India Pakistan Attack News Live: ఉల్లంఘనలపై పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ది చెప్పండి, ఆర్మీకి కేంద్రం ఆదేశాలు
India Pakistan Attack News Live:శుక్రవారం నాడు, పాకిస్తాన్ మరోసారి భారతదేశంలోని వివిధ నగరాల్లో డ్రోన్ దాడులకు ప్రయత్నించింది, కానీ భారత సైన్యం ఆ డ్రోన్ దాడులను భగ్నం చేసింది.

Background
India Pakistan Attack News Live:ఆపరేషన్ సిందూర్‌లో 9 ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమై, 90 మందికి పైగా ఉగ్రవాదులు మరణించడంతో పాకిస్తాన్ తీవ్ర భయాందోళనలో ఉంది. పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ తన దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, ఆపరేషన్ సిందూర్‌లో చిందిన ప్రతి రక్తపు బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరించారు. అదే సమయంలో, పాకిస్తాన్ సైన్యానికి ప్రతీకారం తీర్చుకోవడానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు ఇంటర్-సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ డిజి అన్నారు.
ఇంతలో, గురువారం (మే 8, 2025)న, పాకిస్తాన్ సైన్యం అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్‌సర్, కపుర్తలా, జలంధర్, లూథియానా, ఆదంపూర్, భటిండా, చండీగఢ్, నల్, ఫలోడి, ఉత్తర్‌లై, భుజ్‌తో సహా ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని అనేక సైనిక స్థావరాలపై దాడి చేయడానికి విఫల ప్రయత్నం చేసింది. భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుని, PAK సైన్యం చేసిన అన్ని ప్రయత్నాలను విఫలం చేసింది.
భారత సైన్యం S-400 సుదర్శన్ చక్ర వైమానిక రక్షణ క్షిపణి వ్యవస్థ ద్వారా పాకిస్తాన్ ప్రణాళికలను భగ్నం చేసింది. సుదర్శన్ చక్ర వాయు రక్షణ క్షిపణి వ్యవస్థ , భారత్ ప్రతీకార చర్య కారణంగా పాకిస్తాన్ వాయు రక్షణ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది.
గురువారం రాత్రి భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నం విఫలమైనందున, ఇస్లామాబాద్ లేహ్ నుంచి సర్ క్రీక్ వరకు 36 ప్రదేశాలలో 300 నుంచి 400 టర్కిష్ డ్రోన్‌లను ప్రయోగించిందని ప్రభుత్వం తెలిపింది.
శుక్రవారం రాత్రి, శ్రీనగర్ విమానాశ్రయంతో సహా దేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాలలో 26 ప్రదేశాల‌్లో పాకిస్తాన్ చేసిన డ్రోన్ దాడిని భారతదేశం తిప్పికొట్టింది. వరుసగా మూడవ రాత్రి, పాకిస్తాన్ భారతదేశంలోని అనేక నగరాలను లక్ష్యంగా చేసుకుంది. ఈసారి, ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా నుంచి గుజరాత్‌లోని భుజ్ వరకు ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది.
శ్రీనగర్‌లోని రక్షణ అధికారులు, దక్షిణ కాశ్మీర్‌లోని శ్రీనగర్ విమానాశ్రయం, అవంతిపోరా వైమానిక స్థావరం సహా అనేక స్థావరాలపై డ్రోన్ దాడులను శుక్రవారం రాత్రి ఆలస్యంగా తిప్పికొట్టారని, జమ్మూ, దక్షిణ కాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయని తెలిపారు.
పాకిస్తాన్ నుంచి వైమానిక బెదిరింపులను ఊహించి సైరన్లు మోగించడం ప్రారంభించడంతో అనేక సరిహద్దు జిల్లాల స్థానికులకు ఇది వరుసగా రెండో భయానక రాత్రిగా మారింది, వీటిని సాయుధ దళాలు సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి.
శ్రీనగర్, జమ్మూ నుంచి పంజాబ్‌లోని అనేక జిల్లాలు , రాజస్థాన్‌లోని జైసల్మేర్, జోధ్‌పూర్ వరకు, సరిహద్దు ప్రాంతాలలోని పెద్ద ప్రాంతాలు అంధకారంలో ఉండిపోయాయి.. ముందు జాగ్రత్త చర్యగా ప్రజలు తమ ఇళ్లలో లైట్లు ఆపివేయాలని అధికారులు బహిరంగ ప్రకటనలు జారీచేశారు.
జమ్మూ, సాంబా జిల్లాల సుచేత్‌గఢ్, రామ్‌గఢ్ సెక్టార్లలో అంతర్జాతీయ సరిహద్దులో పాకిస్థాన్ బారీగా దాడులకు యత్నించింది. కాల్పులకు తెగబడింది. అదే సమయంలో భారతదేశం కూడా ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్‌కు చెందిన నాలుగు వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. వాటిపై దాడి చేసినట్టు పాకిస్థాన్ సైన్యం కూడా అంగీకరించింది. సరిహద్దుల్లో పదే పదే కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడుతున్న పాకిస్థాన్ సైన్యానికి గట్టిగానే ఇండియన్ ఆర్మీ బుద్ది చెబుతోంది.
India Pakistan Attack News Live: 'సైన్యానికి పూర్తి స్వేచ్ఛ' విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి సంచలన ప్రకటన
India Pakistan Attack News Live: పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించిందని, ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి అన్నారు. కఠినమైన చర్య తీసుకోవాలని సైన్యాన్ని ఆదేశించారు. దీనిపై ఇది నిఘా ఉంచుతోందన్నారు.
India Pakistan Attack News Live: ఉల్లంఘనలపై పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ది చెప్పండి, ఆర్మీకి కేంద్రం ఆదేశాలు
India Pakistan Attack News Live: "గత కొన్ని రోజులుగా జరుగుతున్న సైనిక చర్యను ఆపడానికి భారతదేశం, పాకిస్తాన్ DGMOల మధ్య ఒక అవగాహన కుదిరింది. గత కొన్ని గంటలుగా, ఈ అవగాహనను పాకిస్తాన్ ఉల్లంఘిస్తోంది. భారత సైన్యం ఈ సరిహద్దు చొరబాటుకు ప్రతీకారం తీర్చుకుంటోంది.ఈ చొరబాటు ఖండించదగినది. దీనికి పాకిస్తాన్ బాధ్యత వహించాలి. ఈ పరిస్థితిని సరిగ్గా అర్థం చేసుకుని ఇలాంచి చర్యలను ఆపడానికి వెంటనే తగిన చర్య పాకిస్తాన్ ఈ తీసుకుంటుందదని విశ్వసిస్తున్నాము" అని మిస్రి అన్నారు.





















