగదు సహాయం అందించారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.  

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Ayodhya Ram Mandir News: అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget