అన్వేషించండి

India-Pakistan Border Surveillance: భారత్‌ సైనిక వ్యూహాత్మక స్థావరాలను చైనా కన్నుతో చూస్తోన్న పాక్‌!ఐఎస్‌ఐ కుట్రలు బహిర్గతం!

భారత్‌ సరిహద్దు రాష్ట్రాల్లోని వ్యూహాత్మక సైనిక స్థావరాలపై చైనా సీసీటీవీ కెమెరా ద్వారా పాకిస్థాన్ నిఘా పెట్టినట్టు వెలుగులోకి వచ్చింది. ఐఎస్‌ఐ చేపట్టిన గూఢచర్యను ఢిల్లీ పోలీసులు  ఛేదించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • చైనా సీసీటీవీ కెమెరాలతో పాక్ ఐఎస్ఐ భారత సైనిక స్థావరాలపై నిఘా.
  • సరిహద్దు రాష్ట్రాల్లోని కీలక ప్రాంతాల్లో హైటెక్ కెమెరాల ఏర్పాటు వెలుగులోకి.
  • భారత సైనిక కదలికల సమాచారం చైనా మీదుగా పాకిస్తాన్‌కు చేరవేత.
  • దుబాయ్ కేంద్రంగా భారతీయుడు, బబ్బర్ ఖల్సా సంబంధాలతో కుట్ర వెలుగులోకి.

India-Pakistan Border Surveillance: భారత్‌ అంతర్గత భద్రతకు సంబంధించిన ఒక దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. మన దేశంలోని అత్యంత కీలకమైన సైనిక స్థావరాల, సరిహద్దు భద్రతా దళాల కదలికలపై పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ పర్యవేక్షిస్తున్నట్టు తేలింది. చైనా తయారు చేసిన సీసీటీవీ కెమెరాలతో ఈ పని చేసినట్టు బహిర్గతమైంది. ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం చేపట్టిన లోతైన దర్యాప్తులో ఈ భారీ అంతర్జాతీయ కుట్ర వెలుగు చూసింది. 

పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్, జమ్ముకశ్మీర్ వంటి సరిహద్దు రాష్ట్రాల్లోని కీలక రక్షణ ప్రాంతాల సమీపంలో ఈ నిఘా నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా కపుర్తలా, జలంధర్‌, పఠాన్‌కోట్‌, పాటియాలా, మోగా, అంబాలా, కతువా, బికనీర్‌, అల్వార్ వంటి ప్రాంతాల్లో 9 హైటెక్ పీసీటీవీ కెమెరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

ఈ కెమెరాలు కేవలం సాధారణ‌ నిఘా పరికరాలు కావు. ఇవి సోలార్ శక్తితో పని చేస్తూ, సిమ్ కార్డ్ ద్వారా ఇంటర్నెట్‌కు అనుసంధానించారు. రవాణా వ్యాపారంలో ట్రక్కుల కదలికలను పర్యవేక్షించే నెపంతో వీటిని వ్యూహాత్మక ప్రాంతాల్లో అమర్చారు. 

భారత్ నుంచి చైనా మీదుగా పాకిస్తాన్‌కు డేటా 

ఈ కుట్రలో చైనాకు చెందిన EswwCloud అనే ప్లాట్‌ఫామ్ కీలక పాత్ర పోషించింది. భారత్ సైనిక స్థావరాల సమీపంలో ఏర్పాటు చేసిన కెమెరాల నుంచి వచ్చే లైవ్‌ విజువల్స్‌ ముందుగా చైనాలోని డేటా సెంటర్‌కు చేరతాయి. అక్కడి నుంచి ఆ సమాచారాన్ని పాకిస్థాన్‌లోని ఐఎస్‌ఐ హ్యాండ్లర్లకు చేరవేసేవారు. దాదాపు మూడు నెలల పాటు మన సైనిక కదలికలు, లాజిస్టిక్స్‌, భద్రతా ఏర్పాట్లను పాక్ నిరంతరం గమనించగలిగింది. 

కుట్ర వెనుక ఉన్నదెవరు? 

ఈ ఆపరేషన్‌ను పాకిస్తాన్‌కు చెందిన కెప్టెన్ రాణా అనే కోడ్ నేమ్‌ తో ఉన్న ఐఎస్‌ఐ హ్యాండ్లర్ పర్యవేక్షించగా, దుబాయ్ కేంద్రంగా ఉన్న ఒక భారతీయుడు దీనిని నడిపించారు. ఢిల్లీ, పంజాబ్ నుంచి ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వీరికి నిషేధిత ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌తో సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. 

ఈ నెట్‌వర్క్ నిర్వహణకు నిధులు యూపీఐ అకౌంట్ల ద్వారా అందేవి. ఆయుధాలను అక్రమంగా రవాణా చేయడం ద్వారా వచ్చిన సొమ్ముతో ఈ గూఢచర్య కార్యకలాపాలకు వినియోగించారు. స్పెయిన్, జర్మనీ, దుబాయ్‌లలో ఉన్న స్లీపర్‌ సెల్స్ సహాయంతో ఈ కెమెరాలను సరైన ప్రదేశాల్లో అమర్చినట్టు దర్యాప్తులో తేలింది. 

Also Read: అయోధ్య రామాలయంలో కృత్రిమ అఖండ జ్యోతి - ట్రస్ట్ తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు

ఎందుకీ నిఘా?

భవిష్యత్‌లో యుద్ధం లేదా ఘర్షణలు తలెత్తినప్పుడు, భారత సైన్యం ఎటువైపు నుంచి కదులుతుంది. ఎక్కడ మోహరిస్తుంది అనే అంశాలపై రియల్ టైమ్‌ సమాచారం కలిగి ఉండటమే పాక్ లక్ష్యం. ప్యాటర్న్‌ ఆఫ్‌ లైఫ్‌ అనే పద్ధతి ద్వారా ఉన్నతాధికారుల కదలికలు, సైనిక వాహనాల రాకపోకలను విశ్లేషించి కచ్చితమైన లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి ఐఎస్‌ఐ ఈ ఎత్తుగడ వేసింది. 

ఇదే తరహా నిఘా పద్ధతులను ఇజ్రాయెల్‌ నిఘా సంస్థలు తంలో ఇరాన్‌లో ఉపయోగించినట్టు నివేదికలు చెబుతున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ట్రాఫిక్ కెమెరాలను హ్యాక్‌ చేసి, అక్కడి అగ్రనేతల కదలికలను ఇజ్రాయెల్‌ పర్యవేక్షించేది. ఇప్పుడు పాకిస్థాన్‌ కూడా ఇదే తరహాలో సాంకేతికతను ఉపయోగించి భారత్ సరిహద్దు రాష్ట్రాల్లో తిష్ట వేయం భద్రతా వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది. 

Frequently Asked Questions

భారత్‌లో ఐఎస్‌ఐ నిఘా ఎలా పనిచేస్తోంది?

చైనా తయారు చేసిన సీసీటీవీ కెమెరాలను ఉపయోగించి, సరిహద్దు రాష్ట్రాల్లోని కీలక సైనిక స్థావరాలు, దళాల కదలికలపై ఐఎస్‌ఐ నిఘా పెట్టింది. ఈ కెమెరాలు సోలార్ శక్తితో పనిచేస్తూ, సిమ్ కార్డ్ ద్వారా ఇంటర్నెట్‌కు అనుసంధానించబడి ఉన్నాయి.

ఈ నిఘా నెట్‌వర్క్‌లో చైనా పాత్ర ఏమిటి?

చైనాకు చెందిన EswwCloud అనే ప్లాట్‌ఫామ్ ఈ కుట్రలో కీలక పాత్ర పోషించింది. కెమెరాల నుండి వచ్చే లైవ్‌ విజువల్స్‌ ముందుగా చైనాలోని డేటా సెంటర్‌కు చేరి, అక్కడి నుంచి పాకిస్థాన్‌కు చేరవేస్తున్నారు.

ఈ కుట్ర వెనుక ఎవరున్నారు?

పాకిస్థాన్‌కు చెందిన కెప్టెన్ రాణా అనే ఐఎస్‌ఐ హ్యాండ్లర్ ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షించగా, దుబాయ్ కేంద్రంగా ఉన్న ఒక భారతీయుడు దీనిని నడిపించారు. వీరితో పాటు బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌తో సంబంధాలున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

ఐఎస్‌ఐ ఈ నిఘాను ఎందుకు నిర్వహిస్తోంది?

భవిష్యత్‌లో యుద్ధాలు లేదా ఘర్షణలు తలెత్తినప్పుడు, భారత సైన్యం ఎటువైపు నుంచి కదులుతుందో, ఎక్కడ మోహరిస్తుందో తెలుసుకుని, కచ్చితమైన లక్ష్యాలను నిర్దేశించుకోవడమే పాక్ లక్ష్యం.

టాప్ హెడ్ లైన్స్

Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Sukhbir Singh Badal News: నాందేడ్‌లో సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై కత్తితో దాడి!  
నాందేడ్‌లో సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై కత్తితో దాడి!  
Digital India: డిజిటల్ ఇండియా మీ జీవితాన్ని ఎలా మార్చింది?
డిజిటల్ ఇండియా మీ జీవితాన్ని ఎలా మార్చింది?
Parliament Monsoon Session: లోక్‌సభ నిరవధికంగా వాయిదా!సమావేశాల చివరి రోజున అమిత్ షా రాక!
లోక్‌సభ నిరవధికంగా వాయిదా!సమావేశాల చివరి రోజున అమిత్ షా రాక!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget