News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

ABP-CVoter Snap Poll: మహిళా రిజర్వేషన్లపై సామాన్యుల రియాక్షన్‌ ఇదే- ఏబీపీ సీఓటర్‌ సర్వే ఫలితాలు

పార్లమెంట్‌ ఆమోదం పొందిన మహిళా బిల్లు చట్టరూపం దాల్చేదెప్పుడు. మహిళలకు 33% రిజర్వేషన్లు అమల్లోకి వచ్చేదెప్పుడు. మహిళా బిల్లుపై సామాన్య ఓటర్ల ఏమనుకుంటున్నారు? ఏబీపీ-సీఓటర్‌ స్నాప్ పోల్‌లో ఏం తేలింది?

FOLLOW US: 
Share:

మహిళా రిజర్వేషన్ బిల్లు మూడు దశాబ్దాల కల. ఇప్పటికే పార్లమెంట్‌ ఉభయసభలు ఈ బిల్లును ఆమోదించాయి. లోక్‌సభలో ఇద్దరు ఎంపీలు ఈ బిల్లును వ్యతిరేకించగా... రాజ్యసభలో ఏకగ్రీవంగా అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. ఉభయసభల ఆమోదం తర్వాత బిల్లు రాష్ట్రపతి వద్దకు చేరింది. రాష్ట్రపతి సంతకం పెట్టడమే మిగిలింది.  మరోవైపు... మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజకీయం వేడెక్కింది. మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదమైతే పొందింది కానీ.. అమల్లోకి రావాలంటే పదేళ్లుపైగా పడుతోందని  విమర్శిస్తున్నారు ప్రతిపక్షాలు. తక్షణమే మహిళా రిజర్వేషన్‌ బిల్లును అమల్లోకి తేవాలని డిమాండ్‌ చేస్తున్నారు. రాజకీయ పార్టీల సంగతి సరే... సామాన్య ఓటర్ల సంగతి  ఏంటి...? అసలు మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై వాళ్లు ఏమనుకుంటున్నారు..? అది తెలుసుకునే ప్రయత్నం చేసింది ఏబీపీ. అందుకోసం... ఏబీపీ-సీఓటర్‌ స్నాప్ పోల్‌  నిర్వహించింది..? అందులో ఏం తేలిందంటే..?

మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై ABP- CVoter స్నాప్ పోల్‌ ఫలితాలు
మహిళా రిజర్వేషన్ల విధానం చట్టంగా మారిన తర్వాత.. వెంటనే అమల్లోకి తేవాలన్నది మెజరిటీ ఓటర్ల అభిప్రాయంగా తేలింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మీరు మద్దతు  ఇస్తున్నారా లేదా అంటూ ABP-CVoter సర్వే నిర్వహించిన సర్వేలో 5వేల 403 మంది ఓటర్లు పాల్గొన్నారు. వీరిలో 75శాతం మంది సానుకూలంగా స్పందించారు. ఈ 75శాతం మందిలో 71.6శాతం మంది ప్రతిపక్షాలకు మద్దతు ఇవ్వగా... 80.2 శాతం మంది బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్‌కు మద్దతు ఇచ్చారు. వివిధ కారణాల వల్ల దాదాపు 14 శాతం మంది మాత్రమే బిల్లును వ్యతిరేకించారు.

మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తే... మహిళలకు సాధికారత, చట్టసభల్లో మెరుగైన ప్రాతినిధ్యం కలుగుతుంది. దీని వల్లే మహిళ లోకాలికి న్యాయం జరుగుతుందని...  మహిళల సమస్యలకు సంబంధించి మెరుగైన విధానాలు రూపొందించబడతాయని చెప్తున్నారు. మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వచ్చి... చట్టసభల్లో మహిళలకు మెరుగైన  ప్రతినిధ్యం కల్పిస్తే... మహిళా లోకాలనికి నిజంగానే మేలుజరుగుతుందా? ఇవే అనుమానాలు సామాన్య ప్రజల్లోనూ ఉన్నాయి. అందుకే దీనిపై కూడా ఏబీపీ-సీఓటర్‌ స్నాప్‌  పోల్‌ నిర్వహించింది. చట్టసభల్లో మహిళలకు అధిక ప్రాతినిధ్యం కల్పించడం వల్ల... మహిళల సమస్యలకు సంబంధించి మెరుగైన విధానాలు రూపొందించబడుతుందని మీరు  భావిస్తున్నారా అని ప్రశ్నించగా... 63.7శాతం మంది ప్రజలు సానుకూలంగా స్పందించారు. 24.2శాతం మంది అలా భావించడంలేదని చెప్పారు. 

మహిళా రిజర్వేషన్ల వల్ల... దాదాపు 30శాతం మంది అర్హులైన పురుష అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందన్న వాదన కూడా ఉంది. దీనిపై కూడా సర్వే జరిగింది. మహిళా  రిజర్వేషన్లు అమలు చేయడం వల్ల అర్హులైన పురుష అభ్యర్థుల అవకాశాలు తగ్గుతాయని మీరు భావిస్తున్నారా అని ప్రశ్నించగా... 29.2శాతం మంది అవునని సమాధానం  ఇచ్చారు. 45.6 శాతం మంది లేదు అని కొట్టిపారేశారు. 25శాతం మంది మాత్రం తెలియదు, చెప్పలేము అంటూ దాటవేశారు. 

మహిళా బిల్లు అమోదమైతే పొందింది కానీ... అమలు కావాలంటే మాత్రం పదేళ్లు ఆగాల్సిందే. 2024 ఎన్నికల తర్వాత..  జనాభా లెక్కలు నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం  స్పష్టం చేసింది. ఆ జనాభా లెక్కల ఆధారంగా... డీలిమిటేషన్ కసరత్తు మొదలవుతుంది. డీలిమిటేషన్‌ ప్రక్రియ పూర్తయ్యాక... మహిళా రిజర్వేషన్లు పక్కాగా అమలు  చేస్తామని అంటోంది మోడీ సర్కార్‌. మోడీ ఉండగా ఆందోళన చెందాల్సి అవసరం లేదని అంటున్నారు బీజేపీ నేతలు. ఈ పరిస్థితుల్లో... మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం...  మహిళా సాధికారత దిశగా పడిన ఒక అడుగు మాత్రమే అన్నది వాస్తవం అంటున్నారు ఓటర్లు. 

[Disclaimer: This survey was based on CVoter personal interviews conducted among 5,403 adults across India. Sometimes the table figures do not sum to 100 due to the effects of rounding off. The survey was conducted from Saturday to Sunday afternoon. The Margin of error is +/- 3% at the macro level and +/- 5% at the micro level. We believe this will give the closest possible resemblance to the trends.]

Published at : 24 Sep 2023 10:03 PM (IST) Tags: Modi NDA ABP CVoter Snap Poll INDIA Women's Reservation Bill Voters Thinking

ఇవి కూడా చూడండి

UPSC Mains Result 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 'మెయిన్' ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

UPSC Mains Result 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 'మెయిన్' ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

TMC MP Expulsion: టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు - ఇక సీబీఐతో వేధిస్తారని మహువా సంచలన ఆరోపణలు

TMC MP Expulsion: టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు - ఇక సీబీఐతో వేధిస్తారని మహువా సంచలన ఆరోపణలు

Bharat Ki Baat Year Ender 2023 : చంద్రునిపైకి చేరిన భారత కీర్తి పతాక - 2023లో భారత్ సాధించిన అద్భుతం చంద్రయాన్ 3

Bharat Ki Baat Year Ender 2023 :  చంద్రునిపైకి చేరిన భారత కీర్తి పతాక - 2023లో భారత్ సాధించిన అద్భుతం చంద్రయాన్ 3

Bank of Baroda Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 250 సీనియర్ మేనేజర్ పోస్టులు, ఈ అర్హతలుండాలి

Bank of Baroda Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 250 సీనియర్ మేనేజర్ పోస్టులు, ఈ అర్హతలుండాలి

Home Loan: ఆర్‌బీఐ పాలసీ ప్రభావం హోమ్‌ లోన్స్‌ మీద ఎలా ఉంటుంది, ఇప్పుడు గృహ రుణం తీసుకోవచ్చా?

Home Loan: ఆర్‌బీఐ పాలసీ ప్రభావం హోమ్‌ లోన్స్‌ మీద ఎలా ఉంటుంది, ఇప్పుడు గృహ రుణం తీసుకోవచ్చా?

టాప్ స్టోరీస్

Revanth Reddy Resigns: రేవంత్‌ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్‌ లెటర్ అందజేత

Revanth Reddy Resigns: రేవంత్‌ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్‌ లెటర్ అందజేత

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే

Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?

Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?

CM Jagan Vs TDP : టీడీపీ, వైసీపీ మధ్య పొటాటో రాజకీయం - అంతా జగనే చేశారా ?

CM Jagan Vs TDP :   టీడీపీ, వైసీపీ మధ్య పొటాటో రాజకీయం -  అంతా జగనే చేశారా ?